MoviesDivyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ayana-jivitham-eani-malupulu-thirigindhoo-telusa3732a26b-3677-486c-a09d-d22f03c9ba29-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ayana-jivitham-eani-malupulu-thirigindhoo-telusa3732a26b-3677-486c-a09d-d22f03c9ba29-415x250-IndiaHerald.jpgఇండస్ట్రీలో ఎవరు?ఎప్పుడు?ఎలా మారుతారో?..ఎవరికీ అదృష్టం ఎలా వస్తుందో? చెప్పడం అనేది చాలా కష్టం. కొంతమంది కష్టపడకుండానే స్టార్ అయిపోతుంటారు. మరి కొంతమంది ఎంత కష్టపడినా కూడా కనీసం వారు అనుకున్న కలలు నెరవేర్చుకోలేని పరిస్థితిలో ఉంటారు. ఇక ఇంకొంతమంది తమ నటనతో, తెలివితో సినీ ఇండస్ట్రీలో అంచెలంచెలుగా ఎదుగుతూ టాప్ మోస్ట్ స్టార్స్ గా కూడా ఎదిగిన వారు వున్నారు. అలాంటి వారిలో ఎప్పుడూ ముందంజలో నిలుచున్నారు దాసరి నారాయణరావు గారు. అయితే ఈయన జీవితం ఎన్ని మలుపులు తిరిగిందో చెప్పడం చాలా కష్టం. దాసరి నారాయణ రావు happu-sunday{#}dasari narayana rao;Director;Konakalla Narayana Rao;Diwali;Father;Master;Prize;Gift;Mantra;Rishikesh;Chitram;Cinema;geetha;Kannada;Andhra Pradesh;Governmentఆయన జీవితం ఎన్ని మలుపులు తిరిగిందో తెలుసా?ఆయన జీవితం ఎన్ని మలుపులు తిరిగిందో తెలుసా?happu-sunday{#}dasari narayana rao;Director;Konakalla Narayana Rao;Diwali;Father;Master;Prize;Gift;Mantra;Rishikesh;Chitram;Cinema;geetha;Kannada;Andhra Pradesh;GovernmentSun, 06 Jun 2021 10:00:00 GMT
ఇండస్ట్రీలో ఎవరు?ఎప్పుడు?ఎలా మారుతారో?..ఎవరికీ అదృష్టం ఎలా వస్తుందో? చెప్పడం అనేది చాలా కష్టం. కొంతమంది కష్టపడకుండానే స్టార్ అయిపోతుంటారు. మరి కొంతమంది ఎంత కష్టపడినా కూడా కనీసం వారు అనుకున్న కలలు నెరవేర్చుకోలేని పరిస్థితిలో ఉంటారు. ఇక ఇంకొంతమంది తమ నటనతో, తెలివితో సినీ ఇండస్ట్రీలో అంచెలంచెలుగా ఎదుగుతూ టాప్ మోస్ట్ స్టార్స్ గా కూడా ఎదిగిన వారు వున్నారు. అలాంటి వారిలో ఎప్పుడూ ముందంజలో నిలుచున్నారు దాసరి నారాయణరావు గారు. అయితే ఈయన జీవితం ఎన్ని మలుపులు తిరిగిందో చెప్పడం చాలా కష్టం. దాసరి నారాయణ రావు గారు యాక్టర్ నుండి డైరెక్టర్ గా ఎలా మారారు, ఆ తర్వాత ఎన్ని రంగాలలో రాణించారు అనే విషయాలను ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం.

దాసరి నారాయణ రావు 1947 మే 4వ తేదీన పశ్చిమగోదావరి జిల్లాలోని, పాలకొల్లులో జన్మించారు. ఈయన పుట్టగానే ఒక ధనవంతుల కుటుంబంలో జన్మించారు. కానీ దీపావళి నాడు వీరు తయారు చేసే పొగాకు సంబంధించిన గోడౌన్ మంటల్లో తగలబడిపోవడంతో ఆర్థికంగా పూర్తిగా దెబ్బతిన్నారు. ఇక తను స్కూలుకు వెళ్లే సమయంలో ఫీజులు కూడా కట్టలేని పరిస్థితి ఏర్పడింది. తన తండ్రి ఇక చదువుని ఆపించి వడ్రంగి దుకాణంలో పనికి పెట్టారు.కానీ ఒక మాస్టర్ సహాయంతో మళ్ళీ చదివి లోకి వచ్చి, ఆయన ఆరవ తరగతిలో ఉత్తమ విద్యార్థిగా బహుమతి కూడా అందుకున్నారు. ఈయన కళాశాలలో చదివేటప్పుడు కొన్ని నాటకాలలో కూడా పాల్గొనేవారు. ఇక బి ఏ పట్టభద్రుడు అయిన తర్వాత నాటక రంగంలోకి ప్రవేశించారు.

దాసరి నారాయణ రావు గారికి చిన్నప్పటి నుంచే నాటకాల అంటే మక్కువ ఉండడంతో, అతి తక్కువ కాలంలోనే ప్రతిభ గల రంగస్థల నటుడిగా, నాటక రచయితగా, చిత్ర దర్శకుడిగా, నిర్మాతగా గుర్తింపు పొందారు. అంతేకాదు ఎంతో మంది కళాకారులను సినీ ఇండస్ట్రీకి కూడా పరిచయం చేశారు. ముఖ్యంగా స్టార్ హీరోయిన్లను కూడా దాసరి నారాయణ సినీ ఇండస్ట్రీకి పరిచయం చేశారు. అదే కాదు ఆయన సినీ ఇండస్ట్రీలో చేయని పని లేదు, సాధించని విజయం లేదు. ఈయన నాటకాలు చేసినప్పుడు ఈయన ప్రదర్శనకు మంత్ర ముగ్ధులై, రిషికేశ్ పిక్చర్స్  సంస్థ అధినేత కృష్ణయ్య "పంతం కోసం పందెం" అనే చిత్రంలో హాస్య నటుడిగా అవకాశం ఇచ్చారు. ఇక అలా మొదట హాస్య నటుడిగా తన సినీ జీవితాన్ని మొదలుపెట్టారు దాసరి.

ఇక మొట్టమొదటిసారి దర్శకుడిగా 1972లో వచ్చిన "తాత మనవడు " చిత్రం ద్వారా సినీ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. ఇక తరువాత అంచలంచెలుగా ఎదుగుతూ, ఏకంగా 150 చిత్రాలకు దర్శకత్వం వహించి, గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో స్థానం సంపాదించుకున్నారు. ఇక 50 సినిమాలకు నిర్మాతగా మారి, అద్భుతంగా సృష్టించారు. ఇక 250 చిత్రాలకు పైగా గీత రచయితగా పని చేయడంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ భాషా చిత్రాలలో కూడా నటించి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేత ఉత్తమ నటుడిగా బహుమానం కూడా గెలుచుకున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్.. ఒక్కరోజే 50 వేల మందికి!

విజయం మీదే: ఇవి పాటిస్తే విజయం వద్దన్నా మీ వెంటే వస్తుంది ...

ఒక్క ప్రోమోతో రూమర్లకు చెక్ పెట్టిన 'ఎన్టీఆర్'..!!

కమర్షియల్ యాడ్స్ తో కోట్లు సంపాదిస్తున్న తెలుగు హీరోలు

ఎన్టీఆర్, బాలయ్య ఇద్దరూ తొలిసారి ఇక్కడే కలుసుకున్నారట.. ఎక్కడో తెలుసా..?

త్వరలో సినీ ప్రముఖులతో కేసీఆర్ భేటీ..?

అలా చేద్దామని ప్రతిజ్ఞ చేద్దాం: మహేష్ బాబు



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>