PoliticsSuma Kallamadieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/indian-penal-code-sectionsdac39b66-c61f-40dd-8604-6acb46d12c7e-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/indian-penal-code-sectionsdac39b66-c61f-40dd-8604-6acb46d12c7e-415x250-IndiaHerald.jpgప్రతి భారతీయ పౌరుడు ఐపీసీ - ఇండియన్ పీనల్ కోడ్ (భారతీయ శిక్షాస్మృతి) సెక్షన్ల గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఏ నేరం చేస్తే ఏ సెక్షన్ కింద ఎటువంటి శిక్షలు పడతాయో ఈ ఆర్టికల్ లో వివరంగా తెలుసుకుందాం. సెక్షన్ 307 = హత్యా ప్రయత్నం..(మర్డర్ అట్టెంప్ట్) ఎవరైనా చంపాలనే ఉద్దేశ్యంతో దాడి చేసినప్పుడు అది విఫలం అయితే దాన్ని హత్యాప్రయత్నం అంటారు. ఈ నేరం చేస్తే పదేళ్ల జైలు శిక్ష పడుతుంది లేదా యావజ్జీవ కారాగార శిక్ష పడుతుంది. అంతేకాకుండా జరిమానా కూడా విధించబడును. సెక్షన్ 302 = హత్యకు శిక్ష.. (మర్డర్ కేసు) indian penal code sections{#}Indian;Murder;Murder.ప్రతీ భారతీయ పౌరుడు తెలుసుకోవాల్సిన ఐపీసీ సెక్షన్లు ఇవే..!ప్రతీ భారతీయ పౌరుడు తెలుసుకోవాల్సిన ఐపీసీ సెక్షన్లు ఇవే..!indian penal code sections{#}Indian;Murder;Murder.Mon, 07 Jun 2021 16:00:00 GMTఇండియన్ పీనల్ కోడ్ (భారతీయ శిక్షాస్మృతి) సెక్షన్ల గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఏ నేరం చేస్తే ఏ సెక్షన్ కింద ఎటువంటి శిక్షలు పడతాయో ఈ ఆర్టికల్ లో వివరంగా తెలుసుకుందాం.


సెక్షన్ 307 = హత్యా ప్రయత్నం..(మర్డర్ అట్టెంప్ట్) ఎవరైనా చంపాలనే ఉద్దేశ్యంతో దాడి చేసినప్పుడు అది విఫలం అయితే దాన్ని హత్యాప్రయత్నం అంటారు. ఈ నేరం చేస్తే పదేళ్ల జైలు శిక్ష పడుతుంది లేదా యావజ్జీవ కారాగార శిక్ష పడుతుంది. అంతేకాకుండా జరిమానా కూడా విధించబడును.



సెక్షన్ 302 = హత్యకు శిక్ష.. (మర్డర్ కేసు) ఎవరైతే ఉద్దేశపూర్వకంగా హత్య చేస్తారో.. వారిని ఐపీసీ సెక్షన్ 302 కింద బుక్ చేస్తారు. ఈ నేరం చేసిన వారికి మరణశిక్ష లేదా యావజ్జీవ కారాగార శిక్ష పడుతుంది.



సెక్షన్ 376 = అత్యాచారం.. (రేప్) ఎవరైతే ఆడవారి ఇష్టానికి వ్యతిరేకంగా మానభంగం చేస్తారో వారు ఐపీసీ సెక్షన్ 376 కింద శిక్షార్హులు అవుతారు. ఈ నేరానికి పాల్పడిన వారికి కనిష్టంగా ఏడు సంవత్సరాల శిక్ష విధించబడుతుంది. గరిష్టంగా యావజ్జీవ కారాగార శిక్ష కూడా పడొచ్చు. అలాగే జరిమానా కూడా విధించవచ్చు. చిన్న పిల్లలపై లైంగిక దాడికి పాల్పడేతే మరింత కఠిన కారాగార శిక్షలు విధించబడతాయి.



సెక్షన్ 365 = కిడ్నాప్, అపహరణ.. ఎవరైతే మనుషులను అపహరించి రహస్యంగా దాచి పెడతారో వారిపై ఐపీసీ సెక్షన్ 365 కింద కేసు నమోదు చేస్తారు. ఈ నేరానికి పాల్పడిన వారికి ఏడేళ్ల జైలు శిక్ష తోపాటు జరిమానా కూడా విధించబడును.



సెక్షన్ 300  =  హత్య.. ఎవరైనా దాడి చేసినప్పుడు బాధితులు తీవ్రంగా గాయపడి చనిపోతే.. నిందితులను సెక్షన్ 300 కింద బుక్ చేస్తారు. ఈ సెక్షన్ కింద యావజ్జీవ కారాగార శిక్ష పడవచ్చు లేదా మరణ శిక్ష కూడా పడొచ్చు. అంతేకాకుండా జరిమానా కూడా విధించవచ్చు.



సెక్షన్ 309 = ఆత్మహత్య ప్రయత్నం.. ఎవరైతే ఉద్దేశపూర్వకంగా చనిపోవడానికి ప్రయత్నిస్తారో వారిపై సెక్షన్ 309 కింద కేస్ ఫైల్ అవుతుంది. ఇటువంటి నేరానికి పాల్పడిన వారికి ఒక సంవత్సరం జైలు శిక్ష లేదా జరిమానా విధించబడుతుంది.



సెక్షన్ 310 = (థగ్) హత్య, కిడ్నాప్, దోపిడీ నేరాలలో గుంపు గా ఉండుట లేదా జట్టుగా ఉండుట.. దోపిడీ చేసేందుకు హత్య చేయుట.. ఇలాంటి నేరాలకు పాల్పడితే సెక్షన్ 310 కింద కేసు నమోదు చేస్తారు. ఈ నేరాలకు పాల్పడ్డ వారికి కఠిన కారాగార శిక్షలు విధించబడతాయి.



సెక్షన్ 312 = గర్భస్రావం.. అబార్షన్.. ఎవరైతే గర్భవతులకు గర్భస్రావం అయ్యేలా చేస్తారో వారిని సెక్షన్ 312 కింద బుక్ చేస్తారు. గర్భంలోని పిండం కదలికల సమయంలో గర్భస్రావం చేస్తే.. వారికి ఏడేళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా విధించబడుతుంది. పిండం ఇంకా అభివృద్ధి చెందినప్పుడు అబార్షన్ చేస్తే వారికి మూడేళ్ల జైలు శిక్ష పడుతుంది. ఒకవేళ గర్భవతి ప్రాణాలను కాపాడేందుకు అబార్షన్ చేస్తే ఎటువంటి శిక్ష పడదు.



సెక్షన్ 499 = పరువు నష్టం దావా.. ఎవరైనా ఇతరుల పరువు ప్రతిష్టలకు భంగం కలిగేలా వ్యాఖ్యలు చేసిన లేదా సైగలతో, చిత్రాలతో, వీడియోలతో ప్రతిష్టకు భంగం కలిగేలా ప్రవర్తించిన వారిపై ఐపీసీ సెక్షన్ 499 కింద కేసు నమోదు అవుతుంది.
   
  



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వెంకటేష్ ఉంటున్న ఇల్లు ఖరీదు ఎంతో తెలుసా.. ?

నేపాల్ ప్రజాస్వామ్యంతో చైనా ఆట..

క్రియేటర్స్ కి ఇబ్బందిగా మారిన యూట్యూబ్ మార్పులు..?

క్రికెట్ నుంచి ఇంగ్లాండ్ ఆటగాడు సస్పెండ్..?

మెగాస్టార్ కి చెల్లిగా బాలీవుడ్ బ్యూటీ..

వాళ్ల వికెట్ తీయడం నా అదృష్టం : రషీద్ ఖాన్

అమ్మ: గర్భవతిగా ఉన్నప్పుడు మచ్చలు వస్తున్నాయా.. ఇలా చేస్తే..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>