MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyan0594fe10-7195-4c59-b442-a53bf090ff03-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyan0594fe10-7195-4c59-b442-a53bf090ff03-415x250-IndiaHerald.jpgపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో అభిమానులను ఖుషీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే వకీల్ సాబ్ సినిమా విడుదలై మంచి విజయం సాధించగా దాని తర్వాత మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుం కోశియం అనే ఈ సినిమాని తెలుగులో రీమేక్ చేస్తున్నాడు. ఈ సినిమాలో రానా మరో హీరోగా నటిస్తుండగా, సాగర్ కే చంద్ర దర్శకత్వం, త్రివిక్రమ్ రచన అందిస్తున్నారు. ఈ సినిమా త్వరలోనే రిలీజ్ అవుతుండగా ఇదే సమయంలో క్రిష్ దర్శకత్వంలో చారిత్రాత్మక నేపథ్యంలో హరిహర వీరమల్లు అనే సినిమా చేస్తున్నాడు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గతpawan kalyan{#}Cinema;Pawan Kalyan;kalyan;kushi;Remake;rana daggubati;trivikram srinivas;shankar;Gabbar Singh;Research and Analysis Wing;Reddy;News;puri jagannadh;mahesh babuఅతనితో సినిమా వద్దు.. పవన్ ఫ్యాన్స్ వేడుకుంటున్నారు గా ..అతనితో సినిమా వద్దు.. పవన్ ఫ్యాన్స్ వేడుకుంటున్నారు గా ..pawan kalyan{#}Cinema;Pawan Kalyan;kalyan;kushi;Remake;rana daggubati;trivikram srinivas;shankar;Gabbar Singh;Research and Analysis Wing;Reddy;News;puri jagannadh;mahesh babuSun, 06 Jun 2021 17:00:00 GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో అభిమానులను ఖుషీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే వకీల్ సాబ్ సినిమా విడుదలై మంచి విజయం సాధించగా దాని తర్వాత మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుం కోశియం అనే ఈ సినిమాని తెలుగులో రీమేక్ చేస్తున్నాడు. ఈ సినిమాలో రానా మరో హీరోగా నటిస్తుండగా, సాగర్ కే చంద్ర దర్శకత్వం, త్రివిక్రమ్ రచన అందిస్తున్నారు. ఈ సినిమా త్వరలోనే రిలీజ్ అవుతుండగా ఇదే సమయంలో క్రిష్ దర్శకత్వంలో చారిత్రాత్మక నేపథ్యంలో హరిహర వీరమల్లు అనే సినిమా చేస్తున్నాడు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గతంలో ఎప్పుడు చేయని విధంగా ఈ సినిమా చేస్తూ ఉండడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్ రాగా ఆ టీజర్ సినిమాపై భారీ అంచనాలు నెలకొల్పాయి. క్రిష్ చారిత్రాత్మక చిత్రాలకు పెట్టింది పేరుగా నిలువగా ఈ సినిమా కూడా తన గత చిత్రాల లాగానే ఎంతో అద్భుతంగా తెరకెక్కిస్తున్నాడని చెబుతున్నారు. ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగానే పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ తో కూడా ఈ సినిమాని ఓకే చేశాడు. వీరి కాంబినేషన్లో గతంలో గబ్బర్ సింగ్ సినిమా రా గా ఇప్పుడు రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇవే కాకుండా పవన్ కళ్యాణ్ సురేందర్ రెడ్డి పూరి జగన్నాథ్ లతో తో కూడా సినిమా చేస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో పూరి జగన్నాథ్ తన పాత కథలలో ఒకటైన జనగణమన అనే సినిమాని పవన్ కళ్యాణ్ తో చేస్తున్నాడని తెలుస్తోంది. అయితే పవన్ అభిమానులు మాత్రం ఈ చిత్రానికి చేయవద్దు అని పవన్ ని వేడుకుంటున్నారు. మహేష్ బాబు కథల ఎంపికలో ఎంతో జాగ్రత్తగా ఉంటాడని, అలాంటి మహేష్ బాబు రిజెక్ట్ చేసిన జనగణమన సినిమాను పవన్ చేయడం అంత మంచిది కాదని పవన్ కి సలహాలు ఇస్తున్నారు అభిమానులు. గతంలో రెండు హిట్ లు ఇచ్చినా కూడా పూరిజగన్నాథ్ నీ నమ్మడానికి వీలు లేదని కూడా అంటున్నారు. మరి పవన్ అదే కథ తో సినిమా చేస్తాడా లేదా కథను మార్చమని చెబుతాడా అనేది చూడాలి.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ప‌వ‌న్‌- పూరీ కాంబోలో మూడో సినిమా రానుందా..?

కుకింగ్ : మష్రూమ్ తో మ్యాజిక్..

ప్రాణాలు కాపాడిన ఫేస్బుక్.. ఎలాగో తెలుసా?

మనీ : పెట్టుబడి తక్కువ.. రాబడి ఎక్కువ.. సేంద్రియ ఎరువుల తయారీ..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>