EditorialMaddipati Lakshmi Sailajaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/kcr62d29ff9-9701-489a-b242-5badf6701880-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/kcr62d29ff9-9701-489a-b242-5badf6701880-415x250-IndiaHerald.jpgతెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ఇంకా రెండేళ్లు గ‌డువు ఉండ‌గానే ముఖ్య‌మంత్రి కేసీఆర్ మూడోసారి అధికార పీఠాన్ని ద‌క్కించుకోవ‌డ‌మే ల‌క్ష్యంగా కార్యాచ‌ర‌ణ మొద‌లుపెట్టారు. పార్టీలో భ‌విష్య‌త్తులో స‌మాంత‌ర అధికార కేంద్రాలుగా ఎదుగుతార‌ని అనుమానం ఉన్న‌వారిని ముందుగానే బ‌య‌ట‌కు పంపిస్తున్నారు. ఈటెల రాజేంద‌ర్ విష‌యంలో జ‌రిగింద‌దే. త‌ద్వారా అసంతృప్త నేత‌లు ఇంకా ఎవ‌రైనా వెళ్లిపోయినా ఆ నియోజ‌క‌వ‌ర్గాల్లో కొత్త నాయ‌క‌త్వాన్ని త‌యారుచేసుకునే వెసులుబాటు, త‌గినంత స‌మ‌యం ఉండేలా చూసుకుంటున్నారు.kcr{#}Telangana;KCR;CMకేసీఆర్ ఇక‌పై ఫార్మ్‌హౌస్ వ‌ద‌లి ప్ర‌జ‌ల్లోకి వెళ్ల‌నున్నారా...?కేసీఆర్ ఇక‌పై ఫార్మ్‌హౌస్ వ‌ద‌లి ప్ర‌జ‌ల్లోకి వెళ్ల‌నున్నారా...?kcr{#}Telangana;KCR;CMSun, 06 Jun 2021 05:00:00 GMTతెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ఇంకా రెండేళ్లు గ‌డువు ఉండ‌గానే ముఖ్య‌మంత్రి కేసీఆర్ మూడోసారి అధికార పీఠాన్ని ద‌క్కించుకోవ‌డ‌మే ల‌క్ష్యంగా కార్యాచ‌ర‌ణ మొద‌లుపెట్టారు. పార్టీలో భ‌విష్య‌త్తులో స‌మాంత‌ర అధికార కేంద్రాలుగా ఎదుగుతార‌ని అనుమానం ఉన్న‌వారిని ముందుగానే బ‌య‌ట‌కు పంపిస్తున్నారు. ఈటెల రాజేంద‌ర్ విష‌యంలో జ‌రిగింద‌దే. త‌ద్వారా అసంతృప్త నేత‌లు ఇంకా ఎవ‌రైనా వెళ్లిపోయినా ఆ నియోజ‌క‌వ‌ర్గాల్లో కొత్త నాయ‌క‌త్వాన్ని త‌యారుచేసుకునే వెసులుబాటు, త‌గినంత స‌మ‌యం ఉండేలా చూసుకుంటున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో ఆయ‌న ప్ర‌ధానంగా పోటీప‌డింది కాంగ్రెస్ పార్టీతో. ఆ కార‌ణంగానే కేంద్రంలో అధికారంలో ఉన్న‌ బీజేపీ ప్ర‌భుత్వం నుంచి ఆయ‌న‌కు ప్ర‌త్య‌క్షంగా ప‌రోక్షంగా పూర్తి మ‌ద్ద‌తు ల‌భించింది. కానీ ఇప్పుడు ప‌రిస్థితి మారింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌తోపాటుగా బీజేపీ కూడా ఆయ‌న‌కు ప్ర‌త్య‌ర్థులుగా నిలిచే అవ‌కాశ‌మే ఎక్కువ‌గా క‌నిపిస్తోంది
 అందుకు త‌గిన‌ట్టుగానే ఆయ‌న రాజ‌కీయ‌ వ్యూహ ర‌చ‌న సాగుతోంది. త‌న‌దైన శైలిలో సంక్షేమ కార్య‌క్ర‌మాల‌కు కేసీఆర్‌ పెద్ద పీట వేస్తున్నారు. సాగునీటి ప‌థ‌కాల ద్వారా తెలంగాణ రైతుల‌ స్థితిగ‌తుల‌ను టీఆర్ఎస్ ప్ర‌భుత్వం వ‌చ్చాక ఎలా మార్చిందీ బ‌లంగా ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళుతున్నారు.
అంతేకాదు.. తాను ఫార్మ్‌హౌస్ నుంచే ప‌రిపాల‌న సాగిస్తాన‌ని, ప్ర‌జ‌ల్లోకి వెళ్ల‌న‌ని విప‌క్షాలు చేసే ప్ర‌చారాన్ని స‌మ‌ర్థంగా తిప్పికొట్టే ప్ర‌య‌త్న‌మూ చేస్తున్నారు. అందులో భాగంగానే ఆయ‌న సీఎం అయిన ఏడేళ్ల‌లో తొలిసారిగా గాంధీ ఆసుపత్రిని సంద‌ర్శించారు. అంతేకాదు పీపీఈ కిట్ ధ‌రించ‌కుండానే అక్క‌డ కోవిడ్ పేషెంట్లు చికిత్స పొందుతున్న వార్డుల‌కు వెళ్లి వారికి భ‌రోసానిచ్చే ప్ర‌య‌త్నం చేశారు. త‌ద్వారా విప‌క్షాల‌ను,అధికారుల‌ను కూడా కేసీఆర్ ఆశ్ఛ‌ర్య ప‌రిచారు. ఈటెల‌ రాజేంద‌ర్ ను మంత్రి ప‌ద‌వి నుంచి తొల‌గించిన త‌రువాత ఆ శాఖను త‌న‌దగ్గ‌రే ఉంచుకోవ‌డం ద్వారా ప్ర‌జారోగ్యానికి తాను అధిక ప్రాధాన్యం ఇస్తున్న‌ట్టు ఆయ‌న సంకేతాలు పంపారు. క‌రోనా ప్ర‌భావం త‌గ్గాక ప్ర‌జల్లోకి విస్తృతంగా వెళ్లేందుకు ఆయ‌న ప్ర‌ణాళిక ర‌చించుకున్న‌ట్టు పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. మంత్రి హ‌రీష్‌రావును మ‌రోసారి ఆయ‌న పార్టీ ప్ర‌చార ర‌థ‌సార‌థిగా వినియోగించుకోనున్న‌ట్టు జ‌రుగుతున్న ప‌రిణామాలు సూచిస్తున్నాయి. మొత్తానికి కేసీఆర్ రెండేళ్ల ముందునుంచే  ఎన్నిక‌ల యుద్ధానికి అస్త్ర‌శ‌స్త్రాల‌న‌న్నింటినీ సిద్ధం చేసుకుంటున్న ప‌రిస్థితి క‌నిపిస్తుండ‌గా ఆయ‌న‌ను దీటుగా ఎదుర్కొనేందుకు విప‌క్షాలు ఏ వ్యూహంతో ముందుకెళ‌తాయో చూడాల్సి ఉంది.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

దోచుకుని దాచుకోవాలానుకున్నారు.. కానీ ముక్కు పిండి వసూలు చేసారు?

విజయం మీదే: ఇవి పాటిస్తే విజయం వద్దన్నా మీ వెంటే వస్తుంది ...

ఒక్క ప్రోమోతో రూమర్లకు చెక్ పెట్టిన 'ఎన్టీఆర్'..!!

కమర్షియల్ యాడ్స్ తో కోట్లు సంపాదిస్తున్న తెలుగు హీరోలు

ఎన్టీఆర్, బాలయ్య ఇద్దరూ తొలిసారి ఇక్కడే కలుసుకున్నారట.. ఎక్కడో తెలుసా..?

త్వరలో సినీ ప్రముఖులతో కేసీఆర్ భేటీ..?

అలా చేద్దామని ప్రతిజ్ఞ చేద్దాం: మహేష్ బాబు



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Maddipati Lakshmi Sailaja]]>