PoliticsMaddipati Lakshmi Sailajaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/mars-missione071f1a8-22ad-41cf-b8c6-85cd7ce9143a-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/mars-missione071f1a8-22ad-41cf-b8c6-85cd7ce9143a-415x250-IndiaHerald.jpgఅగ్రరాజ్యం అమెరికాకు చెందిన‌ అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా. ఇత‌ర దేశాల సాంకేతిక నిపుణుల‌కు ఊహ‌కంద‌ని ప‌రిశోధ‌న‌లు, ప్ర‌యోగాలు చేప‌ట్ట‌డంలో ఈ సంస్థ దానిక‌దే సాటి అని చెప్పాలి. ఈ సంస్థ చేప‌ట్టే కార్య‌క్ర‌మాలు కొన్ని ర‌హ‌స్యంగా సాగిపోతుంటాయి. కొన్ని మాత్ర‌మే బ‌య‌ట‌కు వ‌స్తుంటాయి. చంద్రుడి మీద‌కు మొట్ట‌మొద‌టగా మాన‌వుడిని పంపిన ఘ‌న‌త ఈ సంస్థ‌దే.mars mission{#}NASA;Marchనాసా చేప‌ట్టిన ఈ ప్రాజెక్టు గురించి వింటే షాక్ తినాల్సిందే..?నాసా చేప‌ట్టిన ఈ ప్రాజెక్టు గురించి వింటే షాక్ తినాల్సిందే..?mars mission{#}NASA;MarchMon, 07 Jun 2021 06:00:00 GMT
అగ్రరాజ్యం అమెరికాకు చెందిన‌ అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా. ఇత‌ర దేశాల సాంకేతిక నిపుణుల‌కు ఊహ‌కంద‌ని ప‌రిశోధ‌న‌లు, ప్ర‌యోగాలు చేప‌ట్ట‌డంలో ఈ సంస్థ దానిక‌దే సాటి అని చెప్పాలి. ఈ సంస్థ చేప‌ట్టే కార్య‌క్ర‌మాలు కొన్ని ర‌హ‌స్యంగా సాగిపోతుంటాయి. కొన్ని మాత్ర‌మే బ‌య‌ట‌కు వ‌స్తుంటాయి. చంద్రుడి మీద‌కు మొట్ట‌మొద‌టగా మాన‌వుడిని పంపిన ఘ‌న‌త ఈ సంస్థ‌దే. అంగార‌కుడి మీద ప్ర‌యోగాలు నిర్వ‌హించ‌డంలోనూ నాసా ఇత‌ర దేశాల ప‌రిశోధ‌నా సంస్థ‌ల‌న్నింటిక‌న్నా ముందుంది. ఇప్పుడు మ‌రో ప్ర‌తిష్ఠాత్మ‌క కార్య‌క్ర‌మం చేప‌ట్టింది ఈ సంస్థ‌. మాన‌వాళి చ‌రిత్ర‌లో ఇప్ప‌టిదాకా సాధ్యంకాని ఓ చారిత్రాత్మక ఘట్టానికి తెరతీసేందుకు స‌న్నాహాల్లో ఉంది.
 అంగార‌క గ్ర‌హం నుంచి ఒక కిలో మ‌ట్టిని భూమి మీదకు తెచ్చే ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. ఇదేమీ ఆషామాషీ వ్య‌వ‌హారం కాదు. భూమినుంచి 343. 87 మిలియ‌న్ల కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న‌ అంగారకుడి నుంచి ఓ కేజీ మట్టిని భూమి మీదకు తీసుకొచ్చేందుకు నాసా వెచ్చించ‌నున్న వ్య‌యం ఎంతో తెలుసా..?  అక్ష‌రాలా 9 బిలియ‌న్ డాల‌ర్లు. ఇది మ‌న రూపాయ‌ల్లోకి మార్చి చూస్తే రూ. 6 ల‌క్ష‌ల కోట్ల‌కు పైమాటే. అందుకే మ‌రి ఇలాంటి కార్య‌క్ర‌మాలు చేప‌ట్టాలంటే నాసాకు మాత్ర‌మే సాధ్య‌మ‌ని చెబుతారు. ఇదేమీ వెంట‌నే జ‌రిగిపోయే కార్య‌క్ర‌మం కాదు. ద‌శ‌ల‌వారీగా జ‌రిగే ఈ ప్రాజెక్టు పూర్త‌య్యేందుకు ద‌శాబ్ద‌కాలం పైనే ప‌డుతుంద‌ని శాస్త్ర‌వేత్త‌లు అంచనా వేస్తున్నారు. ఇంత‌కీ అంత భారీ వ్యయ ప్ర‌యాస‌ల‌కోర్చి ఆ గ్ర‌హం నుంచి మ‌ట్టి సేక‌రించే ప‌ని నాసా ఎందుకు చేప‌ట్టిన‌ట్టు..?  దానికి బ‌లమైన కార‌ణాలే ఉన్నాయి. ఆ మ‌ట్టిపై ప‌రిశోధ‌న‌లు చేయ‌డం ద్వారా అక్క‌డి జీవ‌జాలం ఉనికిని, మాన‌వాళికి ఆ గ్ర‌హం నివాస‌యోగ్యంగా ఉంటుందా అన్న విష‌యాన్నితెలుసుకోవ‌చ్చు. అంతేకాదు. భూమిపై ల‌భ్యంకాని అరుదైన లోహాలను గుర్తించ‌వచ్చు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా శాస్త్ర సాంకేతిక నిపుణుల‌నుంచి ఆస‌క్తి వ్య‌క్త‌మవుతున్న ఈ కార్య‌క్ర‌మం ఎలాంటి ఫ‌లిత‌మిస్తుందో చూడాల్సి ఉంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

టీఆర్ఎస్ నేతలు సాయం చేస్తేనే 'మీడియా' కవర్ చేస్తుందా..?

కుకింగ్ : మష్రూమ్ తో మ్యాజిక్..

ప్రాణాలు కాపాడిన ఫేస్బుక్.. ఎలాగో తెలుసా?

మనీ : పెట్టుబడి తక్కువ.. రాబడి ఎక్కువ.. సేంద్రియ ఎరువుల తయారీ..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Maddipati Lakshmi Sailaja]]>