MoviesChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/happy-sunday0233b50b-2c91-4a91-a812-8dbdc1c15d01-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/happy-sunday0233b50b-2c91-4a91-a812-8dbdc1c15d01-415x250-IndiaHerald.jpgతమిళంలో మాస్కోవిన్ కావేరి సినిమాతో తెరంగేట్రం చేసిన రాహుల్ రవీంద్రన్ ఆ తరువాత కూడా అక్కడ కొన్ని సినిమాలు చేశారు. కానీ అవేవీ పెద్దగా పేరు తీసుకొచ్చిన దాఖలాలు లేవు. కానీ ఆయన తెలుగులో అందాల రాక్షసి సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జనానికి బాగా కనెక్ట్ అయ్యింది. దీంతో రాహుల్ కి కూడా మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత తెలుగులో అడపాదడపా సినిమాలు చేశాడు కానీ ఆయనకు మళ్లీ అంతగా పేరు వచ్చిన సినిమా ఇదే లేదు.. ఆ తరువాత వివాదాస్పద సింగర్ చిన్మయిని వివాహం చేసుకున్న ఆయన సినిమాల్లHappy-sunday{#}kaveri;rahul;Rahul Sipligunj;Hanu Raghavapudi;Cinema;sushanth;Heroine;Akkineni Nagarjuna;Success;Nani;shyam;Remakeరాహుల్ రవీంద్రన్.. మళ్లీ ఎప్పుడు ?రాహుల్ రవీంద్రన్.. మళ్లీ ఎప్పుడు ?Happy-sunday{#}kaveri;rahul;Rahul Sipligunj;Hanu Raghavapudi;Cinema;sushanth;Heroine;Akkineni Nagarjuna;Success;Nani;shyam;RemakeSun, 06 Jun 2021 07:15:41 GMTకావేరి సినిమాతో తెరంగేట్రం చేసిన రాహుల్ రవీంద్రన్ ఆ తరువాత కూడా అక్కడ కొన్ని సినిమాలు చేశారు. కానీ అవేవీ పెద్దగా పేరు తీసుకొచ్చిన దాఖలాలు లేవు. కానీ ఆయన తెలుగులో అందాల రాక్షసి సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జనానికి బాగా కనెక్ట్ అయ్యింది. దీంతో రాహుల్ కి కూడా మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత తెలుగులో అడపాదడపా సినిమాలు చేశాడు కానీ ఆయనకు మళ్లీ అంతగా పేరు వచ్చిన సినిమా ఇదే లేదు.. ఆ తరువాత వివాదాస్పద సింగర్ చిన్మయిని వివాహం చేసుకున్న ఆయన సినిమాల్లో నటించడం తగ్గించాడు. సుశాంత్ హీరోగా చిలసౌ అనే సినిమాకు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించారు.. మొదటి సినిమా సూపర్ హిట్ అని కాదు కానీ మంచి స్పందన అయితే తెచ్చుకుంది.. రుహాని శర్మ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల అందరికీ బాగా నచ్చేసింది..


సినిమా నచ్చడంతో నాగార్జున కూడా ఒక సినిమా చేసేందుకు అవకాశం ఇచ్చారు. అలా నాగార్జున హీరోగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో మన్మధుడు 2 సినిమా ప్రారంభమైంది. అయితే మన్మధుడు సినిమాకి ఉన్న క్రేజ్  ఈ సినిమాకి మైనస్ గా మారింది. ఈ సినిమా విషయంలో అనేక అంచనాలు పెట్టుకొని వెళ్ళిన ప్రేక్షకులకు నిరాశే ఎదురైంది..


మొదటి సినిమాతో సక్సెస్ అందుకున్న రాహుల్ రవీంద్రన్ రెండో సినిమాకి చతికిలబడిన పరిస్థితి కనపడింది. దీంతో ఇప్పటిలో మళ్ళీ దర్శకత్వం వైపు వెళ్లే ఆలోచన లేదు అంటున్న ఆయన ఇప్పుడు మళ్ళీ నటన వైపు అడుగులు వేస్తున్నాడు. నాని హీరోగా నటిస్తున్న శ్యామ్ సింగరాయ్ సినిమాలో ప్రస్తుతం ఆయన ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. అలాగే మలయాళంలో సూపర్ హిట్ అయిన సినిమాలను తమిళంలో రీమేక్ చేస్తున్నాడు.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

చెరుకు రసంతో పొట్ట తగ్గుతుందా.. ఇది తెలుసుకోండి?

విజయం మీదే: ఇవి పాటిస్తే విజయం వద్దన్నా మీ వెంటే వస్తుంది ...

ఒక్క ప్రోమోతో రూమర్లకు చెక్ పెట్టిన 'ఎన్టీఆర్'..!!

కమర్షియల్ యాడ్స్ తో కోట్లు సంపాదిస్తున్న తెలుగు హీరోలు

ఎన్టీఆర్, బాలయ్య ఇద్దరూ తొలిసారి ఇక్కడే కలుసుకున్నారట.. ఎక్కడో తెలుసా..?

త్వరలో సినీ ప్రముఖులతో కేసీఆర్ భేటీ..?

అలా చేద్దామని ప్రతిజ్ఞ చేద్దాం: మహేష్ బాబు



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>