ViralDivyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/students-hilles-internet-mejooram-384c24ec-6050-47fc-b179-561f1b73b423-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/students-hilles-internet-mejooram-384c24ec-6050-47fc-b179-561f1b73b423-415x250-IndiaHerald.jpgకరోనా వచ్చిన తర్వాత లాక్ డౌన్ పెట్టడంతో విద్యార్థులు, ప్రజలు అందరూ ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఇక ముఖ్యంగా ఉన్నత చదువులు చదువుతున్న విద్యార్థులు, పరీక్ష సెంటర్లకు వెళ్లి పరీక్షలు రాయలేక, ఆన్లైన్ ద్వారానే క్లాసులు వినడం, పాఠాలు నేర్చుకోవడం, ఎగ్జామ్స్ కు అటెండ్ కావడం వంటివి చేస్తున్నారు. అయితే ఇవన్నీ చేయాలంటే మాత్రం తప్పకుండా మనం ఉపయోగించే మొబైల్ ఫోన్ లేదా ల్యాప్ టాప్ లలో ఇంటర్నెట్ కనెక్టివిటీ అనేది తప్పనిసరి. ఇక ఆన్లైన్ ఎగ్జామ్ అంటేనే తప్పకుండా ఇంటర్నెట్ ఉండాల్సిందే. ఇక ఇంటర్నెట్ లేకుండా ఏ పని చSTUDENTS HILLES INTERNET MEJOORAM{#}students;Manam;Smart phone;June;Population;Governmentఆన్లైన్ ఎగ్జామ్ కోసం ఆ రాష్ట్ర విద్యార్థులు ఏం చేశారో తెలుసా ?ఆన్లైన్ ఎగ్జామ్ కోసం ఆ రాష్ట్ర విద్యార్థులు ఏం చేశారో తెలుసా ?STUDENTS HILLES INTERNET MEJOORAM{#}students;Manam;Smart phone;June;Population;GovernmentTue, 08 Jun 2021 10:17:56 GMT
కరోనా వచ్చిన తర్వాత లాక్ డౌన్ పెట్టడంతో విద్యార్థులు, ప్రజలు అందరూ ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఇక ముఖ్యంగా ఉన్నత చదువులు చదువుతున్న విద్యార్థులు, పరీక్ష సెంటర్లకు వెళ్లి పరీక్షలు రాయలేక, ఆన్లైన్ ద్వారానే క్లాసులు వినడం, పాఠాలు నేర్చుకోవడం, ఎగ్జామ్స్ కు అటెండ్ కావడం వంటివి చేస్తున్నారు. అయితే ఇవన్నీ చేయాలంటే మాత్రం తప్పకుండా మనం ఉపయోగించే మొబైల్ ఫోన్ లేదా ల్యాప్ టాప్ లలో ఇంటర్నెట్ కనెక్టివిటీ అనేది తప్పనిసరి. ఇక ఆన్లైన్ ఎగ్జామ్ అంటేనే తప్పకుండా ఇంటర్నెట్ ఉండాల్సిందే. ఇక ఇంటర్నెట్ లేకుండా ఏ పని చేయలేము. అయితే ఇటీవలే ఆ రాష్ట్ర విద్యార్థులు కూడా ఇంటర్నెట్ లేక ఆన్లైన్ ఎగ్జామ్ రాయాలి అనే తపనతో ఇంటర్నెట్ ట్రాకింగ్ చేయడానికి ఏకంగా కొండపైకి ఎక్కేశారు. అయితే ఆ వివరాలేంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం..


ఈశాన్య రాష్ట్రాలైన మిజోరాంలోని ఐజ్వాల్ దగ్గర 400 కిలోమీటర్ల దూరం లో ఉన్న సైహా జిల్లాకు సంబంధించిన ఒక మారుమూల గ్రామం.అదే మావ్రేయి. ఈ ఊరిలో ఇంటర్నెట్ సదుపాయం లేకపోవడంతో మిజోరాం  విశ్వవిద్యాలయానికి చెందిన ఏడు మంది అమ్మాయిలు త్లావ్ త్లా కొండ పైకి ఎక్కి మరీ ఇంటర్నెట్ ట్రాకింగ్  చేయడం మొదలుపెట్టారు. ఈ సమీప గ్రామాలలో ఇంటర్నెట్ లేని ఏకైక ప్రదేశం ఇది.


సరైన ఇంటర్నెట్ సదుపాయం లేకపోవడంతో, పిల్లలు అక్కడే అరటి తాటాకులతో ఒక వెదురు గుడిసె ను ఏర్పాటు చేసుకొని,  ప్రతికూల వాతావరణంలో ఆ గుడిసె లోపల కూర్చొని వారు అండర్ గ్రాడ్యుయేట్ పరీక్షలు రాయడం మొదలుపెట్టారు.
" style="height: 443px;">



ఈ విద్యార్థులలో ఒకరైన కె. ఎల్.వబీహ్రోసా మాట్లాడుతూ.. "మిజోరాం రాష్ట్రంలో సైదా జిల్లాలోని మారుమూల గ్రామంలో ముఖ్యంగా మావ్రేయి చుట్టుపక్కల  ప్రాంతం పూర్తిగా కొండలతో చుట్టుముట్టింది. కాబట్టే ఈ గ్రామంలో ఇంటర్నెట్ సదుపాయం లేదు".. అంటూ ఆ విద్యార్థి చెప్పుకొచ్చాడు.

ఇక ఈ మిజోరాం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 24 వేల మంది విద్యార్థులు అండర్ గ్రాడ్యూయేట్ కోసం అప్లై చేసుకున్నారు. ఇక విద్యార్థుల కోసం విశ్వవిద్యాలయం జూన్ లో ఆన్లైన్ పరీక్షలను నిర్వహిస్తోంది. ఇక దేశం మొత్తం ఫైవ్ జి నెట్వర్క్ కోసం ఎదురు చూస్తూ ఉంటే, ఇక్కడ ఉన్న మొత్తం 1700 మంది జనాభా కేవలం 2జీ కోసమే తాపత్రయపడుతున్నారు..


ఈ సందర్భంగా ఆ రాష్ట్ర మారా స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ఎన్ బీరా సాచాయ్ మాట్లాడుతూ.." ఈ గ్రామంలో ఫోర్ జీ నెట్వర్క్ లేదు. కానీ ఇక్కడ పిల్లలు మాత్రం బాగా చదవాలి అనే తపనతోనే, ఎగ్జామ్ రాయడానికి ఇంటర్నెట్ ట్రాకింగ్ చేయడం కోసం కొండపైకి ఎక్కి మరీ పరీక్షలు రాయడం మనం గమనిస్తున్నాం. అయితే ఈ సమస్యలను ప్రభుత్వం త్వరగా పరిష్కరించాలని, నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను.. "అంటూ ఆయన కోరారు.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఆర్‌ఆర్‌ఆర్‌కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన సీఐడీ.. చిక్కుల్లో పడ్డట్టేనా..?

పోకిరి సినిమా రికార్డును బద్దలు కొట్టిన రంగస్థలం..!

అమూల్ రెడ్డి ఎన్నాళ్లీ ప్రతీకార పాలన?

ఆ టైపు సినిమాలకు ట్రెండ్ సెట్టర్ బాలకృష్ణ సమరసింహా రెడ్డి..!!

నితిన్ భారీ బడ్జెట్ సినిమా ఆ హీరో వల్లే ఆగిందా ?

ఏనుగు తెలివికి హాట్సాఫ్.. అచ్చం మనిషి లాగా?

ఇండియన్ చాక్లెట్ బ్రాండ్‌కి అరుదైన గౌరవం..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>