PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/jagane2054f16-598a-4fda-a6cf-8594ca5e2b00-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/jagane2054f16-598a-4fda-a6cf-8594ca5e2b00-415x250-IndiaHerald.jpgసాధారణంగా పెద్దల సభగా ఉన్న శాసనమండలి ఎప్పుడు హైలైట్ అవ్వదు. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చాక మండలి బాగా హైలైట్ అయింది. ఎందుకంటే అసెంబ్లీలో వైసీపీ ప్రభుత్వం ఎలాంటి బిల్లు అయిన ఆమోదం పొందితే, మండలిలో మాత్రం బ్రేక్ పడేది. అసెంబ్లీలో వైసీపీకి భారీగా మెజారిటీ ఉంది కాబట్టి అక్కడ ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ మండలిలో టీడీపీకి బలం ఎక్కువగా ఉండేది. అందుకే అక్కడ వైసీపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బలు తగిలేవి. ముఖ్యంగా మూడు రాజధానుల బిల్లు విషయంలో. అందుకే జగన్ సైతం మండలి రద్దుకు మొగ్గు చూపి, అసెంబ్లీలో తీర్మానం చేసి jagan{#}Sasanamandali;YCP;Jagan;Elections;local language;TDPమండలి రద్దు వెనక్కేనా? వైసీపీకి లీడ్ వచ్చేసినట్లేనా?మండలి రద్దు వెనక్కేనా? వైసీపీకి లీడ్ వచ్చేసినట్లేనా?jagan{#}Sasanamandali;YCP;Jagan;Elections;local language;TDPSun, 06 Jun 2021 03:00:00 GMTసాధారణంగా పెద్దల సభగా ఉన్న శాసనమండలి ఎప్పుడు హైలైట్ అవ్వదు. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చాక మండలి బాగా హైలైట్ అయింది. ఎందుకంటే అసెంబ్లీలో వైసీపీ ప్రభుత్వం ఎలాంటి బిల్లు అయిన ఆమోదం పొందితే, మండలిలో మాత్రం బ్రేక్ పడేది. అసెంబ్లీలో వైసీపీకి భారీగా మెజారిటీ ఉంది కాబట్టి అక్కడ ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ మండలిలో టీడీపీకి బలం ఎక్కువగా ఉండేది. అందుకే అక్కడ వైసీపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బలు తగిలేవి. ముఖ్యంగా మూడు రాజధానుల బిల్లు విషయంలో. అందుకే జగన్ సైతం మండలి రద్దుకు మొగ్గు చూపి, అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపారు. కానీ ఆ ప్రక్రియ ఇప్పుడు ఎక్కడ ఉందో ఎవరికి తెలియదు.


అయితే ఈలోపు మండలిలో వైసీపీ బలం పెరుగుతూ వస్తుంది. ఇప్పటికే మండలి ఛైర్మన్ షరీఫ్ పదవీకాలం పూర్తి అయింది. షరీఫ్‌తో పాటుగా బీజేపీకి చెందిన సోము వీర్రాజు, వైసీపీకి చెందిన గోవిందరెడ్డి పదవీ విరమణ చేసారు. ఈ స్థానాలకు కరోనా తగ్గిన తరువాత మాత్రమే ఎన్నికలు ఉంటాయని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.


ఇక ఈ మూడుతో పాటుగా ఈ నెలలోనే స్థానిక సంస్థల కోటాలో ఎనిమిది స్థానాలు ఖాళీ కానున్నాయి. అందులో ఏడు టీడీపీకి కాగా..వైసీపీ నుండి ఉమ్మారెడ్డి పదవీ విరమణ చేయనున్నారు. అదే విధంగా నామినేటెడ్ కోటాలో టీడీపీ నుండి ముగ్గురు..వైసీపీ నుండి ఒకరు పదవీ విరమణ చేయాల్సి ఉంది. దీంతో టీడీపీ సంఖ్యా బలం 58 స్థానాలకు గాను..15 మందికే పరిమితం కానుంది. అలాగే వైసీపీ బలం పెరుగుతుంది. ఛైర్మన్ కూడా వైసీపీ నుంచే ఉంటారు. మరి ఇలాంటి పరిస్తితుల్లో మండలి రద్దు ఉంటుందా? ఉండదా? అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. ఒకవేళ జగన్ మండలిని కొనసాగించే ఉద్దేశంతో ఉంటే, ఛైర్మన్‌గా ఎవరికి అవకాశం ఇస్తారు? అలాగే ఎమ్మెల్సీలు అయిన వారిని మంత్రివర్గంలో తీసుకుంటారా? అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

విజయం మీదే: ఇవి పాటిస్తే విజయం వద్దన్నా మీ వెంటే వస్తుంది ...

ఒక్క ప్రోమోతో రూమర్లకు చెక్ పెట్టిన 'ఎన్టీఆర్'..!!

కమర్షియల్ యాడ్స్ తో కోట్లు సంపాదిస్తున్న తెలుగు హీరోలు

ఎన్టీఆర్, బాలయ్య ఇద్దరూ తొలిసారి ఇక్కడే కలుసుకున్నారట.. ఎక్కడో తెలుసా..?

త్వరలో సినీ ప్రముఖులతో కేసీఆర్ భేటీ..?

అలా చేద్దామని ప్రతిజ్ఞ చేద్దాం: మహేష్ బాబు

ఈ వెరై "టీ " ట్రై చేశారా...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>