PoliticsChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/cyber-neragallatho-kastha-jagratha-suma-lekunte-bank-katha-kali5cb18824-e836-4c52-8d90-87457d11aee8-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/cyber-neragallatho-kastha-jagratha-suma-lekunte-bank-katha-kali5cb18824-e836-4c52-8d90-87457d11aee8-415x250-IndiaHerald.jpgసైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త తరహా మోసాలతో విరుచుకు పడుతున్నారు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా లక్షలు సమర్పించుకోవడం ఖాయం అని చెబుతున్నారు పోలీసులు. తాజాగా మూడు సైబర్ క్రైమ్ కేసులు నమోదయ్యాయి. ఆ వివరాలలోకి వెళితే నకిలీ మెయిల్ తో సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసానికి తెగబడ్డారు. కొన్ని ప్రముఖ వెబ్ సైట్ ల సిఈఓల మెయిల్ పేరుతో నకిలీ మెయిల్ తయారు చేశారు సైబర్ నేరగాళ్ళు. తెలంగాణ గనులు భూగర్భ శాఖ డైరెక్టర్ పేరుతో నకిలీ మెయిల్ సృష్టించారు. తాను మీటింగ్ లో ఉన్నానని..అత్యవసరంగా 10 వేల రూపాయల అమెజాన్ గిఫ్ట్cyber crimes{#}Telangana;Director;Amazon;Gift;Hyderabad;India;Smart phoneసైబర్ మాయ.. నిండా ముంచేస్తారు.. జర జాగ్రత్త బాసూ!సైబర్ మాయ.. నిండా ముంచేస్తారు.. జర జాగ్రత్త బాసూ!cyber crimes{#}Telangana;Director;Amazon;Gift;Hyderabad;India;Smart phoneTue, 08 Jun 2021 11:16:00 GMTసైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త తరహా మోసాలతో విరుచుకు పడుతున్నారు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా లక్షలు సమర్పించుకోవడం ఖాయం అని చెబుతున్నారు పోలీసులు. తాజాగా మూడు సైబర్ క్రైమ్ కేసులు నమోదయ్యాయి. ఆ వివరాలలోకి వెళితే

 

నకిలీ మెయిల్ తో

సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసానికి తెగబడ్డారు.  కొన్ని ప్రముఖ వెబ్ సైట్ ల సిఈఓల మెయిల్ పేరుతో నకిలీ మెయిల్ తయారు చేశారు సైబర్ నేరగాళ్ళు. తెలంగాణ గనులు భూగర్భ శాఖ డైరెక్టర్ పేరుతో నకిలీ మెయిల్ సృష్టించారు. తాను మీటింగ్ లో ఉన్నానని..అత్యవసరంగా 10 వేల రూపాయల అమెజాన్ గిఫ్ట్ కార్డు పంపాలని క్రింది స్థాయి ఉద్యోగులకి దాని ద్వారా మెయిల్ పంపారు. నిజమే అనుకొని నిజామాబాద్ గనుల శాఖ అధికారి గిఫ్ట్ కార్డు పంపారు. మరో ఇద్దరు కూడా పంపినట్లు అనుమానం వ్యక్తం అవుతోంది. విషయం తెలుసుకుని హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు గనులు భూగర్భ శాఖ డైరెక్టర్ రోనాల్డ్ రోస్  ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. 

 

ఆర్‌టిపిసిఆర్ పరీక్షలు చేస్తామంటూ 

ఇక మరో పక్క కోవిడ్ ఆర్‌టిపిసిఆర్ పరీక్షలు చేస్తామంటూ మోసం చేసిన విషయం కూడా వెలుగులోకి వచ్చింది. ఇండియా మార్ట్ లో హైదరాబాద్ పాత బస్తీ కి చెందిన వ్యక్తి లాగిన్ అయి ఆర్టీపీసీఆర్ టెస్టులకు సంబందించిన సెర్చ్ చేశారు. దీంతో ఆర్టీపీసీఆర్ టెస్టులు చేస్తామని సైబర్ నేరగాళ్ల నుంచి ఫోన్ వచ్చింది. దీంతో తన ఇంట్లో పది మంది ఉన్నారని బాధితుడు తెలిపాడు. ఈ క్రమంలో డెబిట్ కార్డు వివరాలు అడిగి ఓటిపి తీసుకున్న నేరగాళ్ళు, ఖాతాలో ఉన్న 2.94 లక్షలు కాజేశారు నేరగాళ్ళు. దీంతో హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేశాడు. 

 

వ్యాక్సిన్ వేస్తామని 

మరో పక్క జూబ్లీహిల్స్ లోని ఓ ప్రముఖ బట్టల దుకాణం యజమానిని మోసం చేసిన సైబర్ నేరగాళ్లు, ఆరోగ్య శాఖ నుంచి మాట్లాడుతున్నామంటూ ఫోన్ చేసి ఉద్యోగులకు వ్యాక్సిన్ వేస్తామని 1.10 లక్షలు కట్టించుకున్నారు. ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను యజమాని ఆశ్రయించారు.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

హైదరాబాద్ లో స్ట్రీట్ ఫైట్ కలకలం.. యువకుడు మృతి!

12మంది అమ్మాయిల జీవితాలతో ఆడుకున్న ఘరానా మోసగాడు..!

వ్యాక్సినేష‌న్ లో ముంబై రికార్డ్ ... ఒక్క రోజులోనే..?

ఎన్టీఆర్ కొరటాల సినిమాలో కీలక పాత్రలో కన్నడ హీరో ?

నేడు ప్రపంచ బ్రెయిన్ ట్యూమర్ డే..

పోకిరి సినిమా రికార్డును బద్దలు కొట్టిన రంగస్థలం..!

అమూల్ రెడ్డి ఎన్నాళ్లీ ప్రతీకార పాలన?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>