MoviesShanmukhaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/acharya881f4fc8-9bd6-4a46-887d-66d3b16a8313-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/acharya881f4fc8-9bd6-4a46-887d-66d3b16a8313-415x250-IndiaHerald.jpgమెగాస్టార్ చిరంజీవి సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి మంచి జోరుకనబరుస్తున్నాడు. ఖైదీ నెం.150 తరువాత వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. ఇప్పటికే పలు సినిమాలను లైన్ చేసున్నాడు. అయితే ప్రస్తుతం చిరు చేస్తున్న సినిమా ఆచార్య. ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈసినిమాలో మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ కీలక పాత్రలో కనిపించ..acharya{#}koratala siva;Chiranjeevi;Khaidi.;Khaidi new;Cinema;News;Event;kajal aggarwal;Pooja Hegde;Darsakudu;Director;Ram Charan Teja;Leaderఆచార్య కోసం కొరటాల కొత్త ప్లాన్..?ఆచార్య కోసం కొరటాల కొత్త ప్లాన్..?acharya{#}koratala siva;Chiranjeevi;Khaidi.;Khaidi new;Cinema;News;Event;kajal aggarwal;Pooja Hegde;Darsakudu;Director;Ram Charan Teja;LeaderTue, 08 Jun 2021 15:21:07 GMTమెగాస్టార్ చిరంజీవి సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి మంచి జోరుకనబరుస్తున్నాడు. ఖైదీ నెం.150 తరువాత వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. ఇప్పటికే పలు సినిమాలను లైన్ చేసున్నాడు. అయితే ప్రస్తుతం చిరు చేస్తున్న సినిమా ఆచార్య. ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈసినిమాలో మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమా నుంచి ఇప్పటికే వచ్చిన పోస్టర్లు, టీజర్, ఫస్ట్ లుక్ అన్నీ కూడా సినిమాపై అంచనాలను తారాస్థాయికి పెంచాయి. అయితే ప్రస్తుతం కరోనా కారణంగా సినిమా చిత్రీకరణ ఆగిపోయింది.

అయితే ఈ సినిమాపై ఇప్పటికే ఎన్నో వార్తలు నెట్టింట వైరల్ అయ్యాయి. తాజాగా మరో వార్త ఆచార్య మిగిలిన షూటింగ్‌పై వినిపిస్తోంది. ఈ సినిమాలో క్లైమాక్స్ చిత్రీకరణ మాత్రమే మిగిలిఉన్న సంగతి తెలిసిందే. అయితే కరోనా కారణంగా ఇంటికే పరిమితం అయిన కొరటాలసినిమా క్లైమాక్స్‌పై దృష్టి పెట్టాడట. ఇదివరకు రాసుకున్న క్లైమాక్స్ అంతగా తృప్తి పరచక పోవడంతో సినిమా క్లైమాక్స్‌ను మార్చే ప్రయత్నాలు చేపట్టాడట. దీని వల్ల సినిమాలో దాదాపు 10 సినిమిషాల క్లైమాక్స్‌లో చాలా మార్పులు వస్తాయట. ఇప్పటి వరకు చిత్రించిన కథ అద్భుతంగా వచ్చిందని, దానికి తగ్గట్టుగానే క్లైమాక్స్ కూడా ఉండాలన్న భావనతోనే కొరటాల ఈ నిర్ణయం తీసుకున్నాడంటూ సినీ సర్కిల్స్‌లో టాక్ నడుస్తోంది. కానీ దీనిపై ఇప్పటి వరకు కొరటాల కానీ, మూవీ టీమ్‌కాని అధికారిక ప్రకటన చేయలేదు. త్వరలో ఏమైనా స్పెషల్ ఈవెంట్ సందర్భంగా ప్రకటిస్తారేమో చూడాలి.
ఇదిలా ఉంటే ఈ సినిమాలో చిరు సరసన కాజల్ నటిస్తుండగా, చరణ్ సరసన బుట్టబొమ్మ పూజా హెగ్దె నటిస్తోంది. ఈ సినిమాలో ఇంటర్వెల్ సీన్ నెవ్వర్ బిఫోర్ అనేలా ఉంటుందని దర్శకుడు ఇప్పటికే చెప్పాడు. ఈ చిత్రంలో రామ్ చరణ్ స్టూడెంట్ యూనియన్ లీడర్ పాత్రలో కనిపించనున్నాడని కూడా వార్తలు వచ్చాయి. వీటన్నింటికి సమాధానం రావాలంటే ‘ఆచార్య’ సినిమా విడుదల వరకు ఆగాల్సిందే.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కుర్ర హీరోలకు డోర్స్ ఓపెన్... ?

లుక్స్‌పై దృష్టి పెట్టిన సునీల్.. రివీల్ ఎప్పుడో..?

అఖండ నుంచి బాలయ్య బర్త్ డే ట్రీట్ రెడి అంట...

నవనీత్ కౌర్‌ క్యాస్ట్ సర్టిఫికెట్ రద్దు..ఎందుకంటే..?

ఆపిల్ యూజర్స్ కి గుడ్ న్యూస్.. ఇక నుంచి ఆ మోడళ్లకు కూడా IOS 15 సాఫ్ట్ వేర్..

మొటిమలను శాశ్వతంగా పోగొట్టే అద్భుత చిట్కాలు...

ఈ న్యూట్రిషన్ ఫుడ్ తో లైఫ్ లాంగ్ హెల్తీగా ఉండొచ్చు...



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Shanmukha]]>