PoliticsVAMSIeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/narendra-modhee-is-great3209d1ec-f872-4fd4-92cb-ea954183da01-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/narendra-modhee-is-great3209d1ec-f872-4fd4-92cb-ea954183da01-415x250-IndiaHerald.jpgదేశ ప్రధాని కావడం అంటే చిన్న విషయమేమీ కాదు, కోట్లాది ప్రజలకు మార్గదర్శిగా మారి పాలన సాగించాల్సి ఉంటుంది. ప్రజల నాడి సరిగ్గా పట్టుకున్న నాయకుడే ఎక్కువ కాలం సింహాసనంపై పాలన సాగించగలరు అన్నది అక్షర సత్యం. లేదంటే ఓటు వేసి గెలిపించిన అదే ప్రజలు తదుపరి ఎలక్షన్ సమయంలో గద్దె దించేందుకు ఏమాత్రం వెనుకాడరు.NARENDRA MODHEE IS GREAT{#}Prime Minister;India;Populationమోదీ అసలు సిసలైన నాయకుడా ? నిజమెంత ?మోదీ అసలు సిసలైన నాయకుడా ? నిజమెంత ?NARENDRA MODHEE IS GREAT{#}Prime Minister;India;PopulationTue, 08 Jun 2021 14:04:07 GMTదేశ ప్రధాని కావడం అంటే చిన్న విషయమేమీ కాదు, కోట్లాది ప్రజలకు మార్గదర్శిగా మారి పాలన సాగించాల్సి ఉంటుంది. ప్రజల నాడి సరిగ్గా పట్టుకున్న నాయకుడే ఎక్కువ కాలం  సింహాసనంపై పాలన సాగించగలరు అన్నది అక్షర సత్యం. లేదంటే ఓటు వేసి గెలిపించిన అదే ప్రజలు తదుపరి ఎలక్షన్ సమయంలో గద్దె దించేందుకు ఏమాత్రం వెనుకాడరు. అందుకనే ముందుగా నాయకులు ప్రజల మనసును చదవాల్సి ఉంటుంది, వారి కష్టాలను గమనించి భవిష్యత్తు తీర్చిదిద్దాల్సి ఉంటుంది, అభివృద్ధి పథంలో దేశాన్ని ముందుకు నడిపే నాయకుడిగా అన్ని బాధ్యతలు చేపట్టాల్సి ఉంటుంది. అయితే ఈ సమయంలో కొన్ని తప్పులు దొర్లడం సహజమే. కానీ విపత్కర పరిస్థితుల్లో తీసుకునే  నిర్ణయాలు సరిగా లేనట్లైతే దేశ ప్రజలు ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఇది ప్రజల ప్రాణాలకే ముప్పు కావచ్చు. ప్రస్తుతం భారతదేశం అలాంటి పరిస్థితులనే ఎదుర్కొంటోంది అంటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు.

భారత ప్రధాని నరేంద్ర మోడీ కరోనా విజృంభిస్తున్న తొలినాళ్ళలో సరైన అంచనా వేసి ప్రణాళికలు రూపొందించడంలో అలక్ష్యం చేశారని, సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోకుండా దేశాన్ని ప్రమాదంలోకి నెట్టేశారని ఇప్పటికే దేశమంతా కోడై కూస్తోంది. ముఖ్యంగా వ్యాక్సినేషన్  విషయంలో తీవ్ర అసంతృప్తి వినిపిస్తోంది . కానీ ఆ అరుపులు మాత్రం మోడీ చెవులకి వినపడటం లేదు. నిజానికి ఆయన వరకు చేరనివ్వడం లేదు అంటున్నారు కొందరు మేధావులు. ఆయన చుట్టూ ఉండే వారంతా కలిసి అద్దాల భవనాన్ని నిర్మించి ఆర్తనాదాలు వినిపించకుండా, కనిపించే దృశ్యాలకు వేరే లెక్కలు చెప్పి మభ్యపెడుతున్నారు అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. ఇక తాజాగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న పోస్ట్ చూస్తే అందరూ అవాక్ అవ్వాల్సిందే. "మోడీ ఈజ్ ద బెస్ట్" అనేలా ఈ పోస్ట్ ని చాలా అందంగా రెడీ చేసారు.

అదేంటంటే మన దేశ జనాభా 139 కోట్లు కాగా, జన సాంద్రత లెక్క పరంగా చూస్తే చాలా దేశాల్లో ఇంత భారీగా జన సాంద్రత ఉండదు. ఆ తరహాలో ఈ 139 కోట్ల జనాభాను వివిధ దేశాల పరంగా పంచి చూస్తే, ఆ లెక్క 87 దేశాలకు సమానమని చూపించారు. అంటే వారు చెబుతున్నది. 87 దేశాలు ఈజ్ ఈక్వల్ టు మన భారతదేశం అన్నమాట. కాబట్టి ఈ 87 దేశాలలో కరోనా విజృంభణ స్థాయితో పోల్చుకుంటే మనదేశంలో చాలా చాలా తక్కువేనని ఆ క్రెడిట్ అంతా మోడీకే దక్కుతుందని లెక్కలు వేసి సింపుల్ గా చెప్పేస్తున్నారు. 87 దేశాల్లో 8.41 కోట్ల కరోనా కేసులు నమోదు కాగా, మన భారత్ లో మాత్రం ఈ వ్యాప్తి చాలా తక్కువే అని 2.18 కోట్ల కేసులే నమోదయ్యాయని పోల్చి చూపించారు.

ఇక కరోనా మరణాల విషయానికి వస్తే యూరోప్, మరియు నార్త్ అమెరికాలో మొత్తం 19 లక్షల మంది కరోనా కాటుకు బలికాగా, మన ఇండియాలో మాత్రం 2.38 లక్షల మంది మరణించారని, ఇక్కడ కూడా చాలా తక్కువేనని లెక్కలు చూపించారు. ఈ లెక్కలన్నీ పరిశీలించగా 87 దేశాలతో పోలిస్తే మన దేశ ప్రధాని మోడీ ఎంత గొప్ప వారో ఎలా దేశంలో కరోనాని కంట్రోల్ చేసి ప్రమాదం మించకుండా జాగ్రత్త పడ్డారో అన్నట్లుగా వివరించారు. అయితే ఇది చూసిన నెటిజన్లు కొందరు ఈ లెక్కలన్నీ ప్రధాని మోదీ ముందు మ్యాజిక్ చేసేందుకు బాగానే పని చేస్తాయేమో అసలు వాస్తవం ఏంటి ? 87 దేశాలు అంటూ పోల్చి చెప్పడం ఎందుకు ఎదురుగా మనకు మించిన జనాభా గల చైనా ఉందిగా ఆదేశ లెక్కలతో పోల్చి చెప్పండి చాలు ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది అంటున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మంచిమాట : ప్రవర్తనలో ఇతరులను అనుకరించరాదు.

సూర్య మూవీ లేటెస్ట్ అప్డేట్..!

"స్వయం కృషి" మెగా ట్రెండ్ సెట్టర్ ... !

12మంది అమ్మాయిల జీవితాలతో ఆడుకున్న ఘరానా మోసగాడు..!

వ్యాక్సినేష‌న్ లో ముంబై రికార్డ్ ... ఒక్క రోజులోనే..?

ఎన్టీఆర్ కొరటాల సినిమాలో కీలక పాత్రలో కన్నడ హీరో ?

నేడు ప్రపంచ బ్రెయిన్ ట్యూమర్ డే..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>