PoliticsSatyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/vsp-52de9ad4-de6b-42cf-b29f-d85295704b6d-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/vsp-52de9ad4-de6b-42cf-b29f-d85295704b6d-415x250-IndiaHerald.jpgవిశాఖను రాజధానిగా ప్రకటించాలని వైసీపీ సర్కార్ పెద్దలకు ఎంతలా ఉత్సాహం ఉన్నా ఆచరణలో మాత్రం అడుగు ముందుకు పడడంలేదు. ఎందుకంటే అది న్యాయ సమీక్ష ముందు ఉంది కాబట్టి . అదే సమయంలో విశాఖను పాలనా రాజధానిగా ఎప్పటికైనా చేస్తామంటూ వైసీపీ నేతలు తరచూ ప్రకటిస్తూ ఉంటారు. vsp{#}YCP;Capital;Vishakapatnam;Party;Dookudu;TDP;war;Raccha;School;Bharatiya Janata Party;vishnu;king;Jagan;Andhra Pradesh;police;CBN;Governor;Letterరాజధాని రాకుండానే రాజకీయ రచ్చ... ?రాజధాని రాకుండానే రాజకీయ రచ్చ... ?vsp{#}YCP;Capital;Vishakapatnam;Party;Dookudu;TDP;war;Raccha;School;Bharatiya Janata Party;vishnu;king;Jagan;Andhra Pradesh;police;CBN;Governor;LetterTue, 08 Jun 2021 19:59:40 GMTవిశాఖను రాజధానిగా ప్రకటించాలని వైసీపీ సర్కార్ పెద్దలకు ఎంతలా ఉత్సాహం ఉన్నా ఆచరణలో మాత్రం అడుగు ముందుకు పడడంలేదు. ఎందుకంటే అది న్యాయ సమీక్ష ముందు ఉంది కాబట్టి . అదే సమయంలో విశాఖను పాలనా రాజధానిగా ఎప్పటికైనా చేస్తామంటూ వైసీపీ నేతలు తరచూ ప్రకటిస్తూ ఉంటారు.

ఇవన్నీ రాజధానిని తేలేకపోగా రాజకీయ రచ్చకు మాత్రం కారణం అవుతున్నాయని అంటున్నారు. విశాఖలో ఇపుడు సీన్ ఎలా ఉంది అంటే చీమ చిటుక్కుమంటే చాలు మొత్తం విశ్వవ్యాప్తం అయిపోతోంది. రాజధాని నేడో రేపో కాబోతోంది కాబట్టి విశాఖ మీద వైసీపీ స్పెషల్ ఫోకస్ పెట్టేసింది. దాంతో పాటుగా ఆ అధికార పార్టీ నేతల దూకుడు కూడా ఎక్కువగానే ఉంది. మరో వైపు విశాఖలో  ఏళ్ళ తరబడి రాజకీయం చేస్తున్న టీడీపీ కూడా స్ట్రాంగ్ గానే ఉంది.

ఏ తీగ కదిలించినా వెనక టీడీపీ గట్టిగా అల్లుకుని ఉంటుంది. దాంతో వైసీపీ వర్సెస్ టీడీపీ అన్నట్లుగా పొలిటికల్ వార్ సాగుతూనే ఉంది. తాజాగా విశాఖలో మానసిక వికలాంగుల పాఠశాలను కూల్చేశారు. దాని మీద ఇపుడు రాజకీయ రచ్చ పెద్ద ఎత్తున సాగుతోంది. అది జీవీఎంసీ స్థలమే. పైగా లీజు మీదనే ఇచ్చారు. కానీ ఇక్కడ చూడాల్సింది నోబుల్ కాజ్. పైగా అది వికలాంగ బాలుర కోసం ఏర్పాటు చేసిన పాఠశాల.

ఇక మరో వైపు చూస్తే కరోనా కాలం. ఇంతటి రాంగ్ టైమ్ లో అక్కడ పాఠశాల షెడ్లనుజీవీఎంసీ  అధికారులు కూల్చడంతో అతి పెద్ద సంచలమే రేపుతోంది. ప్రజావేదిక కూల్చేసిన తరువాత మళ్ళీ ఇన్నాళ్ళకు అంతటి పెద్ద న్యూస్ గా మీడియాలో ఇది ఫోకస్ అవుతోంది. దీని మీద బీజేపీ టీడీపీ సహా విపక్షాలు అన్నీ కూడా విమర్శలు చేస్తున్నాయి. నాడు అమరావతిలో  ప్రజావేదిక కూల్చారు అనుకుంటే ఇపుడు నేరుగా  విశాఖ మీద పడ్డారు అంటూ బీజేపీ నేత విష్ణు కుమార్ రాజు హాట్  కామెంట్స్ చేశారు. జగన్ ది కూల్చుడు ప్రభుత్వమని ఆయన సెటైర్లు వేశారు.

ఇక దీని మీద టీడీపీ కూడా పెద్దగా నోరు చేస్తోంది. మానవత్వం లేకుండా ఈ కూల్చుడేంటి అంటూ ఆ పార్టీ నేతలు వైసీపీ సర్కార్ మీద విమర్శలు చేస్తున్నారు. ఇవన్నీ పక్కన పెడితే విశాఖ జనంతో పాటు ఈ కూల్చుడుని చూసిన ఏపీ జనాలు కూడా తప్పే కదా అంటున్నారు అంటే రచ్చ ఏ రేంజిలో సాగుతోందో అర్ధమవుతుంది. ఇదిలా ఉంటే ఈ కూల్చుడు మీద మేధావులు, మాజీ క్రికెటర్లు, ఇతర రంగాలకు చెందిన వారు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అంటే అధికార పార్టీ ఎంతగా కార్నర్ అయిందో అర్ధమవుతుందిగా.

అలాగే విశాఖలో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేసే నర్స్ విషయంలో పోలీసులు దురుసుగా ప్రవర్తించిన ఘటన కూడా విశాఖ రాజకీయ కాక ఏ రేంజిలో ఉందో చెబుతోంది. పోలీసుల అతి ఉత్సహాంతో ఇపుడు వైసీపీ సర్కార్ టార్గెట్ అవుతోంది. దీని మీద కూడా విపక్షాలు వైసీపీ సర్కార్ ని వేలెత్తి చూపుతున్నాయి. చంద్రబాబు అయితే ఏకంగా గవర్నర్ కి లేఖ రాశారు కూడా. మొత్తానికి విశాఖలో ఏం జరుగుతోంది అన్నది యావత్తు ఏపీ ఇపుడు గమనిస్తోంది. దానికి తగినట్లుగానే ఇక్కడ ఘటనలు కూడా వరసగా జరుగుతున్నాయి.







Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ప్ర‌వేట్ ఆసుప‌త్రుల్లో వ్యాక్సిన్ ధ‌ర‌లు ఇవే

లుక్స్‌పై దృష్టి పెట్టిన సునీల్.. రివీల్ ఎప్పుడో..?

అఖండ నుంచి బాలయ్య బర్త్ డే ట్రీట్ రెడి అంట...

నవనీత్ కౌర్‌ క్యాస్ట్ సర్టిఫికెట్ రద్దు..ఎందుకంటే..?

ఆపిల్ యూజర్స్ కి గుడ్ న్యూస్.. ఇక నుంచి ఆ మోడళ్లకు కూడా IOS 15 సాఫ్ట్ వేర్..

మొటిమలను శాశ్వతంగా పోగొట్టే అద్భుత చిట్కాలు...

ఈ న్యూట్రిషన్ ఫుడ్ తో లైఫ్ లాంగ్ హెల్తీగా ఉండొచ్చు...



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>