MoviesShanmukhaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/pawan-kalyan1433d605-adab-4d2e-b56c-8f6856f55672-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/pawan-kalyan1433d605-adab-4d2e-b56c-8f6856f55672-415x250-IndiaHerald.jpgపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ డైలాగ్స్, నటన, వైవిధ్యమైన కథలకు ఎందరో అభిమానులు ఉన్నారు. కేవలం నటుడిగానే కాకుండా దర్శకుడిగా, గాయకుడిగా, రచయితగా, రాజకీయ నాయకుడిగా కూడా అందరినీ మెప్పించాడు. అయితే పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి వరుస సినిమాలతో జోరు కనబరుస్తున్నాడు. వకీల్‌సాబ్..pawan kalyan{#}Pawan Kalyan;kalyan;VakeelSaab;Cinema;News;shankarమళ్లీ పవన్ సెట్స్ పైకి.. అప్పటి నుంచే..?మళ్లీ పవన్ సెట్స్ పైకి.. అప్పటి నుంచే..?pawan kalyan{#}Pawan Kalyan;kalyan;VakeelSaab;Cinema;News;shankarMon, 07 Jun 2021 18:54:21 GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ డైలాగ్స్, నటన, వైవిధ్యమైన కథలకు ఎందరో అభిమానులు ఉన్నారు. కేవలం నటుడిగానే కాకుండా దర్శకుడిగా, గాయకుడిగా, రచయితగా, రాజకీయ నాయకుడిగా కూడా అందరినీ మెప్పించాడు. అయితే పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి వరుస సినిమాలతో జోరు కనబరుస్తున్నాడు. వకీల్‌సాబ్ సినిమాతో భారీ హిట్ అందుకున్న పవన్ ప్రస్తుతం ‘అయ్యనుమ్ కోషియుమ్’ రీమేక్‌తో పాటు ‘హరిహర వీరమల్లు’ సినిమాల్లో నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాలు ఇప్పటి వరకు ఏక కాలంలోనే చిత్రీకరణ జరుపుకున్నాయి.


 అయితే ప్రస్తుతం కరోనా రెండో వేవ్ కారణంగా ఈ రెండు సినిమాల చిత్రీకరణ నిలిచిపోయింది. ఇప్పటి వరకు ఏ ఒక్క సినిమా చిత్రీకరణ కూడా తిరిగి మొదలు కాలేదు. అంతేకాకుండా ఇప్పుడప్పుడే పవన్ తిరిగి సెట్స్ పైకి రారని వార్తలు వినిపించాయి. అయితే తాజాగా ఈ సినిమాల షూటింగ్ విషయంలో పవన్ కళ్యాణ్ మూవీ మేకర్స్‌కు క్లారిటీ ఇచ్చాడట. సినిమా చిత్రీకరణను త్వరలో తిరిగా ప్రారంభించుకోవచ్చని పవన్ చెప్పారట. దాంతో మూవీ మేకర్స్ సినిమా చిత్రీకరణను తిరిగి ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నెల మధ్య నుంచే క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘హరిహర వీరమల్లు’ రీస్టార్ట్ అవుతుందని.


 ఈ నెలాఖరు నుండి ఈ సినిమా చిత్రీకరణలో పవన్ కూడా చేరనున్నాడు. అదే విధంగా వచ్చే నెల నుంచి సాగర్ కే చంద్ర డైరెక్ట్ చేస్తున్న సినిమా కూడా మొదలవుతుంది. ఈ రెండు సినిమాలు ఈ సారి కూడా ఇదివరకటి తరహాలోనే ఒకేసారి షూటింగ్ జరుపుకోనున్నాయి. అంతేకాకుండా పవన్, శంకర్ కాంబోలో రానున్న సినిమా కూడా ఆగస్టు నెలలో మొదలు కానుందట. దీనిని బట్టి చూస్తుంటే ఆగస్టు నాటికి పవన్ నటిస్తున్న మూడు సినిమాలు సెట్స్ పై ఉండనున్నాయి. అంటే పవర్ స్టార్ అభిమానులకు అప్‌డేట్‌లు వరుసగా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

పుష్ప సినిమాలో మెగా పాట.. ఇక రచ్చరచ్చే..?

అరటి తో అదిరే వంట..

ఇంకా ఐదు రోజులే.. కరోనా రోగులు ఇక జైల్లోకే?

నెవ్వర్ బిఫోర్ రోల్‌లో రౌడీ హీరో.. ?

ప్రభాస్ 'రాధే శ్యామ్' కి అమెజాన్ ప్రైమ్ భారీ ఆఫర్..!!

నేపాల్ ప్రజాస్వామ్యంతో చైనా ఆట..

క్రియేటర్స్ కి ఇబ్బందిగా మారిన యూట్యూబ్ మార్పులు..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Shanmukha]]>