MoviesDivyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/happy-sunday08f506c3-2db2-4ce6-86b1-d761d9ee6d28-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/happy-sunday08f506c3-2db2-4ce6-86b1-d761d9ee6d28-415x250-IndiaHerald.jpgనందమూరి తారక రామారావు.. మన తెలుగు ప్రజలు అన్నగారు అని ముద్దుగా పిలుచుకునే ఏకైక వ్యక్తి. సినీ ఇండస్ట్రీ పరంగా తెలుగు కీర్తిని దేశం అంతటా వ్యాపించిన ఏకైక వ్యక్తిగా కూడా పరిగణిస్తారు. ఈయన సినీ ఇండస్ట్రీలోకి నటుడిగా ప్రవేశించి ముఖ్యమంత్రి గా ఎదిగారు. నందమూరి తారక రామారావు 1923 మే 28వ తేదీన కృష్ణా జిల్లాలోని పాలమూరు మండలంలో నిమ్మకూరు గ్రామం లోని లక్ష్మయ్య , వెంకట రామమ్మ అనే దంపతులకు జన్మించారు. ఈయన విద్యాభ్యాసం విజయవాడ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో ముగిసింది. ఇక ఆ తరువాత ఈయన విజయవాడలోనే ఎస్.ఆర్.ఆర్ కాలేజHAPPY-SUNDAY{#}Telugu;Film Industry;Chief Minister;Krishna River;palamuru;village;Vijayawada;viswanatha satyanarayana;college;Chennai;job;producer;prasad;marriage;NTRఎన్టీఆర్ నట జీవితంలో జరిగిన సంఘటనలు ఎన్నో..ఎన్టీఆర్ నట జీవితంలో జరిగిన సంఘటనలు ఎన్నో..HAPPY-SUNDAY{#}Telugu;Film Industry;Chief Minister;Krishna River;palamuru;village;Vijayawada;viswanatha satyanarayana;college;Chennai;job;producer;prasad;marriage;NTRSun, 06 Jun 2021 22:00:00 GMT
నందమూరి తారక రామారావు.. మన తెలుగు ప్రజలు అన్నగారు అని ముద్దుగా పిలుచుకునే ఏకైక వ్యక్తి. సినీ ఇండస్ట్రీ పరంగా తెలుగు కీర్తిని దేశం అంతటా వ్యాపించిన ఏకైక వ్యక్తిగా కూడా పరిగణిస్తారు. ఈయన సినీ ఇండస్ట్రీలోకి నటుడిగా ప్రవేశించి ముఖ్యమంత్రి గా ఎదిగారు. నందమూరి తారక రామారావు 1923 మే 28వ తేదీన కృష్ణా జిల్లాలోని పాలమూరు మండలంలో నిమ్మకూరు గ్రామం లోని లక్ష్మయ్య , వెంకట రామమ్మ అనే దంపతులకు జన్మించారు.

ఈయన విద్యాభ్యాసం విజయవాడ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో ముగిసింది. ఇక ఆ తరువాత ఈయన విజయవాడలోనే ఎస్.ఆర్.ఆర్ కాలేజీలో చేరారు. ఇక ఈ కళాశాలలో విశ్వనాథ సత్యనారాయణ గారు తెలుగు పండితులు. ఒకరోజు కళాశాలలో జరుగుతున్న ఒక నాటకంలో రామారావును ఆడ వేషం వేయమన్నారు. అయితే రామారావు తన మీసాలు తీయటానికి ససేమిరా అనడంతో, మీసాలతోటే నటించడం వలన అతనికి మీసాల నాగమ్మ అనే పేరు కూడా తగిలించారు ఆ కళాశాల విద్యార్థులు.


ఆ తర్వాత నాటక రంగంలో ఎన్నో నాటకాలు కూడా ఆడాడు. ఇక ఈయన కాలేజీ లో చదువుకునేటప్పుడు ఆస్తి మొత్తం ఏదో కారణం చేత , మొత్తం నాశనం అయినప్పుడు, ఇక పొట్టకూటి కోసం అనేక పనులు చేసే వాడు. అందులో కొద్ది రోజులు పాల వ్యాపారం, తరువాత కిరాణా కొట్టు ఆపై ఒక ముద్రణాలయాన్ని కూడా నడిపాడు. 1947లో పట్టభద్రుడయ్యాడు. మద్రాసు సర్వీసు కమీషను పరీక్ష రాసి, మంగళగిరిలోని సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో ఉద్యోగం కూడా సంపాదించుకున్నాడు. ఇక ఒకరోజు నిర్మాత బి.ఏ.సుబ్బారావు రామారావు ఫోటోను ఎల్వీ ప్రసాద్ దగ్గరే చూసి , అతనిని మద్రాసు పిలిపించి పల్లెటూరి పిల్ల సినిమాలో హీరోగా అవకాశం ఇచ్చారు. ఈ సినిమాలో నటించినందుకు గానూ రూ. నూటపదహార్లు పారితోషికం కూడా లభించింది.


ఎన్నో సినిమాల్లో ప్రధాన పాత్రల్లో నటించి, తనకంటూ మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. తర్వాత 1961లో విడుదలైన సీతారామ కళ్యాణం చిత్రం ద్వారా ఎన్టీఆర్ దర్శకుడిగా సినీ రంగ ప్రవేశం చేశారు. ఇక తర్వాత 1977లో దానవీరశూరకర్ణ సినిమాకి  స్వయంగా దర్శకత్వం చేసాడు. 1978 లో విడుదలైన శ్రీరామపట్టాభిషేకం అనే సినిమాకి కూడా దర్శకత్వం వహించారు. అలా ఎన్నో సినిమాలకు నిర్మాతగా కూడా పనిచేశారు.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కాసుల కోసం కక్కుర్తిపడి చివరికి అడ్డంగా బుక్కయిన భర్త..

కుకింగ్ : మష్రూమ్ తో మ్యాజిక్..

ప్రాణాలు కాపాడిన ఫేస్బుక్.. ఎలాగో తెలుసా?

మనీ : పెట్టుబడి తక్కువ.. రాబడి ఎక్కువ.. సేంద్రియ ఎరువుల తయారీ..

విజయం మీదే: ఇవి పాటిస్తే విజయం వద్దన్నా మీ వెంటే వస్తుంది ...

ఒక్క ప్రోమోతో రూమర్లకు చెక్ పెట్టిన 'ఎన్టీఆర్'..!!

కమర్షియల్ యాడ్స్ తో కోట్లు సంపాదిస్తున్న తెలుగు హీరోలు



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>