PoliticsChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/kcr-7e2d0337-c180-4f3f-ba4d-b6ea12fc2cb2-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/kcr-7e2d0337-c180-4f3f-ba4d-b6ea12fc2cb2-415x250-IndiaHerald.jpgతెలంగాణ కేబినెట్ సమావేశం జూన్ 8, మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు, ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరుగుతున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో వైద్యం, కరోనా స్థితిగతులు, ఇరిగేషన్, రైతుబంధు, వ్యవసాయ పనులు, లాక్ డౌన్ నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వంటి అనేక అంశాల మీద కేబినెట్ చర్చించే అవకాశమున్నట్టు సీఎంఓ వర్గాలు ఒక ప్రకటన విడుదల చేశాయి. అదే కాక రాష్ట్ర ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి కూడా చర్చ జరిగే అవకాశముంది. ఇక ఈ అంశాలతో పాటు వ్యవసాయం మీద ఆయన ఎక్కువ ఫోకస్ పెట్టే అవకాశం కనిపిస్తోంది. వానాకాలం మొదలయlockdown{#}Telangana;June;tuesday;Chief Minister;Cabinet;Mandula;Governmentతెలంగాణ లాక్ డౌన్ మళ్ళీ పొడిగిస్తారా ?తెలంగాణ లాక్ డౌన్ మళ్ళీ పొడిగిస్తారా ?lockdown{#}Telangana;June;tuesday;Chief Minister;Cabinet;Mandula;GovernmentSun, 06 Jun 2021 15:01:00 GMTతెలంగాణ కేబినెట్ సమావేశం జూన్ 8, మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు, ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరుగుతున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో వైద్యం, కరోనా స్థితిగతులు, ఇరిగేషన్, రైతుబంధు, వ్యవసాయ పనులు, లాక్ డౌన్ నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వంటి అనేక అంశాల మీద కేబినెట్ చర్చించే అవకాశమున్నట్టు సీఎంఓ వర్గాలు ఒక ప్రకటన విడుదల చేశాయి. అదే కాక రాష్ట్ర  ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి కూడా చర్చ జరిగే అవకాశముంది. ఇక ఈ అంశాలతో పాటు వ్యవసాయం మీద ఆయన ఎక్కువ ఫోకస్ పెట్టే అవకాశం కనిపిస్తోంది.  


వానాకాలం మొదలయి, పంటల సాగు పనులు కూడా ప్రారంభమైన నేపథ్యంలో, పంట పెట్టుబడి సాయం రైతుబంధు అందుతున్న విషయం మొదలు,  కల్తీ విత్తనాలు అరికట్టేందుకు చర్యలు, ఎరువులు, క్రిమిసంహారక మందుల లభ్యత, తదితర వ్యవసాయ సంబంధిత అంశాలపై సమావేశంలో చర్చించే అవకాశమున్నది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న పటిష్ట చర్యల కారణంగా రెండవ వేవ్ కరోనా తగ్గుముఖం పడుతున్న పరిస్థితుల్లో, ఇంకా కూడా శాఖల వారీగా తీసుకోవాల్సిన చర్యలను సమావేశంలో చర్చించే అవకాశాలున్నాయి .  


థర్డ్ వేవ్ రానున్నదనే వార్తల నేపథ్యంలో., థర్డ్ వేవ్ ను కూడా సమర్థవంతంగా ఎదుర్కునేందుకు రాష్ట్ర వైద్యశాఖ తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సన్నద్ధత  తగు ఏర్పాట్ల మీద కేబినెట్ చర్చించే అవకాశమున్నది. అంతే కాకా కరోనా కట్టడికోసం లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో, దీని పర్యవసానంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ మేరకు ప్రభావితమైందో పరిశీలించి దాని మేరకు కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. అంతే కాక లాక్ డౌన్ మళ్ళీ పొడిగిస్తారా ? లేక లాక్ డౌన్ ఎత్తేసి నైట్ కర్ఫ్యూ లాంటిది విధిస్తారా అనేది కూడా ఈ సమావేశంలో తేల్చనున్నారు. 




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కుకింగ్ : మష్రూమ్ తో మ్యాజిక్..

ప్రాణాలు కాపాడిన ఫేస్బుక్.. ఎలాగో తెలుసా?

మనీ : పెట్టుబడి తక్కువ.. రాబడి ఎక్కువ.. సేంద్రియ ఎరువుల తయారీ..

విజయం మీదే: ఇవి పాటిస్తే విజయం వద్దన్నా మీ వెంటే వస్తుంది ...

ఒక్క ప్రోమోతో రూమర్లకు చెక్ పెట్టిన 'ఎన్టీఆర్'..!!

కమర్షియల్ యాడ్స్ తో కోట్లు సంపాదిస్తున్న తెలుగు హీరోలు

ఎన్టీఆర్, బాలయ్య ఇద్దరూ తొలిసారి ఇక్కడే కలుసుకున్నారట.. ఎక్కడో తెలుసా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>