QuotesDivyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/quotes/131/maanchimaata0d623bf4-8542-4e5d-a631-6fdc98822d06-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/quotes/131/maanchimaata0d623bf4-8542-4e5d-a631-6fdc98822d06-415x250-IndiaHerald.jpgపొదుపు చేయడం అనేది ఒక మంచి ఉత్తమమైన అలవాటు. ఒకవేళ మనం పొదుపు చేయలేకపోతే విపత్కర పరిస్థితులలో ఎన్నో అనర్థాలను చవిచూడాల్సి ఉంటుంది. అది ఎలానో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం.. చలికాలం ప్రారంభమవుతోంది. చుట్టుపక్కల ప్రకృతి అంతా చాలా అందంగా తయారవుతుంది. ఇక పక్షులకు మహా ఆనందమే. వాతావరణం పచ్చగా ఉండడంచేత అందరికీ పుష్కలంగా ఆహారం లభిస్తోంది. ఒక రోజున ఒక సోమరి గొల్లభామ ఒక ఆకుపై కూర్చుని ఏవో కూని రాగాలు తీస్తోంది. అప్పుడు పూలు ఎక్కువగా ఉండటం చేత మకరందాన్ని బాగా తాగుతూ అది సంతోషంతో గంతులేస్తోంది. హఠాత్తుగMAANCHIMAATA{#}Manam;prakruti;Mahaమంచిమాట : సోమరి వీడు.. కష్టపడు.. ఫలితం నీదే.మంచిమాట : సోమరి వీడు.. కష్టపడు.. ఫలితం నీదే.MAANCHIMAATA{#}Manam;prakruti;MahaSun, 06 Jun 2021 14:06:06 GMT
పొదుపు చేయడం అనేది ఒక మంచి ఉత్తమమైన అలవాటు. ఒకవేళ మనం పొదుపు చేయలేకపోతే విపత్కర పరిస్థితులలో ఎన్నో అనర్థాలను చవిచూడాల్సి ఉంటుంది. అది ఎలానో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..


చలికాలం ప్రారంభమవుతోంది. చుట్టుపక్కల ప్రకృతి అంతా చాలా అందంగా తయారవుతుంది. ఇక పక్షులకు మహా ఆనందమే. వాతావరణం పచ్చగా ఉండడంచేత అందరికీ పుష్కలంగా ఆహారం లభిస్తోంది. ఒక రోజున ఒక సోమరి గొల్లభామ ఒక ఆకుపై కూర్చుని ఏవో కూని రాగాలు తీస్తోంది. అప్పుడు పూలు ఎక్కువగా ఉండటం చేత మకరందాన్ని బాగా తాగుతూ అది సంతోషంతో గంతులేస్తోంది. హఠాత్తుగా దానికి ఒక చీమల దండు కనిపించింది. ఆ చీమలు ఏవో ఆహార పదార్థాల్ని మోసుకొనిపోతున్నాయి. వాటి పని చూసిన గొల్ల భామకు ఆశ్చర్యం అనిపించింది. ఎందుకింత శ్రమ పడి పోతున్నారు ! ఈ చక్కటి గాలిని పీల్చుకుంటూ తిని , తాగి సంతోషంగా ఉండొచ్చు కదా !అని వాటిని వేళాకోళం చేసింది ఆ గొల్లభామ.

చీమలు కష్టజీవులు అలాగే తెలివైనవి కూడా .ఇవి చలికాలం మంచు ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు. ఆ రోజుల కోసం ఇప్పుడు మేము ఆహారం నిల్వ చేసుకుంటున్నాము. లేదంటే ఇకపై ఆహారం దొరకదు అన్నాయి చీమలు. ఎప్పుడో రాబోయే కష్టానికి ఇప్పుడే మీరు బాధపడిపోతున్నారు.. అంటూ ఈల వేసుకుంటూ గొల్లభామ వెళ్ళిపోయింది.

ఇక చీమలు ఊహించినట్టుగానే విపరీతమైన చలి కాలం మొదలైంది. చెట్ల ఆకులన్నీ రాలిపోయాయి. అన్ని చీమలన్నే నేల పుటల్లోకి వెళ్లి అక్కడే ఉన్నాయి. పక్షులన్నీ దక్షిణ దిక్కుకు ఎగిరిపోయాయి. గొల్ల భామకు తిండి లేకుండా పోయింది. అది తినడానికి ఒక్క ఎక్కడ కూడా ఆహరం కనిపించడం లేదు. నేలంతా మంచుతో కప్పబడి పోయింది. ఏం చేయాలో తోచక గొల్లభామ, చీమల దగ్గరికి వెళ్లి కొంచెం ఆహారం పెట్టండి అని అడిగింది. ఇక అప్పుడు చీమలు , గొల్లభామ ఎట్లా వాటిని వేళాకోళం చేసిందో ?  చీమలకు జ్ఞాపకం వచ్చింది. మేము మా ఇంట్లో క్షేమంగా ఉన్నాము. మా కష్ట ఫలాన్ని హాయిగా అనుభవిస్తున్నాము. మాకు తినడానికి బోలెడంత తిండి నిల్వ ఉంది. నీవు మమ్మల్ని చులకన చేసి మాట్లాడిన సంగతి మర్చిపోము. అప్పుడు ఎండలో పాటలు పాడుతూ వున్నావ్ కదా!  మరి ఇప్పుడు పాడటం లేదే . ఇక్కడి నుండి వెళ్ళిపో ..నీ వంటి సోమరులు అంటే మాకు గిట్టదు అని అన్నాయి. ఏడుపు మొహం తో అక్కడి నుండి వెళ్ళిపోయింది గొల్లభామ.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

డాన్స్ మాస్టర్ నుంచి స్టార్ డైరెక్టరైనా లారెన్స్..

కుకింగ్ : మష్రూమ్ తో మ్యాజిక్..

ప్రాణాలు కాపాడిన ఫేస్బుక్.. ఎలాగో తెలుసా?

మనీ : పెట్టుబడి తక్కువ.. రాబడి ఎక్కువ.. సేంద్రియ ఎరువుల తయారీ..

విజయం మీదే: ఇవి పాటిస్తే విజయం వద్దన్నా మీ వెంటే వస్తుంది ...

ఒక్క ప్రోమోతో రూమర్లకు చెక్ పెట్టిన 'ఎన్టీఆర్'..!!

కమర్షియల్ యాడ్స్ తో కోట్లు సంపాదిస్తున్న తెలుగు హీరోలు



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>