PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/tdpc35f02fb-8c0b-43ba-921f-e1e25b6291df-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/tdpc35f02fb-8c0b-43ba-921f-e1e25b6291df-415x250-IndiaHerald.jpgగత ఎన్నికల్లో జగన్ గాలిని తట్టుకుని టీడీపీ తరుపున 23 మంది ఎమ్మెల్యేలు గెలిచిన విషయం తెలిసిందే. అయితే జగన్ అధికారంలోకి వచ్చాక, ఆ ఎమ్మెల్యేలకు చెక్ పెట్టడమే లక్ష్యంగా రాజకీయం చేస్తూ వచ్చారు. ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేలని వైసీపీ వైపు లాగేసుకున్నారు. అలాగే మరి కొందరు టీడీపీ ఎమ్మెల్యేలకు అపోజిట్‌గా బలమైన వైసీపీ ఇన్‌చార్జ్‌లని పెట్టి దెబ్బకొట్టారు.TDP{#}TDP;Cheque;Jagan;YCP;Vishakapatnam;Velagapudi;Hanu Raghavapudi;Murder.;Vijayawada;Capital;Eastహ్యాట్రిక్ టీడీపీ ఎమ్మెల్యేకు చెక్ పెట్టేసినట్లేనా?హ్యాట్రిక్ టీడీపీ ఎమ్మెల్యేకు చెక్ పెట్టేసినట్లేనా?TDP{#}TDP;Cheque;Jagan;YCP;Vishakapatnam;Velagapudi;Hanu Raghavapudi;Murder.;Vijayawada;Capital;EastSun, 06 Jun 2021 01:00:00 GMTగత ఎన్నికల్లో జగన్ గాలిని  తట్టుకుని టీడీపీ తరుపున 23 మంది ఎమ్మెల్యేలు గెలిచిన విషయం తెలిసిందే. అయితే జగన్ అధికారంలోకి వచ్చాక, ఆ ఎమ్మెల్యేలకు చెక్ పెట్టడమే లక్ష్యంగా రాజకీయం చేస్తూ వచ్చారు. ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేలని వైసీపీ వైపు లాగేసుకున్నారు. అలాగే మరి కొందరు టీడీపీ ఎమ్మెల్యేలకు అపోజిట్‌గా బలమైన వైసీపీ ఇన్‌చార్జ్‌లని పెట్టి దెబ్బకొట్టారు.


ఇంకా అధికార బలంతో చాలాచోట్ల టీడీపీ ఎమ్మెల్యేలకు చెక్ పెట్టేశారు. ఈ క్రమంలోనే విశాఖ తూర్పులో గెలిచిన వెలగపూడి రామకృష్ణకు సైతం జగన్ చెక్ పెట్టేశారని చెప్పొచ్చు. మామూలుగా తూర్పులో వెలగపూడి చాలా స్ట్రాంగ్‌గా ఉన్నారు. 2009, 2014, 2019 ఎన్నికల్లో వరుసగా టీడీపీ తరుపున గెలిచి హ్యాట్రిక్ కొట్టారు. అయితే ఇలా హ్యాట్రిక్ కొట్టి బలంగా ఉన్న వెలగపూడిని విజయసాయిరెడ్డి గట్టిగా టార్గెట్ చేశారు. ఆయనపై అనేక అవినీతి ఆరోపణలు చేస్తూ వచ్చారు.


వంగవీటి రంగా హత్య కేసులో వెలగపూడి కూడా ఒక ముద్దాయి అని పలుమార్లు విమర్శలు చేశారు. రంగాని చంపి విజయవాడ నుంచి పారిపోయి, వైజాగ్‌కు వచ్చారని ఆరోపించారు. అలాగే గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వెలగపూడి అనేక భూ కబ్జాలకు పాల్పడ్డారని ఆరోపణలు గుప్పించారు. ఇక మూడు రాజధానుల్లో భాగంగా విశాఖ పరిపాలన రాజధాని కానున్న సంగతి తెలిసిందే. కానీ మూడు రాజధానులకు టీడీపీ వ్యతిరేకంగా ఉంది. అమరావతికి మద్ధతు ఇస్తుంది.


అయితే విశాఖ ఎమ్మెల్యేగా ఉన్న వెలగపూడి సైతం అమరావతికి మద్ధతు తెలపడంతో నియోజకవర్గంలోని వైసీపీ శ్రేణులు వెలగపూడిని టార్గెట్ చేశాయి. చాలారోజులు వెలగపూడి ఇంటివద్ద వైసీపీ శ్రేణులు హడావిడి చేశాయి. రాజకీయంగా ఆయన్ని ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా పనిచేశాయి. ఇలా వైసీపీ, వెలగపూడిని ఎన్ని రకాలుగా టార్గెట్ చేయాలో అన్నీ రకాలుగా టార్గెట్ చేసింది. ఫలితంగా తూర్పులో వెలగపూడి వీక్ అయ్యారు. ఇటీవల విశాఖ కార్పొరేషన్ ఎన్నికల్లో, తూర్పు పరిధిలో ఉన్న డివిజన్లలో వైసీపీ సత్తా చాటింది. ఇక నెక్స్ట్ ఎన్నికల్లో కూడా వెలగపూడికి చెక్ పెట్టడమే లక్ష్యంగా వైసీపీ ముందుకెళుతుంది. 




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

విజయం మీదే: ఇవి పాటిస్తే విజయం వద్దన్నా మీ వెంటే వస్తుంది ...

ఒక్క ప్రోమోతో రూమర్లకు చెక్ పెట్టిన 'ఎన్టీఆర్'..!!

కమర్షియల్ యాడ్స్ తో కోట్లు సంపాదిస్తున్న తెలుగు హీరోలు

ఎన్టీఆర్, బాలయ్య ఇద్దరూ తొలిసారి ఇక్కడే కలుసుకున్నారట.. ఎక్కడో తెలుసా..?

త్వరలో సినీ ప్రముఖులతో కేసీఆర్ భేటీ..?

అలా చేద్దామని ప్రతిజ్ఞ చేద్దాం: మహేష్ బాబు

ఈ వెరై "టీ " ట్రై చేశారా...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>