BreakingGarikapati Rajesheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/mp-sivasena-navaneethcour-latest-news8fcbf0d0-d3a4-4735-bd82-6ece776b6724-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/mp-sivasena-navaneethcour-latest-news8fcbf0d0-d3a4-4735-bd82-6ece776b6724-415x250-IndiaHerald.jpg మ‌హారాష్ట్రలోని అమ‌రావ‌తి నుంచి ఎంపీగా గెలుపొందిన సినీ న‌టి న‌వ‌నీత్‌కౌర్ రానాకు ముంబ‌యి హైకోర్టు రూ.2 లక్ష‌ల జ‌రిమానా విధించింది. స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా విజ‌యం సాధించిన న‌వ‌నీత్ ఎన్నిక‌ల్లో పోటీచేసేందుకు న‌కిలీ ధ్రువీక‌ర‌ణ ప‌త్రాలు స‌మ‌ర్పించార‌ని, ఆమె ఎస్సీ సామాజిక‌వ‌ర్గానికి చెందిన‌వారు కాదంటూ శివ‌సేన పార్టీకి చెందిన మాజీ ఎంపీ ఆనంద‌రావు అద‌సూల్ హైకోర్టులో పిటిష‌న్ దాఖలు చేశారు. దీనిపై న్యాయ‌స్థానం తీర్పు వెలువ‌రించ‌డంతో ఎంపీ స‌భ్య‌త్వం ప్ర‌మాదంలో ప‌డింది. దీనిపై తాను సుప్రీంకోర్టును ఆశ్ర‌యిసmp, sivasena, navaneethcour, latest news{#}MP;Amaravati;Amaravathi;High court;Scheduled caste;shiv sena party;Shiv Sena;Hanu Raghavapudi;rana daggubatiప్ర‌మాదంలో ఎంపీ స‌భ్య‌త్వం?ప్ర‌మాదంలో ఎంపీ స‌భ్య‌త్వం?mp, sivasena, navaneethcour, latest news{#}MP;Amaravati;Amaravathi;High court;Scheduled caste;shiv sena party;Shiv Sena;Hanu Raghavapudi;rana daggubatiTue, 08 Jun 2021 18:51:00 GMT
మ‌హారాష్ట్రలోని అమ‌రావ‌తి నుంచి ఎంపీగా గెలుపొందిన  సినీ న‌టి న‌వ‌నీత్‌కౌర్ రానాకు ముంబ‌యి హైకోర్టు రూ.2 లక్ష‌ల జ‌రిమానా విధించింది. స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా విజ‌యం సాధించిన న‌వ‌నీత్ ఎన్నిక‌ల్లో పోటీచేసేందుకు న‌కిలీ ధ్రువీక‌ర‌ణ ప‌త్రాలు స‌మ‌ర్పించార‌ని, ఆమె ఎస్సీ సామాజిక‌వ‌ర్గానికి చెందిన‌వారు కాదంటూ శివ‌సేన పార్టీకి చెందిన మాజీ ఎంపీ ఆనంద‌రావు అద‌సూల్ హైకోర్టులో పిటిష‌న్ దాఖలు చేశారు. దీనిపై న్యాయ‌స్థానం తీర్పు వెలువ‌రించ‌డంతో ఎంపీ స‌భ్య‌త్వం ప్ర‌మాదంలో ప‌డింది. దీనిపై తాను సుప్రీంకోర్టును ఆశ్ర‌యిస్తాన‌ని, త‌న‌కు అక్క‌డ న్యాయం జ‌రుగుతుంద‌నే న‌మ్మ‌కం ఉంద‌ని న‌వ‌నీత్‌కౌర్ అన్నారు. విద‌ర్భ ప్రాంతానికి చెందిన అమ‌రావ‌తి ఎస్సీ రిజ‌ర్వుడు నియోజ‌క‌వ‌ర్గం నుంచి 2019 ఎన్నిక‌ల్లో న‌వ‌నీత్‌కౌర్ రానా ఆనంద‌రావు అద‌సూల్‌పై పోటీచేసి స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా విజ‌యం సాధించారు. శివ‌సేన పార్టీకి చెందిన ఎంపీ అర‌వింద్ సావంత్ పార్ల‌మెంట్ లాబీలో త‌న‌ను బెదిరించారంటూ మార్చిలో న‌వ‌నీత్ ఆరోప‌ణ‌లు చేయ‌డం సంచ‌ల‌నం సృష్టించింది.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ప్ర‌వేట్ ఆసుప‌త్రుల్లో వ్యాక్సిన్ ధ‌ర‌లు ఇవే

లుక్స్‌పై దృష్టి పెట్టిన సునీల్.. రివీల్ ఎప్పుడో..?

అఖండ నుంచి బాలయ్య బర్త్ డే ట్రీట్ రెడి అంట...

నవనీత్ కౌర్‌ క్యాస్ట్ సర్టిఫికెట్ రద్దు..ఎందుకంటే..?

ఆపిల్ యూజర్స్ కి గుడ్ న్యూస్.. ఇక నుంచి ఆ మోడళ్లకు కూడా IOS 15 సాఫ్ట్ వేర్..

మొటిమలను శాశ్వతంగా పోగొట్టే అద్భుత చిట్కాలు...

ఈ న్యూట్రిషన్ ఫుడ్ తో లైఫ్ లాంగ్ హెల్తీగా ఉండొచ్చు...



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>