PoliticsShanmukhaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/assama2d19307-ebb0-4e0a-8833-20d62ac69c8d-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/assama2d19307-ebb0-4e0a-8833-20d62ac69c8d-415x250-IndiaHerald.jpgభారత దేశంలో బంగ్లా చొరబాటు దారులకు అడ్డాలుగా ఉన్న రాష్ట్రాలు పశ్చిమ బెంగాల్, అస్సాం. అయితే రాష్ట్రానికి శరణార్థులుగా వచ్చి ఇక్కడ సుస్థిరంగా ఉండేందుకు వారుచేస్తున్న ప్రయత్నాలు అన్నీఇన్నీ కాదు. వారికి ఆశ్రయం ఇచ్చి, ఓటు హక్కు, రేషన్ హక్కు, వ్యాపారాలు చేసుకునేందుకు కావలసిన అనుమతులను ఇచ్చిన రాష్ట్రం బెంగాల్. బంగ్లా చొరబాటు దారులు ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లను ఏర్పాటు చేసుకోవడమే కాకుండా అక్కడి స్థానికులను కొట్టి, హింసించి తరిమి..assam{#}Assam;central government;CM;benarjee;Bharatiya Janata Party;Governmentచోరబాటు దారులకు అస్సాం చెక్.. ఎంతవరకో..చోరబాటు దారులకు అస్సాం చెక్.. ఎంతవరకో..assam{#}Assam;central government;CM;benarjee;Bharatiya Janata Party;GovernmentTue, 08 Jun 2021 18:37:26 GMTభారత దేశంలో బంగ్లా చొరబాటు దారులకు అడ్డాలుగా ఉన్న రాష్ట్రాలు పశ్చిమ బెంగాల్, అస్సాం. అయితే రాష్ట్రానికి శరణార్థులుగా వచ్చి ఇక్కడ సుస్థిరంగా ఉండేందుకు వారుచేస్తున్న ప్రయత్నాలు అన్నీఇన్నీ కాదు. వారికి ఆశ్రయం ఇచ్చి, ఓటు హక్కు, రేషన్ హక్కు, వ్యాపారాలు చేసుకునేందుకు కావలసిన అనుమతులను ఇచ్చిన రాష్ట్రం బెంగాల్. బంగ్లా చొరబాటు దారులు ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లను ఏర్పాటు చేసుకోవడమే కాకుండా అక్కడి స్థానికులను కొట్టి, హింసించి తరిమిన తీరు అందరికీ తెలసిందే. అయితే వారిపై చర్యలు తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సీఐఏ చట్టాన్ని తెచ్చిన విషయం తెలిసిందే. ఆ సమయంలో పశ్చిబెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేసిన వీరంగం అంతాఇంతా కాదు. తన ఓటు బ్యాంకు సుస్థిరంగా ఉంచుకునేందుకు మతకలహాలు రెచ్చగొడుతున్నారంటూ కేంద్రాన్ని దుయ్యబట్టిన తీరు అందరికీ తెలిసిందే.


అదే తరహాలో అస్సాం రాష్ట్రంలో శరణార్థులుగా వచ్చిన వారు మన దేశ పౌరులతో  సమానమైన హక్కలను అందుకుంటూ, అక్కడి స్థానికులు అందుకునే అన్ని సంక్షేమ పథకాల్లో భాగస్వాములయ్యారు. అంతేకాకుండా అక్కడి స్థానికులను వెళ్ళగొట్టి వారి స్థలాలను ఆక్రమించుకున్నారు. అదే సమయంలో అస్సాంకు సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తున్న వారు దీనిపై ఎటువంటి చర్యలు చేపట్టలేదు. అయితే ఇటీవల అస్సాంలో జరిగిన ఎన్నికల్లో ఓడిపోతుందని అందరూ భావించిన బీజేపీ పార్టీ అందరి అంచనాలను తారుమారు చేస్తూ విజయ కేతనం ఎగురవేసింది. దీంతో ఈ ఏడాది మే నెలలో అస్సాం రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన హిమంత బిస్వ శర్మ చొరబాటు దారులపై చర్యలు చేపట్టారు. చొరబాటు దారులపై కఠిన వైఖరి అవలంబించమని అధికారులను ఆదేశించారు.



ఇందులో భాగంగా చొరబాటు దారుల స్వాధీనంలో ఉన్న స్థలాలను ప్రభుత్వం తిరిగి తీసుకోవడం ప్రారంభించింది. ఈ క్రమంలో దాదాపు 1,20,000 చదరపు గజాల స్థలాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. మరి వారిపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏ మాత్రం ఫలిస్తాయో చూడాలి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ప్ర‌మాదంలో ఎంపీ స‌భ్య‌త్వం?

లుక్స్‌పై దృష్టి పెట్టిన సునీల్.. రివీల్ ఎప్పుడో..?

అఖండ నుంచి బాలయ్య బర్త్ డే ట్రీట్ రెడి అంట...

నవనీత్ కౌర్‌ క్యాస్ట్ సర్టిఫికెట్ రద్దు..ఎందుకంటే..?

ఆపిల్ యూజర్స్ కి గుడ్ న్యూస్.. ఇక నుంచి ఆ మోడళ్లకు కూడా IOS 15 సాఫ్ట్ వేర్..

మొటిమలను శాశ్వతంగా పోగొట్టే అద్భుత చిట్కాలు...

ఈ న్యూట్రిషన్ ఫుడ్ తో లైఫ్ లాంగ్ హెల్తీగా ఉండొచ్చు...



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Shanmukha]]>