PoliticsMaddipati Lakshmi Sailajaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/lakshadweep-issuee3b39dd6-3a2f-41e6-bfa7-344ddd9ee8b5-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/lakshadweep-issuee3b39dd6-3a2f-41e6-bfa7-344ddd9ee8b5-415x250-IndiaHerald.jpgకేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్న ల‌క్ష‌ద్వీప్ లో ఇటీవ‌లికాలంలో జ‌రుగుతున్న ప‌రిణామాలు ఏమాత్రం స‌రికాద‌ని పెద్ద సంఖ్య‌లో మాజీ ఐఏఎస్ అధికారులు ప్ర‌ధాని మోదీకి లేఖ రాయ‌డం సంచ‌ల‌నం సృష్టిస్తోంది. అభివృద్ధి పేరుతో లక్షద్వీప్‌లో ప్ర‌భుత్వం చేప‌డుతున్న చ‌ర్య‌లు ఆ ప్రాంత మౌలిక జీవ‌న విధానానికి భంగం క‌లిగించేలా ఉన్నాయ‌ని వారు లేఖ‌లో పేర్కొన్నారు. Lakshadweep issue{#}central government;Letter;sunday;local language;MPల‌క్ష‌ద్వీప్‌లో ఏం జ‌రుగుతోంది..? ప్ర‌ధానికి మాజీ ఐఏఎస్ ల లేఖ‌ల‌క్ష‌ద్వీప్‌లో ఏం జ‌రుగుతోంది..? ప్ర‌ధానికి మాజీ ఐఏఎస్ ల లేఖ‌Lakshadweep issue{#}central government;Letter;sunday;local language;MPMon, 07 Jun 2021 05:00:00 GMTకేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్న ల‌క్ష‌ద్వీప్ లో ఇటీవ‌లికాలంలో జ‌రుగుతున్న ప‌రిణామాలు ఏమాత్రం స‌రికాద‌ని పెద్ద సంఖ్య‌లో మాజీ ఐఏఎస్ అధికారులు ప్ర‌ధాని మోదీకి లేఖ రాయ‌డం సంచ‌ల‌నం సృష్టిస్తోంది. అభివృద్ధి పేరుతో లక్షద్వీప్‌లో ప్ర‌భుత్వం చేప‌డుతున్న చ‌ర్య‌లు ఆ ప్రాంత మౌలిక జీవ‌న విధానానికి భంగం క‌లిగించేలా ఉన్నాయ‌ని వారు లేఖ‌లో పేర్కొన్నారు. లక్షద్వీప్ అడ్మినిస్ట్రేటర్ గా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ ప్రఫుల్ ఇటీవ‌ల తీసుకుంటున్న నిర్ణ‌యాల‌ను, చేప‌డుతున్న‌ చ‌ర్య‌ల‌ను తాము నిర‌సిస్తున్నామంటూ ఏకంగా 93 మంది ఇండియ‌న్ అడ్మినిస్ట్రేటివ్ స‌ర్వీస్‌ మాజీ అధికారులు ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీకి ఆదివారం ఓ లేఖ రాశారు. అంతేకాదు త‌మ‌కు రాజ‌కీయాల‌తో సంబంధం లేద‌ని, ఏపార్టీకి తాము మ‌ద్ద‌తుగా, లేక వ్య‌తిరేకంగా తాము స్పందించ‌డం లేద‌ని, కేవ‌లం రాజ్యాంగం మీద గౌర‌వం, దాని ప‌రిర‌క్ష‌ణ కోస‌మే లేఖ రాస్తున్నామ‌ని గుర్తించాల‌ని కూడా వారు అందులో పేర్కొన్నారు.

ల‌క్ష‌ద్వీప్‌లో కొంత‌కాలంగా ర‌క్ష‌ణ చ‌ర్య‌ల పేరిట‌ స్థానిక‌  మ‌త్స్య‌కారుల బోట్ల‌లో నిఘాను పెంచేందుకు ప్ర‌త్యేకంగా అధికారుల‌ను నియ‌మించ‌డం వంటి చ‌ర్య‌లను ప్ర‌భుత్వం చేప‌డుతోంది. ఈ చ‌ర్య‌ల ప‌ట్ల స్థానికుల నుంచి తీవ్ర  వ్య‌తిరేక‌త‌, నిర‌స‌న వ్య‌క్త‌మ‌వుతున్నాయి. అయితే కేంద్రం తాను అనుకున్న‌దే చేసుకుంటూ వెళుతోంది. ఇదే అంశంపై స్థానిక ఎంపీ మ‌హ‌మ్మ‌ద్  ఫాజిల్ కూడా కేంద్ర ప్ర‌భుత్వంపై ఇటీవ‌ల‌ మండిప‌డ్డారు. భార‌త్‌కు 30 నాటిక‌ల్ మైళ్ల ప‌రిధి ఉన్న‌రాడార్ సిస్ట‌మ్ ఉంద‌ని, అత్యుత్త‌మ నేవీ ర‌క్ష‌ణ ద‌ళం, కోస్ట్‌గార్డ్ సిస్ట‌మ్ ఉన్నా తాజా చ‌ర్య‌లు ఎందుక‌ని ఎంపీ మ‌హ‌మ్మ‌ద్ ఫాజిల్ కూడా విమ‌ర్శించారు. తీర‌ప్రాంత రాష్ట్రాలైన గుజ‌రాత్ త‌మిళ‌నాడు, కేర‌ళ వంటి రాష్ట్రాల్లో ఇలాంటి చ‌ర్య‌లు ఎందుకు చేప‌ట్ట‌లేద‌ని ఆయ‌న నిల‌దీశారు. ఈ నేప‌థ్యంలోనే తాజాగా ఐఏఎస్‌లు లేఖ రాయ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది. ల‌క్ష‌ద్వీప్ అడ్మినిస్ట్రేట‌ర్ రూపొందించిన ముసాయిదాను రూపొందించే ముందు స్థానికుల ప్ర‌యోజ‌నాల‌ను, అభిప్రాయాల‌ను గౌర‌వించాల్సి ఉంద‌ని, అయితే అవేవీ ప‌ట్టించుకోలేద‌ని, వారిని సంప్ర‌దించ‌లేద‌ని, దీనివెనుక ఏదో పెద్ద అజెండా ఉంద‌నిపిస్తోంద‌ని ఐఏఎస్‌లు త‌మ లేఖ‌లో పేర్కొన్నారు. దీనిపై కేంద్ర ప్ర‌భుత్వ స్పంద‌న ఎలా ఉండ‌బోతుంద‌నే ఆస‌క్తి రాజ‌కీయ‌, అధికార వ‌ర్గాల్లో వ్య‌క్త‌మ‌వుతోంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కుకింగ్ : మష్రూమ్ తో మ్యాజిక్..

ప్రాణాలు కాపాడిన ఫేస్బుక్.. ఎలాగో తెలుసా?

మనీ : పెట్టుబడి తక్కువ.. రాబడి ఎక్కువ.. సేంద్రియ ఎరువుల తయారీ..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Maddipati Lakshmi Sailaja]]>