CrimeN.ANJIeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/cheater-2c8f3963-1317-42ef-986c-69ba2d7e74d2-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/cheater-2c8f3963-1317-42ef-986c-69ba2d7e74d2-415x250-IndiaHerald.jpgబిటెక్ చదివిన వాళ్ళు అందరు ప్రయోజకులు అవుతుంటూ కొందరు మాత్రం దొంగతనాలకు, మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా 32 ఏళ్ల మెకానికల్ ఇంజినీర్‌ మహేష్‌ ను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. అతడు మాట్రిమోనియల్ వెబ్‌సైట్‌లో బాగా చదువుకున్న అమ్మాయిలకు వల వేస్తుంటాడు. ఇక అతడి వలలో చిక్కిన అమ్మాయిలను లైంగిక వేధింపులకు గురి చేసేవాడు.cheater{#}Mumbai;Arrest;Athadu;police12మంది అమ్మాయిల జీవితాలతో ఆడుకున్న ఘరానా మోసగాడు..!12మంది అమ్మాయిల జీవితాలతో ఆడుకున్న ఘరానా మోసగాడు..!cheater{#}Mumbai;Arrest;Athadu;policeTue, 08 Jun 2021 11:46:13 GMTబిటెక్ చదివిన వాళ్ళు అందరు ప్రయోజకులు అవుతుంటూ కొందరు మాత్రం దొంగతనాలకు, మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా 32 ఏళ్ల మెకానికల్ ఇంజినీర్‌ మహేష్‌ ను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. అతడు మాట్రిమోనియల్ వెబ్‌సైట్‌లో బాగా చదువుకున్న అమ్మాయిలకు వల వేస్తుంటాడు. ఇక అతడి వలలో చిక్కిన అమ్మాయిలను లైంగిక వేధింపులకు గురి చేసేవాడు. ఆ తరువాత వాళ్ళని చిత్ర హింసలకు గురిచేసి వదిలించుకుంటాడు. అయితే ఇప్పటివరకూ 12 మందికి పైగా అమ్మాయిల జీవితాలతో అతను ఆడుకున్నట్లు పోలీసు అధికారులు వెల్లడించారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నిందితుడు మహేష్ మాట్రిమోనియల్ సైట్‌లో నకిలీ ప్రొఫైల్ క్రియేట్ చేసి బాగా చదువుకున్న అమ్మాయిలను డిటైల్స్ సెర్చ్ చేసే వాడు. ఆ తర్వాత ఆ అమ్మాయిలకు తన తన ప్రొపైల్ పంపి మ్యారేజ్ ప్రపోజల్ చేసేవాడు. ఇక అతని ఎడ్యుకేషన్ వివరాలు చూసి అవతలి అమ్మాయిలు కూడా ఓ మెట్టు ముందుకు వచ్చేస్తుండేవారు. ఇక ఆ తర్వాత అతడు అమ్మాయిలతో మాట్లాడేందుకు మొబైల్ నంబర్ తీసుకుంటాడు. ఇక వారిని మాయమాటలతో ఆకట్టుకొని డైరెక్ట్ గా కలిసి లైంగిక వేధింపులకు పాల్పడేవాడు. ఇక అతడిని బలవంతంగా అడ్డుకుంటే... ఆ అమ్మాయిని బాగా కొట్టేవాడు. ఇక అతను కొన్నాళ్ల కిందట హ్యాకర్‌గా కూడా పని చేశాడని తెలిపారు.

ఇక ఆలా అమ్మాయిలకు వల  వేసి నెంబర్లు మార్చేవాడు. ఆలా అతడు 15మందికి వల వేయగా అందులో 12 మంది అమ్మాయిలపై లైంగిక వేధింపులకు పాల్పడి వారిపై చితకబాదడాల వంటివి చేసేవాడని పోలీసులు తెలిపారు. అయితే అతడిని పోలీసులు నాలుగు రోజులు పోలీసు కస్టడీకి తీసుకెళ్లారు. అతడిని కస్టడీలో ప్రశ్నించడం ద్వారా ఎంత మందిని మోసం చేశాడో అనేది తెలుస్తుందని తెలిపారు. ఇక ఒకవేళ అతను అబద్ధం చెప్పినా... అతను ఇప్పటివరకూ ఎన్ని సిమ్ కార్డులు మార్చాడో తెలుసుకోవడం ద్వారా కూడా అమ్మాయిల సంఖ్యను గుర్తించవచ్చునని పోలీసులు తెలిపారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

సూర్య మూవీ లేటెస్ట్ అప్డేట్..!

వ్యాక్సినేష‌న్ లో ముంబై రికార్డ్ ... ఒక్క రోజులోనే..?

ఎన్టీఆర్ కొరటాల సినిమాలో కీలక పాత్రలో కన్నడ హీరో ?

నేడు ప్రపంచ బ్రెయిన్ ట్యూమర్ డే..

పోకిరి సినిమా రికార్డును బద్దలు కొట్టిన రంగస్థలం..!

అమూల్ రెడ్డి ఎన్నాళ్లీ ప్రతీకార పాలన?

ఆ టైపు సినిమాలకు ట్రెండ్ సెట్టర్ బాలకృష్ణ సమరసింహా రెడ్డి..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>