MoviesN.ANJIeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/politics_latestnews/jagathy94079800-1476-451e-9b43-9b7431d31b6a-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/politics_latestnews/jagathy94079800-1476-451e-9b43-9b7431d31b6a-415x250-IndiaHerald.jpgఒక్కపుడు వెండితెరకు, బుల్లితెరకు మధ్య తేడా ఉండేది. కానీ ఇప్పుడు ఇండస్ట్రీలో వెండితెరకు ఎంత క్రెజ్ ఉంటుందో బుల్లితెరకు కూడా అంతే క్రెజ్ ఉంది. బుల్లితెరపై ఎప్పటికప్పుడు కొత్త హీరోయిన్స్ పరిచయం అవుతూనే ఉంటారు. ఇక కొత్త సీరియల్స్ పుట్టుకొచ్చిన ప్రతిసారి కొత్త కథానాయికలు పరిచయం అవుతూనే ఉంటారు.Jagathy{#}Husband;Heroine;jyothi;marriage;Kannada;Teluguసీరియల్ నటి జగతి భర్త ఎవరో మీకు తెలుసా..?సీరియల్ నటి జగతి భర్త ఎవరో మీకు తెలుసా..?Jagathy{#}Husband;Heroine;jyothi;marriage;Kannada;TeluguSun, 06 Jun 2021 08:53:34 GMTఒక్కపుడు వెండితెరకు, బుల్లితెరకు మధ్య తేడా ఉండేది. కానీ ఇప్పుడు ఇండస్ట్రీలో వెండితెరకు ఎంత క్రెజ్ ఉంటుందో బుల్లితెరకు కూడా అంతే క్రెజ్ ఉంది. బుల్లితెరపై ఎప్పటికప్పుడు కొత్త హీరోయిన్స్ పరిచయం అవుతూనే ఉంటారు. ఇక కొత్త సీరియల్స్ పుట్టుకొచ్చిన ప్రతిసారి కొత్త కథానాయికలు పరిచయం అవుతూనే ఉంటారు. ఆలా ఇండస్ట్రీకి పరిచయమైన వారిలో కొందరికి మాత్రమే సరైన గుర్తింపు వస్తుంది. ఇక నటించింది ఒక్క సీరియల్ అయినా వాళ్ళ నటనతో ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకుంటారు.

ఇక బుల్లితెరపై కనువిందు చేసే సీరియల్స్ కి అభిమానుల నుండి ఆదరణ లభిస్తుంది. వెండితేర హీరోలను స్క్రీన్ పై ఏ రేంజ్ లో చూపిస్తారో ఇప్పుడు బుల్లితెరపై నటులను కూడా అదే రేంజ్ లో చూపిస్తున్నారు. అందుకే ఏ ఛానల్ మంచి సీరియల్ వస్తే దాన్ని ఆదరిస్తున్నారు. ధారావాహికంగా సీరియల్స్ నడుస్తున్నాయి. ప్రముఖ టివి ఛానల్ లో ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ కి మంచి ఆదరణ లభిస్తోంది. ఇందులో జగతి పాత్రలో నటిస్తున్న నటికు కూడా మంచి మార్కులు పడుతున్నాయి.

అయితే జగతి పాత్రలో నటిస్తున్న నటిపేరు జ్యోతి రాయ్. ఈమె కర్ణాటకలోని మడిగిరిలో 1985జులై 4న జన్మించింది. ఈమెకు బ్రదర్, సిస్టర్ కూడా ఉన్నారు. కర్ణాటక లోనే స్టడీస్ పూర్తిచేసిన ఈమె ఫిలిం ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈమెకు పెళ్లి జరగ్గా ,భర్త పద్మనాభ బెంగుళూరులో నెట్ వర్క్ ఇంజనీరింగ్ పని చేస్తున్నాడు. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు.

ఆమె పలు కన్నడ సీరియల్స్ లో నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న జ్యోతిరాయ్ కన్నడ సినిమాల్లో కూడా నటించింది. ఇలా బుల్లితెర, వెండితెరమీద కూడా కూడా తనకు ఓ ఇమేజ్ తెచ్చుకుంది. గుప్పెడంత మనసు సీరియల్ లో జగతిగా పాజిటివ్ రోల్ లో నటిస్తూ తెలుగు ఆడియన్స్ మనసు దోచుకుంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

"పాగల్" హీరో ... యాంకర్ సుమని అంత మాటన్నాడేంటి ?

విజయం మీదే: ఇవి పాటిస్తే విజయం వద్దన్నా మీ వెంటే వస్తుంది ...

ఒక్క ప్రోమోతో రూమర్లకు చెక్ పెట్టిన 'ఎన్టీఆర్'..!!

కమర్షియల్ యాడ్స్ తో కోట్లు సంపాదిస్తున్న తెలుగు హీరోలు

ఎన్టీఆర్, బాలయ్య ఇద్దరూ తొలిసారి ఇక్కడే కలుసుకున్నారట.. ఎక్కడో తెలుసా..?

త్వరలో సినీ ప్రముఖులతో కేసీఆర్ భేటీ..?

అలా చేద్దామని ప్రతిజ్ఞ చేద్దాం: మహేష్ బాబు



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>