PoliticsChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/pm-modi546857bb-fd7e-4919-9dc1-d7097220940c-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/pm-modi546857bb-fd7e-4919-9dc1-d7097220940c-415x250-IndiaHerald.jpgతల్లిదండ్రుల వారసత్వంతో రాజకీయాల్లోకి వచ్చిన రాహుల్ గాంధీ ఇప్పుడు రాజకీయాల్లో నిలదొక్కుకోవడానికి చేయని ప్రయత్నం అంటూ లేదు. నిజానికి ఆయన ప్రధాని అభ్యర్థి అనే క్లారిటీ రాకుండానే కాంగ్రెస్ గత ఎన్నికలకు వెళ్లింది.. మరోపక్క బిజెపి మోడీ మంత్రం ముందు రాహుల్ గాంధీ దూకుడు ఏమీ పని చేయలేదు. ఆ తర్వాత కూడా రాహుల్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు తీసుకోవడానికి ససేమిరా ఒప్పుకోలేదు. నిజానికి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక దేశంలో పలు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో బిజెపి పట్టు నిలుపుకునే ప్రయత్నం చేసింది. అందులోrahul gandhi{#}rahul;Rahul Sipligunj;Prime Minister;Congress;Bharatiya Janata Party;Dookudu;Hanu Raghavapudi;Prashant Kishor;SoniaGandhi;Party;history;prasanthవాళ్లొద్దు.. ప్రశాంతే ముద్దంటున్న రాహుల్!వాళ్లొద్దు.. ప్రశాంతే ముద్దంటున్న రాహుల్!rahul gandhi{#}rahul;Rahul Sipligunj;Prime Minister;Congress;Bharatiya Janata Party;Dookudu;Hanu Raghavapudi;Prashant Kishor;SoniaGandhi;Party;history;prasanthSun, 06 Jun 2021 12:11:00 GMTతల్లిదండ్రుల వారసత్వంతో రాజకీయాల్లోకి వచ్చిన రాహుల్ గాంధీ ఇప్పుడు రాజకీయాల్లో నిలదొక్కుకోవడానికి చేయని ప్రయత్నం అంటూ లేదు. నిజానికి ఆయన ప్రధాని అభ్యర్థి అనే క్లారిటీ రాకుండానే కాంగ్రెస్ గత ఎన్నికలకు వెళ్లింది.. మరోపక్క బిజెపి మోడీ మంత్రం ముందు రాహుల్ గాంధీ దూకుడు ఏమీ పని చేయలేదు. ఆ తర్వాత కూడా రాహుల్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు తీసుకోవడానికి ససేమిరా ఒప్పుకోలేదు. నిజానికి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక దేశంలో పలు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో బిజెపి పట్టు నిలుపుకునే ప్రయత్నం చేసింది. 


అందులో సఫలీకృతం అయింది కూడా. ఇదంతా 2019 ముందుమాట కానీ 2019 ఎన్నికల తర్వాత బీజేపీ గ్రాఫ్ క్రమంగా తగ్గుతూ వస్తోంది.. అయినా సరే కాంగ్రెస్ గ్రాఫ్ మాత్రం పెరగకపోవడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలోనే రాజకీయ వ్యూహకర్తగా పేరొందిన ప్రశాంత్ కిషోర్ ను రాహుల్ టీం సంప్రదించినట్లు సమాచారం.. ఆయన కూడా 2024లో కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీని ప్రకటిస్తే ఆయన కోసం పని చేయడానికి సిద్ధం అంటూ ప్రకటన చేసినట్లు నిన్నటి నుంచి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు కూడా లేడు. 


తాత్కాలిక అధ్యక్షురాలుగా సోనియా గాంధీ నేతృత్వంలో పార్టీ ఇప్పుడు కొనసాగుతోంది. వందేళ్ల చరిత్ర ఉన్న పార్టీ పరిస్థితి ఎలా మారడంతోనే రాహుల్ టీం ప్రశాంత్ ను సంప్రదించినట్లు సమాచారం. రాహుల్ కూడా సీనియర్లను పక్కన పెట్టి మరీ ప్రశాంత్ కిషోర్ కు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. 2014 ఎన్నికల సమయంలో బీజేపీ కోసం పనిచేసిన ప్రశాంత్ కిషోర్ కి కాంగ్రెస్ గతంలోనే ఆఫర్ ఇచ్చింది. అయినా ఆయన తిరస్కరించారు, కానీ బీజేపీతో విభేదాలు రావడంతో దాన్ని గద్దె దించడమే లక్ష్యంగా పెట్టుకున్న ప్రశాంత్ కాంగ్రెస్ పార్టీ ప్రధాని అభ్యర్థిగా రాహుల్ ఉంటే చాలని తాను గెలిపిస్తానని మాట ఇచ్చాడట. అందుకే చాలా మంది సీనియర్లను పక్కన పెట్టి మరి రాహుల్ ఈసారి ప్రశాంత్ కిశోర్ ఆధ్వర్యంలో ఎన్నికలకు వెళుతున్నారు.  




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కుకింగ్ : మష్రూమ్ తో మ్యాజిక్..

ప్రాణాలు కాపాడిన ఫేస్బుక్.. ఎలాగో తెలుసా?

మనీ : పెట్టుబడి తక్కువ.. రాబడి ఎక్కువ.. సేంద్రియ ఎరువుల తయారీ..

విజయం మీదే: ఇవి పాటిస్తే విజయం వద్దన్నా మీ వెంటే వస్తుంది ...

ఒక్క ప్రోమోతో రూమర్లకు చెక్ పెట్టిన 'ఎన్టీఆర్'..!!

కమర్షియల్ యాడ్స్ తో కోట్లు సంపాదిస్తున్న తెలుగు హీరోలు

ఎన్టీఆర్, బాలయ్య ఇద్దరూ తొలిసారి ఇక్కడే కలుసుకున్నారట.. ఎక్కడో తెలుసా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>