PoliticsVAMSIeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/msk-prasad-letter-to-cm351d1317-4586-4910-9487-cc7833d08d2f-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/msk-prasad-letter-to-cm351d1317-4586-4910-9487-cc7833d08d2f-415x250-IndiaHerald.jpgఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి భారత క్రికెట్ మాజీ ఆటగాడు మరియు బీసీసీఐ మాజీ చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ రిక్వెస్ట్ లెటర్ రాసినట్లుగా తెలుస్తోంది. ఒక క్రీడా సంబంధిత వ్యక్తి ఏపీ సీఎంకి లెటర్ రాయడంలో కారణం ఏమిటా అని అనుకుంటున్నారా ? పూర్తి వివరాల్లోకి వెళితే, రెండు రోజుల క్రిందట విశాఖపట్నం జీవీఎంసీ అధికారులు మానసిక వికలాంగులకు సంబంధించిన పాఠశాలను కూల్చివేసిన విషయం తెలిసిందే. MSK PRASAD LETTER TO CM{#}Jagan;Letter;BCCI;Andhra Pradesh;Cricket;M S K prasad;Vishakapatnam;CM;editor mohan;School;prasad;history;srinivas;Kavuru Srinivas;Government;Indiaసీఎం జగన్ కు లేఖ రాసిన బీసీసీఐ మాజీ చీఫ్ సెలెక్టర్ ?సీఎం జగన్ కు లేఖ రాసిన బీసీసీఐ మాజీ చీఫ్ సెలెక్టర్ ?MSK PRASAD LETTER TO CM{#}Jagan;Letter;BCCI;Andhra Pradesh;Cricket;M S K prasad;Vishakapatnam;CM;editor mohan;School;prasad;history;srinivas;Kavuru Srinivas;Government;IndiaMon, 07 Jun 2021 21:51:31 GMTఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి భారత క్రికెట్ మాజీ ఆటగాడు మరియు బీసీసీఐ మాజీ చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ రిక్వెస్ట్ లెటర్ రాసినట్లుగా తెలుస్తోంది. ఒక క్రీడా సంబంధిత వ్యక్తి ఏపీ సీఎంకి లెటర్ రాయడంలో కారణం ఏమిటా అని అనుకుంటున్నారా ? పూర్తి వివరాల్లోకి వెళితే, రెండు రోజుల క్రిందట విశాఖపట్నం జీవీఎంసీ అధికారులు మానసిక వికలాంగులకు సంబంధించిన పాఠశాలను కూల్చివేసిన విషయం తెలిసిందే. ఈ పాఠశాల భవనానికి తీసుకున్న లీజు యొక్క కాల పరిమితి ముగియడంతో సదరు అధికారులు ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ప్రసాద్ సీఎం కు లెటర్ రాశారు. మానసిక వికలాంగుల పాఠశాల కూల్చివేతపై మరొక్కసారి ఆలోచించాలని కోరారు. ఈ పాఠశాలకు ఎంతో చరిత్ర ఉంది. 

పాఠశాల 2013 లో శ్రీనివాస్ అనే వ్యక్తి స్థాపించారని, అప్పట్లో ఈ స్కూల్ కేవలం నలుగురు విద్యార్థులతో స్టార్ట్ అయ్యి, ఇప్పుడు ఆ విద్యార్థుల సంఖ్య 140 కి చేరిందని ఈ లెటర్ లో ఆయన పేర్కొన్నారు. ఇలా ఇంతమంది మానసిక వికలాంగ విద్యార్థులకు ఒక దేవాలయంగా మారిందని తెలిపారు. ఈ పాఠశాలను స్థాపించిన శ్రీనివాస్ జీవితమంతా దీని అభివృద్ధికే కృషి చేశారని, ఆయనను కొనియాడారు. ఈ స్కూల్ అభివృద్ధి కోసం శ్రీనివాస్ చేసిన కృషి మరియు కష్టానికి గుర్తుగా భారత ప్రభుత్వం జ్యూవెల్ అఫ్ ఇండియా అనే అవార్డును ఇచ్చి గౌరవించిందని ఈ సంద్భరంగా ప్రసాద్ గుర్తు చేశారు. ఈ సంఘటనకు పాల్పడిన జీవీఎంసీ అధికారులకు కనీసం వికలాంగ పిల్లలపై ఎటువంటి దయ, జాలి లేకుండా కూల్చి వేయడం చాలా బాధాకరమని పేర్కొన్నారు. 

ఈ సంఘటనతో పాఠశాలకు చెందిన విద్యార్థులు, వారి తల్లితండ్రులు మరియు పాఠశాల నిర్వాహకులు తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ కష్ట కాలంలో ఈ వికలాంగ పిల్లల గురించి అలోచించి ఈ విషయంపై ఒక మంచి నిర్ణయం తీసుకోవాలని సీఎం ను కోరారు. మరి ఈ లెటర్ పై సీఎం జగన్ ఏ విధంగా స్పందించనున్నారో తెలియాల్సి ఉంది. పేదలకు అండగా ఉండే సీఎం జగన్ ఈ విషయంపై సానుకూలంగానే స్పందించే అవకాశముందని తెలుస్తోంది.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కట్నం కోసం వేధించిన కసాయి భర్త.. చివరికి ఏం చేశాడో తెలుసా?

పుష్ప సినిమాలో మెగా పాట.. ఇక రచ్చరచ్చే..?

అరటి తో అదిరే వంట..

ఇంకా ఐదు రోజులే.. కరోనా రోగులు ఇక జైల్లోకే?

నెవ్వర్ బిఫోర్ రోల్‌లో రౌడీ హీరో.. ?

ప్రభాస్ 'రాధే శ్యామ్' కి అమెజాన్ ప్రైమ్ భారీ ఆఫర్..!!

నేపాల్ ప్రజాస్వామ్యంతో చైనా ఆట..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>