PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/gone-prakash82bf75ea-ced3-41be-9c33-d87b3d5dff1a-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/gone-prakash82bf75ea-ced3-41be-9c33-d87b3d5dff1a-415x250-IndiaHerald.jpgప్రజల సమస్యలపై గళమెత్తాల్సిన మీడియా సంస్థలు..రాజకీయ పార్టీలకు భజన బృందాలుగా మారిపోయిన విషయం తెలిసిందే. అన్నీ సంస్థలు కాకపోయినా, కొన్ని మాత్రం రాజకీయ పార్టీలని భుజాన మోస్తున్నాయి. ముఖ్యంగా ఏపీలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీలకు అనుకూలంగా అనేక మీడియా సంస్థలు ఉన్నాయి. ఇక వీటి పని ఏంటో అందరికీ తెలిసిందే.gone prakash{#}Cinema;media;TDP;YCP;Sabbam Hari;MP;king;Jagan;Yevaru;Andhra Pradeshసబ్బం ప్లేస్‌లో గోనె...మళ్ళీ కొత్త సినిమా ఉంటుందా?సబ్బం ప్లేస్‌లో గోనె...మళ్ళీ కొత్త సినిమా ఉంటుందా?gone prakash{#}Cinema;media;TDP;YCP;Sabbam Hari;MP;king;Jagan;Yevaru;Andhra PradeshSun, 06 Jun 2021 00:00:00 GMTప్రజల సమస్యలపై గళమెత్తాల్సిన మీడియా సంస్థలు..రాజకీయ పార్టీలకు భజన బృందాలుగా మారిపోయిన విషయం తెలిసిందే. అన్నీ సంస్థలు కాకపోయినా, కొన్ని మాత్రం రాజకీయ పార్టీలని భుజాన మోస్తున్నాయి. ముఖ్యంగా ఏపీలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీలకు అనుకూలంగా అనేక మీడియా సంస్థలు ఉన్నాయి. ఇక వీటి పని ఏంటో అందరికీ తెలిసిందే.


తమకు అనుకూలమైన పార్టీని పైకి లేపడం, అపోజిట్ పార్టీపై బురదచల్లడం. ఇదే విధంగా ఏపీలో మీడియా సంస్థలు నడుస్తున్నాయి. వైసీపీకి అనుకూల మీడియా జగన్‌కు భజన చేయడం, చంద్రబాబుని నెగిటివ్ చేయడమే పనిగా పెట్టుకుని ముందుకెళుతుంది. అటు టీడీపీ అనుకూల మీడియా బాబుకు భజన చేస్తూనే, జగన్‌ని ఎలా నెగిటివ్ చేయాలనే లక్ష్యంతో పనిచేస్తుంది. ఇక కాసేపు వైసీపీ అనుకూల మీడియా గురించి పక్కనబెడితే, ఈ మధ్య టీడీపీకి అనుకూలంగా ఉండే ఓ మీడియా సంస్థ, గతంలో జగన్‌తో సన్నిహితంగా ఉండి, తర్వాత దూరమైన నాయకులని తీసుకొచ్చి, జగన్‌పై నెగిటివ్ ప్రచారం చేసే కార్యక్రమంలో ఉంటుంది.


మొన్నటివరకు ఆ మీడియా, సీనియర్ నాయకుడు సబ్బం హరితో ఇంటర్వ్యూలు చేసి, జగన్‌పై నెగిటివ్ ప్రచారం చేయించారు. ఇక సబ్బంతో పాటు వైసీపీకి యాంటీగా ఉన్న ఎంపీ రఘురామకృష్ణంరాజుతో కూడా ఇంటర్వ్యూలు పెట్టి, జగన్‌ని ఎలా తిట్టించారో చెప్పాల్సిన పని లేదు.


అయితే కరోనాతో ఈ మధ్యనే సబ్బం మరణించారు. అటు రాజు గారు రాజద్రోహం కేసులో జైలుకు వెళ్ళి, ఇటీవలే బెయిల్ మీద బయటకొచ్చి మీడియాకు దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే సీనియర్ నాయకుడు గోనె ప్రకాశ్ రావుని తీసుకొచ్చి, ఆ టీడీపీ అనుకూల మీడియా ఇంటర్వ్యూ పెట్టింది. గతంలో గోనె, వైఎస్సార్‌తో ఎంత సన్నిహితంగా ఉండేవారో తెలిసిందే. అలాగే తెలంగాణలో వైసీపీ ఉన్నప్పుడు గోనె, జగన్‌కు సపోర్ట్‌గా ఉన్నారు.


కానీ తర్వాత, తర్వాత తెలంగాణలో వైసీపీ కనుమరుగైపోయింది. గోనె కూడా రాజకీయాలకు దూరమైపోయారు. కానీ అప్పుడప్పుడు మీడియా, సోషల్ మీడియాల్లో రాజకీయ విశ్లేషణలు చేస్తూ వస్తున్నారు. ఇక తాజాగా టీడీపీ అనుకూల మీడియా, గోనెని బయటకు తీసుకొచ్చి, జగన్‌పై లేనిపోని విమర్శలు చేయించారు. ఇక జగన్ కూడా మంచివాడు కాదు అనే స్థాయిలో గోనె, బోలెడు ఉదాహరణలు చెప్పుకొచ్చారు. అయితే ఎవరు ఎంత ప్రచారం చేసిన ఏపీ ప్రజలు మాత్రం జగన్ వెంటే ఉన్నారు. మరి గోనె విశ్లేషణలు ఎంతకాలం సాగుతాయో చూడాలి.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

విజయం మీదే: ఇవి పాటిస్తే విజయం వద్దన్నా మీ వెంటే వస్తుంది ...

ఒక్క ప్రోమోతో రూమర్లకు చెక్ పెట్టిన 'ఎన్టీఆర్'..!!

కమర్షియల్ యాడ్స్ తో కోట్లు సంపాదిస్తున్న తెలుగు హీరోలు

ఎన్టీఆర్, బాలయ్య ఇద్దరూ తొలిసారి ఇక్కడే కలుసుకున్నారట.. ఎక్కడో తెలుసా..?

త్వరలో సినీ ప్రముఖులతో కేసీఆర్ భేటీ..?

అలా చేద్దామని ప్రతిజ్ఞ చేద్దాం: మహేష్ బాబు

ఈ వెరై "టీ " ట్రై చేశారా...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>