PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/jaganfb8e88cc-cab2-461e-8e6d-d0a753199c8b-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/jaganfb8e88cc-cab2-461e-8e6d-d0a753199c8b-415x250-IndiaHerald.jpgడొక్కా మాణిక్యవరప్రసాద్...ఏపీ రాజకీయాల్లో సీనియర్ నాయకుడు. ఇక అందరు కాంగ్రెస్ నాయకులు మాదిరిగానే డొక్కా రాజకీయ భవిష్యత్ రాష్ట్ర విభజన తర్వాత అయోమయంలో పడింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్తితి మరింత దిగజారిపోవడంతో డొక్కా పార్టీ మారాల్సి వచ్చింది. 2014 ఎన్నికల తర్వాత రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావడం, పైగా తన రాజకీయ గురువు రాయపాటి సాంబశివరావు టీడీపీలోనే ఉండటంతో, డొక్కా టీడీపీలోకి వచ్చారు.jagan{#}రాజీనామా;Jagan;Congress;Party;TDP;Rayapati Sambasivarao;Hanu Raghavapudi;Prathipadu;media;television;Thadikonda;YCP;Sridevi Kapoor;Assemblyడొక్కాకు జగన్ ఛాన్స్ ఇస్తారా?డొక్కాకు జగన్ ఛాన్స్ ఇస్తారా?jagan{#}రాజీనామా;Jagan;Congress;Party;TDP;Rayapati Sambasivarao;Hanu Raghavapudi;Prathipadu;media;television;Thadikonda;YCP;Sridevi Kapoor;AssemblySun, 06 Jun 2021 04:00:00 GMTడొక్కా మాణిక్యవరప్రసాద్...ఏపీ రాజకీయాల్లో సీనియర్ నాయకుడు. ఇక అందరు కాంగ్రెస్ నాయకులు మాదిరిగానే డొక్కా రాజకీయ భవిష్యత్ రాష్ట్ర విభజన తర్వాత అయోమయంలో పడింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్తితి మరింత దిగజారిపోవడంతో డొక్కా పార్టీ మారాల్సి వచ్చింది. 2014 ఎన్నికల తర్వాత రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావడం, పైగా తన రాజకీయ గురువు రాయపాటి సాంబశివరావు టీడీపీలోనే ఉండటంతో, డొక్కా టీడీపీలోకి వచ్చారు.


ఇక టీడీపీలోకి వచ్చాక డొక్కా పరిస్తితి బాగానే ఉంది. ఆ పార్టీ తరుపున ఎమ్మెల్సీ పదవి కూడా దక్కింది. అలాగే పార్టీలో గౌరవం కూడా బాగానే ఉండేది. ఈ క్రమంలోనే 2019 ఎన్నికల్లో చంద్రబాబు, డొక్కాకు ప్రత్తిపాడు టిక్కెట్ కూడా ఇచ్చారు. అయితే జగన్ వేవ్‌లో డొక్కా ఘోరంగా ఓడిపోయారు. ఓడిపోయాక టీడీపీలో సైలెంట్ అయ్యారు. అయితే జగన్ మూడు రాజధానుల నిర్ణయం తీసుకోవడాన్ని వ్యతిరేకించారు.


ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా ఎమ్మెల్సీ పదవికు కూడా రాజీనామా చేశారు. మరి విచిత్రం ఏంటో తెలియదు గానీ, మూడు రాజధానులకు వ్యతిరేకంగా రాజీనామా చేసిన డొక్కా, చివరికి వైసీపీలో చేరారు. అలాగే మళ్ళీ ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.


ఇక ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాక కూడా సైలెంట్‌గానే ఉన్నారు. గతంలో టీడీపీలో ఉన్నప్పుడు మీడియా సమావేశాల్లో, టీవీ డిబేట్లలో కనిపించేవారు. కానీ ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు. అయితే ఇలా అధికార పార్టీలో ఉండి కూడా సైలెంట్‌గా ఉంటున్న డొక్కా నెక్స్ట్ ఎన్నికల్లో ఏ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతారనేది ఆసక్తికరంగా ఉంది. అలాగే జగన్, డొక్కాకు ఛాన్స్ ఇస్తారా? అనేది కూడా చూడాలి.


గతంలో డొక్కా, తాడికొండ నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున విజయం సాధించారు. కాబట్టి తాడికొండపై డొక్కాకు మంచి పట్టు ఉంది. కానీ అక్కడ వైసీపీ ఎమ్మెల్యేగా శ్రీదేవి ఉన్నారు. ఈమె రెండేళ్లలో పలు వివాదాల్లో హైలైట్ అయ్యారు. అసెంబ్లీ జగన్‌కు భజన చేసి కూడా హైలైట్ అయ్యారు. ఇలా భజన చేసిన శ్రీదేవికి కూడా నెక్స్ట్ కూడా తాడికొండ సీటు దక్కుతుందా? లేక జగన్ మనస్సు మార్చుకుని డొక్కాకు ఛాన్స్ ఇస్తారనేది చూడాలి. 





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

దోచుకుని దాచుకోవాలానుకున్నారు.. కానీ ముక్కు పిండి వసూలు చేసారు?

విజయం మీదే: ఇవి పాటిస్తే విజయం వద్దన్నా మీ వెంటే వస్తుంది ...

ఒక్క ప్రోమోతో రూమర్లకు చెక్ పెట్టిన 'ఎన్టీఆర్'..!!

కమర్షియల్ యాడ్స్ తో కోట్లు సంపాదిస్తున్న తెలుగు హీరోలు

ఎన్టీఆర్, బాలయ్య ఇద్దరూ తొలిసారి ఇక్కడే కలుసుకున్నారట.. ఎక్కడో తెలుసా..?

త్వరలో సినీ ప్రముఖులతో కేసీఆర్ భేటీ..?

అలా చేద్దామని ప్రతిజ్ఞ చేద్దాం: మహేష్ బాబు



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>