MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/abbas-a005de42-a72c-447b-86fd-8b8a5a15307f-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/abbas-a005de42-a72c-447b-86fd-8b8a5a15307f-415x250-IndiaHerald.jpg 1996లో ‘ప్రేమదేశం’ విడుదల తరువాత అబ్బాస్ అప్పటి తరం అమ్మాయిలకు డ్రీమ్ బాయ్ గా మారిపోయాడు. అప్పట్లో సోషల్ లేకపోయినా తమిళనటుడు అయిన అబ్బాస్ ను పెళ్ళి చేసుకుంటామని మన తెలుగు అమ్మాయిలు ప్రేమ లేఖలు వ్రాసేవారు అంటే ఆరోజులలో అబ్బాస్ కు పై ఉన్న క్రేజ్ అర్థం అవుతుంది.అంతేకాదు అప్పట్లో చాలామంది అబ్బాయిలు అబ్బాస్ హెయిర్ స్టైల్ ను అనుసరించే వారు. అతడి కెరియర్ ప్రారంభంలో చాల సినిమాలలో నటించడమే కాకుండా అతడి సినిమాలలో చాల హిట్స్ కూడ ఉన్నాయి. తెలుగు తమిళ కన్నడ మళయాళ భాషలలో అప్పట్లో సంవత్సరానికి 6-7 సినిమాలలabbas;{#}abbas;Telugu;prema;Love;Kannada;Balakrishna;media;June;Aucklandఅబ్బాస్ న్యూ లుక్ చూసి షాక్ లో అభిమానులు !అబ్బాస్ న్యూ లుక్ చూసి షాక్ లో అభిమానులు !abbas;{#}abbas;Telugu;prema;Love;Kannada;Balakrishna;media;June;AucklandMon, 07 Jun 2021 10:00:00 GMT
1996లో ‘ప్రేమదేశం’ విడుదల తరువాత అబ్బాస్ అప్పటి తరం అమ్మాయిలకు డ్రీమ్ బాయ్ గా మారిపోయాడు. అప్పట్లో సోషల్ లేకపోయినా తమిళనటుడు అయిన అబ్బాస్ ను పెళ్ళి చేసుకుంటామని మన తెలుగు అమ్మాయిలు ప్రేమ లేఖలు వ్రాసేవారు అంటే ఆరోజులలో అబ్బాస్ కు పై ఉన్న క్రేజ్ అర్థం అవుతుంది.


అంతేకాదు అప్పట్లో చాలామంది అబ్బాయిలు అబ్బాస్ హెయిర్ స్టైల్ ను అనుసరించే వారు. అతడి కెరియర్ ప్రారంభంలో చాల సినిమాలలో నటించడమే కాకుండా అతడి సినిమాలలో చాల హిట్స్ కూడ ఉన్నాయి. తెలుగు తమిళ కన్నడ మళయాళ భాషలలో అప్పట్లో సంవత్సరానికి 6-7 సినిమాలలో కూడ నటించేవాడు.


మన టాప్ హీరోలు బాలకృష్ణ వెంకటేష్ లతో కూడ అబ్బాస్ అనేక సినిమాలలో నటించాడు. ఆతరువాత అతడికి వరస ఫ్లాప్ లు ఎదురు కావడంతో సినిమాలకు దూరం అయిపోయాడు. మధ్యలో కొన్ని సినిమాలలో కేరెక్టర్ యాక్టర్ పాత్రలు లభించినప్పటికీ వాటిలో నటించడానికి అబ్బాస్ మనసు ఒప్పుకోలేదు. తనకు యాక్టింగ్ అంటే బోర్ కొట్టిందని అందుకే ఇక తాను సినిమాలు చేయలేనని కొన్ని సంవత్సరాల క్రితం ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు.


అయితే ఇప్పుడు అబ్బాస్ లేటెస్ట్ లుక్ బయటపడటంతో ఇప్పుడు ఇతడు ఏమి చేస్తున్నాడు అన్న ఆశక్తి చాలామందిలో పెరిగింది. ప్రస్తుతం అబ్బాస్ మనదేశంలో లేడు న్యూజీలాండ్ లో స్థిరపడ్డాడు. ఫ్యామిలీతో సహా అక్కడే ఉంటున్నాడు. ఇప్పుడు అబ్బాస్ మోటివేషనల్ స్పీకర్ గా మారి న్యూజీలాండ్ లో అనేకమందికి వ్యక్తిత్వ వికాశం పై శిక్షణ ఇస్తున్నాడు.  జూన్ 5 నుంచి ఆక్లాండ్ లో మోటివేషనల్ కార్యక్రమాన్ని  నిర్వహించబోతున్నాడు. తన దేశంలో కరోనా తీవ్రత చాలా అంటే చాలా తక్కువగా ఉందని అందువల్ల తనకు ఎలాంటి ఇబ్బందులు లేవని అంటూ ప్రస్తుతం తాను ఈ దేశంలో చాల ఆనందంగా ఉంటూ ప్రకృతిని ఎంజాయ్ చేస్తున్నానని తాను ఇంటిలో కూర్చున్న తన ఫోటోను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసాడు..  






Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

విషాదం: ప్రాణం తీసిన క్షణికావేశం..!

ఫ్యామిలీ మ్యాన్ 3 కాన్సెప్ట్ ఇదేనా..?

తెలంగాణ‌లో టీడీపీ క్లోజ్‌ ..పార్టీ అధ్య‌క్షుడు సైతం

దాతృత్వాన్ని చాటుకుంటున్న తెలుగు ఎన్నారైలు..?

నేటి నుండే ఆనందయ్య మందు పంపిణీ ? ఇందులో నిజమెంత ?

ప్రైవేటు హాస్పిటల్స్‌లో ఎందుకంత ఖర్చు.. ఓ చేదు నిజం..?

కుకింగ్ : మష్రూమ్ తో మ్యాజిక్..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>