MoviesVAMSIeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/rana-movie-gossip331d1384-b7a5-47ea-8d73-9f79e8ae66f1-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/rana-movie-gossip331d1384-b7a5-47ea-8d73-9f79e8ae66f1-415x250-IndiaHerald.jpgదగ్గుబాటి కుటుంబానికి చెందిన రానా గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇప్పటికే తెలుగు సినిమా పరిశ్రమలో తన ప్రతిభను నిరూపించుకుని ఎటువంటి పాత్రనైనా చేయడానికి రెఢీ అంటున్నాడు. రానా సినిమా జీవితం బాహుబలి తర్వాత చాలా మారిపోయింది. బాహుబలిలో తన పాత్రకు 100 శాతం న్యాయం చేసి ప్రేక్షకులను మెప్పించడంలో సక్సెస్ అయ్యాడు. RANA MOVIE GOSSIP{#}Leader;Director;Daggubati Venkateswara Rao;Venkatesh;rana daggubati;Telugu;Bahubali;Success;Cinema;Darsakudu;Nene Raju Nene Mantri;teja;News;king;Ministerరానా మళ్ళీ పొలిటికల్ లీడర్ ... ? ఆ డైరెక్టర్ మళ్ళీ కన్నేశాడుగా ... ?రానా మళ్ళీ పొలిటికల్ లీడర్ ... ? ఆ డైరెక్టర్ మళ్ళీ కన్నేశాడుగా ... ?RANA MOVIE GOSSIP{#}Leader;Director;Daggubati Venkateswara Rao;Venkatesh;rana daggubati;Telugu;Bahubali;Success;Cinema;Darsakudu;Nene Raju Nene Mantri;teja;News;king;MinisterTue, 08 Jun 2021 19:55:59 GMTదగ్గుబాటి కుటుంబానికి చెందిన రానా గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇప్పటికే తెలుగు సినిమా పరిశ్రమలో తన ప్రతిభను నిరూపించుకుని ఎటువంటి పాత్రనైనా చేయడానికి రెఢీ అంటున్నాడు. రానా సినిమా జీవితం బాహుబలి తర్వాత చాలా మారిపోయింది. బాహుబలిలో తన పాత్రకు 100 శాతం న్యాయం చేసి ప్రేక్షకులను మెప్పించడంలో సక్సెస్ అయ్యాడు. ఈ సినిమా తరువాతే రానా గురించి దేశమంతా తెలిసింది, అంతలా బాహుబలి లో నటించిన నటీనటులందరికీ  మంచి పేరును తీసుకు వచ్చింది. రానా ప్రత్యేక పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయాడు. బాహుబలి తరువాత ఒక విభిన్నమైన పాత్రలో మరోసారి తన స్టామినాను తెలుగు సినిమా ఇండస్ట్రీకి తెలిసేలా చేశాడు. 

ప్రముఖ దర్శకుడు తేజ తెరకెక్కించిన నేనే రాజు నేనే మంత్రి లో రానా నటన వేరే లెవెల్ అని చెప్పవచ్చు. ఈ సినిమాలో తేజ అందించిన స్క్రీన్ ప్లే  ప్రేక్షకుడిని 2 గంటల 30 నిముషాల పాటు థియేటర్లో కూర్చునేలా చేసింది. ఈ సినిమా ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి విమర్శకుల ప్రశంశలు అందుకుంది. కమర్షియల్ గా కూడా మంచి పేరు వచ్చింది. ఆ తరువాత వీరిద్దరికీ మళ్లీ కలిసి పనిచేసే అవకాశం రాలేదు. తాజాగా వస్తున్న రూమర్స్ ప్రకారం త్వరలోనే వీరిద్దరూ మరో సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు రానా విరాటపర్వం సినిమాతో బిజీగా ఉన్నారు. కరోనా కారణంగా విడుదలకు సందిగ్ధత ఏర్పడింది. అన్ని సినిమాల పరిస్థితి అదే విధంగా ఉంది.

ప్రస్తుత సమాచారం ప్రకారం  జూలై నెలాఖరుకు కరోనా కొంత శాంతిస్తుందని, అప్పటి నుండే అన్ని సినిమాలు మిగిలిపోయిన షూటింగులను పూర్తి చేసుకోనున్నారు. ఈ లాక్ డౌన్ కాలంలో ఖాళీగా ఉన్నందున డైరెక్టర్ తేజ ఒక కథ సిద్ధం చేసుకున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ కథను త్వరలోనే రానాకు వివరిస్తారని తెలుస్తోంది. రానా కనుక ఈ కథకు అట్ట్రాక్ట్ అయితే లాక్ డౌన్ తరువాత వీరిద్దరి కలయికలో రెండవసారి సినిమా తెరకెక్కనుంది. కాగా ఈ సినిమా నేనే రాజు నేనే మంత్రి కి సీక్వెల్ కథనా, లేదా కొత్త కథా అన్నది తెలియాల్సి ఉంది. మరి చూద్దాం త్వరలోనే వీరిద్దరి నుండి అధికారిక ప్రకటన వస్తుందేమో.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ప్ర‌వేట్ ఆసుప‌త్రుల్లో వ్యాక్సిన్ ధ‌ర‌లు ఇవే

లుక్స్‌పై దృష్టి పెట్టిన సునీల్.. రివీల్ ఎప్పుడో..?

అఖండ నుంచి బాలయ్య బర్త్ డే ట్రీట్ రెడి అంట...

నవనీత్ కౌర్‌ క్యాస్ట్ సర్టిఫికెట్ రద్దు..ఎందుకంటే..?

ఆపిల్ యూజర్స్ కి గుడ్ న్యూస్.. ఇక నుంచి ఆ మోడళ్లకు కూడా IOS 15 సాఫ్ట్ వేర్..

మొటిమలను శాశ్వతంగా పోగొట్టే అద్భుత చిట్కాలు...

ఈ న్యూట్రిషన్ ఫుడ్ తో లైఫ్ లాంగ్ హెల్తీగా ఉండొచ్చు...



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>