MoviesShanmukhaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ramanayudu8950ee5c-f83d-480d-b7ee-5abf53e7386c-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ramanayudu8950ee5c-f83d-480d-b7ee-5abf53e7386c-415x250-IndiaHerald.jpgడీ రామానాయుడు ఈ పేరు తెలియని వారు భారత చలనచిత్ర పరిశ్రమలో ఉండరు. 13 భాషల్లో చలనచిత్రాలను నిర్మించి దేశ వ్యాప్తంగా ఘనకీర్తిని పొందిన సినీ నిర్మాత డీ రామానాయుడుగారు. రైతు కుటుంబం నుంచి వ్యాపార రంగంలోకి అడుగు పెట్టి ఆ తరువాత సినీ రంగంవైపు దృష్టిని మరల్చి ఎన్నో విజయవంతమైన చలన చిత్రాలను నిర్మించారు. సినీ నిర్మాణ రంగంలో అరుదైన సినిమాలను నిర్మించి మూవీ మొఘల్ అనిపించుకున్నారు. చలనచిత్రసీమ..ramanayudu{#}D Ramanaidu;Nimmala Ramanaidu;producer;Cinema;bhanumathi old;Telugu;Government;Telugu Desam Party;CBN;Bapatlaడీ రామానాయుడు ‘మూవీ మొఘల్’ ఎలా అయ్యారంటే..డీ రామానాయుడు ‘మూవీ మొఘల్’ ఎలా అయ్యారంటే..ramanayudu{#}D Ramanaidu;Nimmala Ramanaidu;producer;Cinema;bhanumathi old;Telugu;Government;Telugu Desam Party;CBN;BapatlaSun, 06 Jun 2021 13:35:00 GMTడీ రామానాయుడు ఈ పేరు తెలియని వారు భారత చలనచిత్ర పరిశ్రమలో ఉండరు. 13 భాషల్లో చలనచిత్రాలను నిర్మించి దేశ వ్యాప్తంగా ఘనకీర్తిని పొందిన సినీ నిర్మాత డీ రామానాయుడుగారు. రైతు కుటుంబం నుంచి వ్యాపార రంగంలోకి అడుగు పెట్టి ఆ తరువాత సినీ రంగంవైపు దృష్టిని మరల్చి ఎన్నో విజయవంతమైన చలన చిత్రాలను నిర్మించారు. సినీ నిర్మాణ రంగంలో అరుదైన సినిమాలను నిర్మించి మూవీ మొఘల్ అనిపించుకున్నారు. చలనచిత్రసీమకు ఎందరో స్టార్ హీరోలను, హీరోయిన్‌లను, అద్భుత నటీనటులను ఇలా మరెందరినో పరిచయం చేశారు. కేవలం నిర్మాతగానే కాకుండా నటుడిగాను, ప్రజా ప్రతినిధిగాను అందరినీ మెప్పించారు.
డీ రామానాయుడు గారు 1963లో జగ్గయ్య, భానుమతి ప్రధాన పాత్రలుగా వచ్చిన ‘అనురాగం’అనే సినిమాతో సినీ రంగంలో నిర్మాతగా అడుగుపెట్టారు. ఈ సినిమాకు నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించారు. ఆ సినిమా హిట్ అవడంతో నిర్మాతగా కొనసాగారు. ఆ తరువాత తన సొంత సినిమా కోసం ‘సురేష్ ప్రొడక్షన్’ అనే బ్యానర్‌ను స్థాపించి అదే బ్యానర్‌పై 1963లో ఎన్‌టీఆర్ హీరోగా ‘రాముడు భీముడు’ సినిమాను ప్రారంభించారు. ఈ  సినిమాను 1964లో విడుదల  చేశారు. ఈ చిత్రంతోనే డీ రామానాయుడుగారు నిర్మాతగా తెలుగు చలనచిత్ర సీమకు పరిచయం అయ్యారు. ఈ సినిమా భారీ హిట్ అందుకుంది. ఆ తరువాత వరుస సినిమాలు తీసినా ఆశించిన ఫలితాలు రాలేదు.
 1971లో వచ్చిన ‘ప్రేమ్‌నగర్’ సినిమాతో డీ రామానాయుడు గారు మళ్లీ హిట్ ట్రాక్ అందుకున్నారు. ఆ తరువాత వరుస సినిమాలతో విజయవంతమైన నిర్మాతగా నిలిచారు. ఆయన తెలుగులో 84 సినిమాలు, తమిళంలో10, హిందీలో 17 సినిమాలు చేశారు. ఇదే విధంగా 13 భాషల్లో కలిపి దాదాపు 150కి పైగా సినిమాలను నిర్మించారు. అత్యధిక సినిమాలను నిర్మించిన నిర్మాతగా ‘గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు’ను సాధించారు. అదే విధంగా 2010లో సినీ పరిశ్రమలో గొప్పగా చెప్పుకునే ‘దాదా సాహెబ్ ఫాల్కే’ అవార్డును అందుకున్నారు. 2013లో ‘పద్మ భూషణ్’ అవార్డును భారత ప్రభుత్వం ఆయనకు ప్రధానం చేసింది.
కేవలం నిర్మాతగానే కాకుండా ప్రాజాసేవలోనూ అందరినీ మెప్పించారు. ఇందులో భాగంగా 1999లో తెలుగు దేశం పార్టీలో చేరారు. నారా చంద్రబాబు గారి నాయకత్వంలో బాపట్ల నుంచి ఎంపీగా గెలిచి ‘బెస్ట్ పార్లమెంటేరియన్’గా కూడా అవార్డును అందుకున్నారు.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కుకింగ్ : మష్రూమ్ తో మ్యాజిక్..

ప్రాణాలు కాపాడిన ఫేస్బుక్.. ఎలాగో తెలుసా?

మనీ : పెట్టుబడి తక్కువ.. రాబడి ఎక్కువ.. సేంద్రియ ఎరువుల తయారీ..

విజయం మీదే: ఇవి పాటిస్తే విజయం వద్దన్నా మీ వెంటే వస్తుంది ...

ఒక్క ప్రోమోతో రూమర్లకు చెక్ పెట్టిన 'ఎన్టీఆర్'..!!

కమర్షియల్ యాడ్స్ తో కోట్లు సంపాదిస్తున్న తెలుగు హీరోలు

ఎన్టీఆర్, బాలయ్య ఇద్దరూ తొలిసారి ఇక్కడే కలుసుకున్నారట.. ఎక్కడో తెలుసా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Shanmukha]]>