PoliticsShanmukhaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/covid-19f6d4f787-9859-47ff-a5f9-bee13fe223c4-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/covid-19f6d4f787-9859-47ff-a5f9-bee13fe223c4-415x250-IndiaHerald.jpgఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రజల కోసం, ప్రజా పక్షాన నిలిచే నాయకుడిగా ప్రజా మన్ననలు అందుకున్నారు. పేద ప్రజలకోసం ఎన్నో సంక్షేమ పథకాలను అందుబాటులోకి తీసుకువచ్చారు. వీటిలో భాగంగానే దేశంలో మొట్టమొదటి సారిగా వాలెంటరీ వ్యవస్థను ఏర్పాటు చేసి కొన్ని వేలమందికి భరోసా కల్పించారు. అంతేకాకుండా ప్రతి ఒక్కరి గడపకు ప్రభుత్వాన్ని తీసుకువెళ్లారు. కరోనా సమయంలో ఈ వాలెంటరీ వ్యవస్థ ఎంతటి సేవలందించిందో తెలిసిందే. వీటితో పాటు నవరత్నాలు అనే సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టి పేదవారి..covid-19{#}Andhra Pradesh;Reddy;Chief Minister;DWCRA;electricity;District;mandalam;Narsapuram;Jaganజగన్ సారూ వీటిని కూడా పట్టించుకోండి..జగన్ సారూ వీటిని కూడా పట్టించుకోండి..covid-19{#}Andhra Pradesh;Reddy;Chief Minister;DWCRA;electricity;District;mandalam;Narsapuram;JaganSun, 06 Jun 2021 18:50:34 GMTఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రజల కోసం, ప్రజా పక్షాన నిలిచే నాయకుడిగా ప్రజా మన్ననలు అందుకున్నారు. పేద ప్రజలకోసం ఎన్నో సంక్షేమ పథకాలను అందుబాటులోకి తీసుకువచ్చారు. వీటిలో భాగంగానే దేశంలో మొట్టమొదటి సారిగా వాలెంటరీ వ్యవస్థను ఏర్పాటు చేసి కొన్ని వేలమందికి భరోసా కల్పించారు. అంతేకాకుండా ప్రతి ఒక్కరి గడపకు ప్రభుత్వాన్ని తీసుకువెళ్లారు. కరోనా సమయంలో ఈ వాలెంటరీ వ్యవస్థ ఎంతటి సేవలందించిందో తెలిసిందే. వీటితో పాటు నవరత్నాలు అనే సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టి పేదవారికి ఎంతో ప్రయోజనాన్ని చేకూరుస్తున్నారు. డ్వాక్రా మహిళలకి వడ్డిలేని రుణాలు, పిల్ల చదువుకు అమ్మవడి, పేదవాడి సొంతింటి కల నేరవేరే విధంగా 30 లక్షల ఇళ్ల స్థలాలను అందించారు. తాజాగా పేదవాడి ఇంటి కలను నెరవేర్చేందుకు వారి ఇళ్ల నిర్మాణానికి కూడా శ్రీకారం చుట్టారు. ఇటువంటి మరెన్నో సంక్షేమ పథకాలతో బెస్ట్ సీఎంగా ప్రజల్లో నిలిచారు. అంతేకాకుండా అభివృద్దిలో కూడా నూతన మార్గాలను ఎంచుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ది పథం వైపు పరుగులు తీయిస్తున్నారు.


2020-2021 నీతి అయోగ్ ఇచ్చిన ర్యాంకుల ప్రకారం సుస్థిర అభివృద్ధిలో దేశంలో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో నిలిచింది. ఈ ర్యాంకులను ఐక్యరాజ్యసమితి ఇచ్చిన 16 లక్ష్యాల ఆధారంగా ఈ ర్యాంకును నిర్ణయించడం జరిగింది. దీంతో పాటుగా నాణ్యమైన విద్యుత్ విషయంలోనూ ఆంధ్రప్రదేశ్ మూడవ స్థానం దక్కించుకుంది. అయితే అభివృద్ధివైపు పయనిస్తున్న ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఇంకా కొన్నింటిపై దృష్టి సారించాల్సి ఉంది. వాటిలో మౌలిక సదుపాయాల్లో ఒకటైన రహదారుల నిర్మాణం ఒకటి. గ్రామాల మధ్య రావాణా సరైన పద్దతిలో జరగాలంటే రహదారులు ఎంతో అవసరం. కానీ ఇప్పటికీ సరైన రోడ్లు లేని ప్రాంతాలు చాలా ఉన్నాయి. అంతేకాకుండా మరెన్నో ప్రాంతాల్లో ఎన్నో సంవత్సరాలుగా రోడ్లను పట్టించుకోలేదు.


సరైన రహదారులు లేని ప్రాంతాలు కొన్నింటిని చూద్దాం..అనంతపురం జిల్లా నారప్పల మండలం దగుమర్రి, నీరుతొట్టి పల్లి, నర్సాపురం ఈ మూడు ప్రాంతాలకు దాదాపు గత 150 ఏళ్లుగా ఒకే రహదారి ఉంది. దానిని ఎన్ని ప్రభుత్వాలు మారిన పట్టించుకున్న వారు లేదు. అదే విధంగా గూగూడు, పులివెందులకు వెళ్లేందుకు ప్రస్తుతం ఉన్న మెటల్ రోడ్డును పట్టించుకుని 20 ఏళ్లు కావస్తుంది. ఇదే తరహాలో మన రాష్ట్రంలో మరెన్నో ప్రదేశాల్లో ఇటువంటి రోడ్లు ఉన్నాయి. సరైన రహదారులు ఉంటేనే ఆయా ప్రాంతాల అభివృద్ది వేగవంతం అవుతుంది. మరి వీటిపై జగన్ సర్కారు ఎప్పుడు దృష్టి పెడుతుందో చూడాలి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కుకింగ్ : మష్రూమ్ తో మ్యాజిక్..

ప్రాణాలు కాపాడిన ఫేస్బుక్.. ఎలాగో తెలుసా?

మనీ : పెట్టుబడి తక్కువ.. రాబడి ఎక్కువ.. సేంద్రియ ఎరువుల తయారీ..

విజయం మీదే: ఇవి పాటిస్తే విజయం వద్దన్నా మీ వెంటే వస్తుంది ...

ఒక్క ప్రోమోతో రూమర్లకు చెక్ పెట్టిన 'ఎన్టీఆర్'..!!

కమర్షియల్ యాడ్స్ తో కోట్లు సంపాదిస్తున్న తెలుగు హీరోలు

ఎన్టీఆర్, బాలయ్య ఇద్దరూ తొలిసారి ఇక్కడే కలుసుకున్నారట.. ఎక్కడో తెలుసా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Shanmukha]]>