MoviesMaddipati Lakshmi Sailajaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/71/director-sankarec4474c1-e8bc-436d-a7be-4eb27ca72a54-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/71/director-sankarec4474c1-e8bc-436d-a7be-4eb27ca72a54-415x250-IndiaHerald.jpgద‌క్షిణాది చిత్ర‌ప‌రిశ్ర‌మ నుంచి బాలీవుడ్ సైతం ఆశ్చ‌ర్య‌ప‌డేలా.. హాలీవుడ్‌ను త‌ల‌పించేలా సాంకేతిక అద్భుతాల‌ను వెండితెర‌పై ఆవిష్క‌రించిన ఘ‌న‌త ద‌ర్శ‌కుడు శంక‌ర్‌ది. భార‌తీయ వెండితెర‌కు భారీత‌నం అద్దిన అతికొద్దిమంది డైరెక్ట‌ర్ల‌లో అత‌డూ ఒక‌డు. ఇక భార‌తీయ సినీ న‌టుల్లో ఎవ‌రికీ సాధ్యం కానంత స్టార్‌డ‌మ్ త‌లైవా ర‌జ‌నీకాంత్‌ది. వీరిద్ద‌రి కాంబోలో ప‌దేళ్ల క్రితం తెర‌కెక్కిన టెక్నిక‌ల్ వండ‌ర్ రోబో. త‌మిళంలో ‘ఎందిరన్‌’గా వ‌చ్చిన‌ ఆ చిత్రం అప్ప‌ట్లో విడుద‌లైన అన్నిభాష‌ల్లోనూ ఘ‌న‌విజ‌యం సాధించింది.director sankar{#}bollywood;Chitram;Cinema;Hero;Tollywood;dil raju;Indiaడైరెక్ట‌ర్ శంక‌ర్ కు క‌ష్ట‌కాలం న‌డుస్తోందా..?డైరెక్ట‌ర్ శంక‌ర్ కు క‌ష్ట‌కాలం న‌డుస్తోందా..?director sankar{#}bollywood;Chitram;Cinema;Hero;Tollywood;dil raju;IndiaSun, 06 Jun 2021 07:42:09 GMT                                         
ద‌క్షిణాది చిత్ర‌ప‌రిశ్ర‌మ నుంచి బాలీవుడ్ సైతం ఆశ్చ‌ర్య‌ప‌డేలా.. హాలీవుడ్‌ను త‌ల‌పించేలా సాంకేతిక అద్భుతాల‌ను వెండితెర‌పై ఆవిష్క‌రించిన ఘ‌న‌త ద‌ర్శ‌కుడు శంక‌ర్‌ది. భార‌తీయ వెండితెర‌కు భారీత‌నం అద్దిన అతికొద్దిమంది డైరెక్ట‌ర్ల‌లో అత‌డూ ఒక‌డు. ఇక భార‌తీయ సినీ న‌టుల్లో ఎవ‌రికీ సాధ్యం కానంత స్టార్‌డ‌మ్ త‌లైవా ర‌జ‌నీకాంత్‌ది. వీరిద్ద‌రి కాంబోలో ప‌దేళ్ల క్రితం తెర‌కెక్కిన టెక్నిక‌ల్ వండ‌ర్ రోబో. త‌మిళంలో ‘ఎందిరన్‌’గా వ‌చ్చిన‌ ఆ చిత్రం అప్ప‌ట్లో విడుద‌లైన అన్నిభాష‌ల్లోనూ ఘ‌న‌విజ‌యం సాధించింది. కాసుల వ‌ర్షం కురిపించింది. ఆ న‌మ్మ‌కంతోనే మూడేళ్ల క్రితం దాని సీక్వెల్ కూడా తెర‌కెక్కించాడు ద‌ర్శ‌కుడు శంక‌ర్. క‌నీవినీ ఎరుగ‌నంత అత్య‌ధిక‌ వ్య‌యంతో అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తెర‌కెక్కిన రోబో 2. దేశ విదేశాల్లో దాదాపు ప‌దిహేను భాష‌ల్లో భారీ స్థాయిలో విడుద‌లైనా అంచ‌నాల‌ను అందుకోవ‌డంలో విఫ‌ల‌మైంది. నిజానికి ఈ చిత్ర క‌థ‌ను ద‌ర్శ‌కుడు శంక‌ర్ మ‌రో స్టార్ హీరో క‌మ‌ల్‌హాస‌న్‌ను దృష్టిలో పెట్టుకుని త‌యారు చేశాన‌ని ఆ స‌మ‌యంలో స్వ‌యంగా వెల్ల‌డించాడు. ఆయ‌న సొంత చిత్రం ప‌నుల‌తో బిజీగా ఉండ‌టంతో ర‌జ‌నీకాంత్ ఆ చిత్రంలో న‌టించారు. అంత‌కుముందు హీరో విక్ర‌మ్‌తో భారీ స్థాయిలో రూపొందించిన ఐ చిత్రం, ఆ త‌రువాత రోబో-2 రెండూ డైరెక్ట‌ర్ శంక‌ర్‌కు నిరాశ‌నే మిగిల్చాయి.
       ద‌ర్శ‌కుడిగా పున‌ర్వైభ‌వం సాధించే ల‌క్ష్యంతో శంక‌ర్ క‌మ‌ల్‌హాస‌న్‌తో ఇండియ‌న్‌-2 చిత్రాన్ని భారీస్థాయిలో తెర‌కెక్కించేందుకు పూనుకున్నాడు. అయితే ఈ చిత్రం ఏ ముహూర్తాన మొద‌లుపెట్టారోగానీ డైరెక్ట‌ర్ శంక‌ర్ స‌హా యూనిట్ స‌భ్యుల‌కూ క‌ష్టాలు మొద‌ల‌య్యాయి. ఈ చిత్రం షూటింగ్ స‌మ‌యంలో భారీ క్రేన్ విరిగిప‌డ‌టంతో పెద్ద ప్ర‌మాదం జ‌రిగింది. ముగ్గురు సిబ్బంది చ‌నిపోయారు. ద‌ర్శ‌కుడు శంక‌ర్ తృటిలో ప్రాణాపాయం నుంచి త‌ప్పించుకున్నా ఆయ‌న‌కూ గాయాల‌య్యాయి. అప్ప‌టినుంచి ఈ చిత్రం షూటింగ్ నిలిచిపోయింది. చ‌నిపోయిన సిబ్బంది కుటుంబాల‌కు న‌ష్ట ప‌రిహారం చెల్లిస్తేగానీ తాను షూటింగ్‌లో పాల్గొనేది లేద‌ని హీరో క‌మ‌ల్‌హాస‌న్ నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్‌కు తేల్చి చెప్ప‌డం త‌దిత‌ర కార‌ణాల‌తో సినిమా వివాదాల్లో చిక్కుకుంది. నిజానికి ఈ చిత్రం త‌రువాత ద‌ర్శ‌కుడు శంక‌ర్ టాలీవుడ్ హీరో చెర్రీతో దిల్ రాజు నిర్మాత‌గా ఓ పాన్ ఇండియా మూవీని ప్లాన్ చేసుకున్నాడు. ఆ త‌రువాత బాలీవుడ్‌లో ర‌ణ్‌వీర్‌సింగ్ హీరోగా మ‌రో చిత్రానికి క‌మిట‌య్యాడు. అయితే భార‌తీయుడు.-2 చిత్రం పూర్తి చేయ‌కుండా శంక‌ర్ మ‌రో చిత్రానికి ప‌నిచేయ‌డాన్ని అనుమ‌తించ‌వ‌ద్దంటూ లైకా ప్రొడక్ష‌న్స్ నిర్మాత‌ల కౌన్సిల్‌లో ఫిర్యాదు చేయ‌డం, న్యాయ‌ప‌ర‌మైన వివాదాల‌తో ఇప్పుడు శంక‌ర్ దిక్కుతోచ‌ని ప‌రిస్థితిని ఎదుర్కొంటున్నాడు. మ‌రి ఈ వివాదాల నుంచి బ‌య‌టప‌డి ఈ డైరెక్ట‌ర్ నుంచి కొత్త చిత్రం వ‌చ్చేందుకు  ఎంత‌కాలం ప‌డుతుందో చూడాలి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

చెరుకు రసంతో పొట్ట తగ్గుతుందా.. ఇది తెలుసుకోండి?

విజయం మీదే: ఇవి పాటిస్తే విజయం వద్దన్నా మీ వెంటే వస్తుంది ...

ఒక్క ప్రోమోతో రూమర్లకు చెక్ పెట్టిన 'ఎన్టీఆర్'..!!

కమర్షియల్ యాడ్స్ తో కోట్లు సంపాదిస్తున్న తెలుగు హీరోలు

ఎన్టీఆర్, బాలయ్య ఇద్దరూ తొలిసారి ఇక్కడే కలుసుకున్నారట.. ఎక్కడో తెలుసా..?

త్వరలో సినీ ప్రముఖులతో కేసీఆర్ భేటీ..?

అలా చేద్దామని ప్రతిజ్ఞ చేద్దాం: మహేష్ బాబు



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Maddipati Lakshmi Sailaja]]>