KidsN.ANJIeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/kids/107/children-06f30e3a-8b63-4e8d-98ba-d6d5634b3518-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/kids/107/children-06f30e3a-8b63-4e8d-98ba-d6d5634b3518-415x250-IndiaHerald.jpgచిన్నపిల్లలు కొన్ని సందర్భాల్లో ఎంతో సంతోషంగా ఉంటూ ఆడుకుంటుంటారు. అలాంటప్పుడు తల్లులకు ఏం అనిపించదు. అప్పుడు ఇంకా చంటోడు.. ఎంత ముద్దుగా ఆడుకుంటున్నాడని మురిసిపోతుంటుంది. కానీ, ఏడిచేటప్పుడు మాత్రం ఎందుకు ఏడుస్తున్నాడనే అమోమయంలో పడిపోతుంది.children{#}Allari;Eveningబుడుగు: చిన్నపిల్లలు ఎందుకు ఏడుస్తారు.. వాటికి గల కారణాలు..!బుడుగు: చిన్నపిల్లలు ఎందుకు ఏడుస్తారు.. వాటికి గల కారణాలు..!children{#}Allari;EveningMon, 07 Jun 2021 17:00:00 GMTచిన్నపిల్లలు కొన్ని సందర్భాల్లో ఎంతో సంతోషంగా ఉంటూ ఆడుకుంటుంటారు. అలాంటప్పుడు తల్లులకు ఏం అనిపించదు. అప్పుడు ఇంకా చంటోడు.. ఎంత ముద్దుగా ఆడుకుంటున్నాడని మురిసిపోతుంటుంది. కానీ, ఏడిచేటప్పుడు మాత్రం ఎందుకు ఏడుస్తున్నాడనే అమోమయంలో పడిపోతుంది. అసలు ఏం జరిగి ఉంటుంది..? ఎందుకు ఏడుస్తూ ఉన్నాడనే ప్రశ్న మదిలో మెదులుతూ ఉంటుంది. అయితే చిన్న పిల్లలు గుక్కపెట్టి ఏడుస్తున్నారనే విషయంపై కొన్ని కారణాలను కనుగొన్నాము. ఈ కారణాల వల్ల చిన్న పిల్లలు ఏడిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

చిన్న పిల్లలు ఎక్కువడా ఆకలి వేసినప్పుడు ఏడుస్తుంటారు. ఇది ఒక ప్రధానమైన కారణంగా చెప్పుకోవచ్చు. చిన్నపిల్లల కడుపు చాలా చిన్నదిగా ఉంటుంది. వీళ్లు ఎంత తిన్నా గంటలోనే జీర్ణం అవుతుంది. అందుకే వీళ్లకు తొందరగా ఆకలేస్తుంటుంది. అలాగే కొన్ని సందర్భాల్లో పిల్లలు బాగా అల్లరి చేస్తూ ఆడుకుంటుంటూరు. ఎంత అలసిపోయినా.. వారికి నిద్ర మాత్రం పట్టదు. అప్పుడూ కూడా ఎక్కువగా ఏడిచే సందర్భాలు ఉంటాయి. 5 నెలల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలు మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో బాగా ఏడుస్తారు. ఆ సమయంలో వారికే అధికంగా స్ట్రెస్ అనిపిస్తుంటుందంట. అందుకే ఎలాంటి రీజన్ లేకుండానే ఏడుస్తుంటారంట.

చిన్న పిల్లలకు ఆహారం తొందరగా జీర్ణం అవుతుంది. తాగినా.. తిన్నా.. తొందరగా బయటకు వస్తుంటుంది. అందుకే తల్లులు వాళ్లకు న్యాపీలు అమర్చుతారు. న్యాపీలు వేసుకోవడం వల్ల సాయిల్ అందులోనే ఉంటుంది. దీని వల్ల పిల్లల లేత చర్మం ఇరిటేట్ అవుతుంది. దీంతో వాళ్లు ఏడవడం చేస్తుంటారు. న్యాపీలు మార్చడం కానీ, కొద్ది సేపటివరకు న్యాపీలు లేకుండా ఉంచడానికి ట్రై చేస్తుండాలి. అలాగే పిల్లలకు ఒంటిరిగా ఉన్నా.. అనే ఫీలింగ్ కూడా ఎక్కువగానే అనిపిస్తుంటుంది.

తమను అలవాటైన స్పర్శ కావాలని కోరుకుంటారు. అలా కాసేపు వాళ్లని ఎత్తుని ముద్దాడితే పిల్లలు ఏడవరు. అలానే ఫీడింగ్ చేసినప్పుడు పిల్లలు ఏడుస్తున్నారంటే దానర్థం పిల్లాడికి తేన్పు రాలేదని. అప్పుడు పిల్లలను భుజంపై పడుకోబెట్టుకుని వీపు మీద రాయాలి. అలా చేస్తే కొంచెం కంఫర్ట్‌గా ఫీల్ అవుతారు. మేజర్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మాత్రం వైద్యుల సలహా తీసుకోవాలి. ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తినప్పుడు వైద్యులను సంప్రదించి తగిన సూచనలు తీసుకోవాలి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

దేశ ప్ర‌జ‌ల‌కు గుడ్ న్యూస్...ఫ్రీ రేష‌న్..ఫ్రీ వ్యాక్సిన్.. !

క్రికెట్ నుంచి ఇంగ్లాండ్ ఆటగాడు సస్పెండ్..?

మెగాస్టార్ కి చెల్లిగా బాలీవుడ్ బ్యూటీ..

వాళ్ల వికెట్ తీయడం నా అదృష్టం : రషీద్ ఖాన్

అమ్మ: గర్భవతిగా ఉన్నప్పుడు మచ్చలు వస్తున్నాయా.. ఇలా చేస్తే..?

రాజ్ తరుణ్ పెళ్లి కి సిద్ధమవుతున్నాడా ?

బ్రేకింగ్ : సాయంత్రం గం. 5కు మోడీ ప్ర‌సంగం.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>