MoviesSatyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/devi0dc0da51-0e32-4eb3-a91b-fe7a29bea1fe-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/devi0dc0da51-0e32-4eb3-a91b-fe7a29bea1fe-415x250-IndiaHerald.jpgటీనేజ్ లోనే మ్యూజిక్ డైరెక్టర్ అయి సంచలనం సృష్టించిన దేవీ శ్రీ ప్రసాద్ టాలీవుడ్ లో టాప్ హీరోలందరికీ అద్భుతమైన మ్యూజిక్ అందించాడు. ఆయన మ్యూజిక్ తోనే సినిమాలు హిట్ అయిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అయితే గత కొంతకాలంగా రేసులో దేవీశ్రీ వెనకబడ్డాడు అనే చెప్పాలి. devi{#}Director;sree;Tollywood;thaman s;Cinema;Balakrishna;kalyan;sukumar;Joseph Vijay;koratala siva;mani sharma;NTR;Yevaruదేవీశ్రీని దూరం పెడుతున్నారా.... ?దేవీశ్రీని దూరం పెడుతున్నారా.... ?devi{#}Director;sree;Tollywood;thaman s;Cinema;Balakrishna;kalyan;sukumar;Joseph Vijay;koratala siva;mani sharma;NTR;YevaruMon, 07 Jun 2021 18:59:50 GMTటీనేజ్ లోనే మ్యూజిక్ డైరెక్టర్ అయి సంచలనం సృష్టించిన దేవీ శ్రీ ప్రసాద్ టాలీవుడ్ లో టాప్ హీరోలందరికీ అద్భుతమైన మ్యూజిక్ అందించాడు. ఆయన మ్యూజిక్ తోనే సినిమాలు హిట్ అయిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అయితే గత కొంతకాలంగా రేసులో దేవీశ్రీ వెనకబడ్డాడు అనే చెప్పాలి.

ఇపుడు సీన్ లోకి తమన్ వచ్చేశాడు. తమన్ మ్యూజిక్ కావాలని అంతా పట్టుపట్టే పరిస్థితి ఉంది. తమన్ సీనియర్ హీరోల నుంచి కొత్త వారి దాకా అందరికీ మ్యూజిక్ చేస్తున్నాడు. పైగా అల వైకుంఠపురంలో సినిమా బ్లాక్ బస్టర్ వెనక తమన్ మ్యూజిక్ మ్యాజిక్ ఉందని అంతా అంగీకరిస్తారు. ఇదిలా ఉంటే తమన్ ఇపుడు బాలయ్య అఖండకు మ్యూజిక్ చేస్తున్నాడు, అలాగే పవన్  కళ్యాణ్ రానా మూవీకి చేస్తున్నాడు. వీటితో పాటు చాలా క్రేజీ ప్రాజెక్టులకు కమిట్ అయి ఉన్నాడు. బాలయ్య గోపీచంద్ మూవీకి కూడా తమన్ మ్యూజిక్ అని అంటున్నారు.

మరో వైపు చూస్తే పుష్ప మూవీకి దేవీశ్రీని తీసుకున్న సుకుమార్  విజయ్ దేవరకొండతో తీసే తన తరువాత సినిమాకు మాత్రం అనిరుధ్ ని సెలెక్ట్ చేస్తున్నాడు అంటున్నారు. ఇంకో వైపు చూస్తే కొరటాల శివ కూడా దేవీశ్రీని పక్కన పెట్టేశాడా అన్న చర్చ అయితే సాగుతోంది. కొరటాల శివ ఆచార్య మూవీకి మణిశర్మ మ్యూజిక్ చేస్తూంటే ఎన్టీయార్ తో చేయబోయే  మూవీకి తమన్ అని  అనుకుంటున్నారుట. మొత్తానికి ఎవరు కాదన్నా కూడా సుకుమార్, కొరటాల శివ కచ్చితంగా దేవీశ్రీని కొనసాగిస్తారు అన్నది తెలిసిందే. వారే ఇపుడు వేరే డైరెక్టర్లతో  మ్యూజిక్ చేయిస్తూంటే దేవీశ్రీకి ఆఫర్లు తగ్గిపోతున్నాయా అన్న చర్చ అయితే ఉంది. ఏది ఏమైనా టాలెంటెడ్ మ్యూజీషియన్ గా ఉన్న దేవీశ్రీ కొంత తగ్గినా మళ్ళీ రేసులోకి దూసుకొస్తాడు అనే వారూ ఉన్నారు. మొత్తానికి దేవీశ్రీ కుర్ర హీరోలకు మాత్రం బాగా అందుబాటులోకి వచ్చాడు అంటున్నారు.








Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

పుష్ప సినిమాలో మెగా పాట.. ఇక రచ్చరచ్చే..?

అరటి తో అదిరే వంట..

ఇంకా ఐదు రోజులే.. కరోనా రోగులు ఇక జైల్లోకే?

నెవ్వర్ బిఫోర్ రోల్‌లో రౌడీ హీరో.. ?

ప్రభాస్ 'రాధే శ్యామ్' కి అమెజాన్ ప్రైమ్ భారీ ఆఫర్..!!

నేపాల్ ప్రజాస్వామ్యంతో చైనా ఆట..

క్రియేటర్స్ కి ఇబ్బందిగా మారిన యూట్యూబ్ మార్పులు..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>