MoviesN.ANJIeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vennela-kishoreb4bf637c-fd0d-4a64-af77-c57e5f46ebbe-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vennela-kishoreb4bf637c-fd0d-4a64-af77-c57e5f46ebbe-415x250-IndiaHerald.jpg1980 సెప్టెంబర్ 19న తెలంగాణలోని కామారెడ్డిలో జన్మించారు. ప్రస్తుతం ఆయన వయస్సు 41ఏళ్ళు. కామారెడ్డి లోనే జీవదన్ కాన్వెంట్ హైస్కూల్ లో చదివాడు. యుఎస్ లో మిచిగాన్ యూనివర్సిటీలో బికాం, అండ్ మాస్టర్ ఇన్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ చేసాడు.vennela Kishore{#}vennela kishore;september;Kamareddy;Master;job;Telugu;Brahmanandam;Carకమెడియన్ వెన్నెల కిషోర్ గురించి మీకు తెలియని నిజాలివే..?కమెడియన్ వెన్నెల కిషోర్ గురించి మీకు తెలియని నిజాలివే..?vennela Kishore{#}vennela kishore;september;Kamareddy;Master;job;Telugu;Brahmanandam;CarSun, 06 Jun 2021 06:00:00 GMTకమెడియన్ వెన్నెల కిషోర్ గురించి తెలియని వారంటూ ఉండరు. తనదైన శైలిలో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంటాడు. అయితే ఆయన అసలు పేరు బోకాల కిషోర్ కుమార్. ముద్దుగా అందరు వెన్నెల,కృష్ణ అని పిలుస్తుంటారు. కిషోర్ 1980 సెప్టెంబర్ 19న తెలంగాణలోని కామారెడ్డిలో జన్మించారు. ప్రస్తుతం ఆయన వయస్సు 41ఏళ్ళు. కామారెడ్డి లోనే జీవదన్ కాన్వెంట్ హైస్కూల్ లో చదివాడు. యుఎస్ లో మిచిగాన్ యూనివర్సిటీలో బికాం, అండ్ మాస్టర్ ఇన్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ చేసాడు.

ఇక వెన్నల కిషోర్ ఫ్యామిలీ విషయానికి వస్తే.. ఆయనకు నలుగురు అక్కలు ఉన్నారు. ఇక అతను ఇంటర్ పూర్తయ్యేసరికి నలుగురు అక్కలకు పెళ్లి అయింది. ఇక అమెరికాలో స్టడీస్ పూర్తయ్యాక ఉద్యోగం చేస్తుండగా, ఓ తెలుగు అమ్మాయితో పరిచయం ప్రేమగా మారడంతో 2012లో సురేఖతో పెద్దల ఆశీర్వాదంతో పెళ్లి అయింది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇక హైదరాబాద్ లో ఉండగా వారానికొక సినిమా చూసేవాడు. ఒకసారి వెన్నెల సినిమాకు ఆర్టిస్టులు కావాలని పేపర్ ప్రకటన రావడంతో ఆడిషన్స్ వెళ్లి సెలెక్ట్ అయ్యాడు.

కిషోర్ దేవా దర్శకత్వంలో వెన్నెల సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైయ్యారు. ఈ సినిమాతో ఆయనకు మంచి గుర్తింపు రావడంతో వరుస అవకాశాలను అందుకున్నారు. ఇక తన మొదటి సినిమాకు 68 వేలు రెమ్యునరేషన్ తీసుకున్నాడు. తాజాగా నితిన్ రంగ్ దే మూవీకి 3లక్షల 70వేలు అందుకున్నాడు. తాను రాసుకున్న కథతో బ్రహ్మానందం హీరోగా జఫ్ఫా మూవీ డైరెక్ట్ చేసి, డైరెక్టర్ గా మంచి పేరు తెచ్చుకున్నాడు.

వెన్నల కిషోర్కి చిరంజీవి, బ్రహ్మానందం ఫేవరేట్ నటులు. విజయశాంతి ఇష్టమైన హీరోయిన్. సిడ్నీ అంటే ఇష్టమైన ప్రదేశం. ఇతడి నెట్ వర్త్ 20కోట్ల వరకూ ఉంటుంది. హైదరా బాద్ హైటెక్ సిటీలోని వైష్ణవి నిర్వాణ అపార్ట్ మెంట్ లో ఉంటున్నాడు. దీని ఖరీదు 80లక్షలు ఉంటుంది. ఒక టయోటా కారు ఉంది.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

చెరుకు రసంతో పొట్ట తగ్గుతుందా.. ఇది తెలుసుకోండి?

విజయం మీదే: ఇవి పాటిస్తే విజయం వద్దన్నా మీ వెంటే వస్తుంది ...

ఒక్క ప్రోమోతో రూమర్లకు చెక్ పెట్టిన 'ఎన్టీఆర్'..!!

కమర్షియల్ యాడ్స్ తో కోట్లు సంపాదిస్తున్న తెలుగు హీరోలు

ఎన్టీఆర్, బాలయ్య ఇద్దరూ తొలిసారి ఇక్కడే కలుసుకున్నారట.. ఎక్కడో తెలుసా..?

త్వరలో సినీ ప్రముఖులతో కేసీఆర్ భేటీ..?

అలా చేద్దామని ప్రతిజ్ఞ చేద్దాం: మహేష్ బాబు



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>