LifeStyleGarikapati Rajesheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/lifestyle/taurus_taurus/corona6358714d-2711-4ece-8921-88499a10ba41-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/lifestyle/taurus_taurus/corona6358714d-2711-4ece-8921-88499a10ba41-415x250-IndiaHerald.jpgప్రపంచ వ్యాప్తంగా కరోనా ఇంకా అదుపులోకి రాలేదు. కొన్ని దేశాల్లో మాత్రమే అదుపులోకి వచ్చింది. దీంతో ఆయా దేశాలు త‌మ‌ ఉద్యోగుల్ని వర్క్‌ ఫ్రమ్‌ హోం నుంచి కార్యాల‌యాల‌కు ర‌మ్మ‌న‌మ‌ని క‌బురు పంపించ‌డంతో స‌మ‌స్య ప్రారంభ‌మైంది. ప‌నిచేయాలంటే ఎక్క‌డినుంచైనా చేయ‌వ‌చ్చ‌ని, కార్యాల‌యాల‌కే వ‌చ్చి చేయ‌డ‌మ‌నేది పాత ఆలోచ‌న అని ఉద్యోగులు అనుకుంటున్న‌ట్లు కొన్ని జాబ్ క‌న్స‌ల్టెన్సీ సంస్థ‌ల స‌ర్వేల్లో వెల్ల‌డైంది. ఈ విధానాల‌కు స్వ‌స్తిప‌ల‌కాల‌ని, కొత్త ఉద్యోగుల‌తో కొత్త త‌ర‌హా ప‌నివిధానాన్ని ప్రోత్స‌హించాల‌ని యువ ఉదcorona{#}job;Yuva;youth;bhavanaక‌రోనాకు పూర్వం.. క‌రోనా త‌ర్వాత‌!క‌రోనాకు పూర్వం.. క‌రోనా త‌ర్వాత‌!corona{#}job;Yuva;youth;bhavanaSat, 05 Jun 2021 10:37:39 GMT
ప్రపంచ వ్యాప్తంగా కరోనా ఇంకా అదుపులోకి రాలేదు. కొన్ని దేశాల్లో మాత్రమే అదుపులోకి వచ్చింది. దీంతో ఆయా దేశాలు త‌మ‌ ఉద్యోగుల్ని వర్క్‌ ఫ్రమ్‌ హోం నుంచి కార్యాల‌యాల‌కు ర‌మ్మ‌న‌మ‌ని క‌బురు పంపించ‌డంతో స‌మ‌స్య ప్రారంభ‌మైంది. ప‌నిచేయాలంటే ఎక్క‌డినుంచైనా చేయ‌వ‌చ్చ‌ని, కార్యాల‌యాల‌కే వ‌చ్చి చేయ‌డ‌మ‌నేది పాత ఆలోచ‌న అని ఉద్యోగులు అనుకుంటున్న‌ట్లు కొన్ని జాబ్ క‌న్స‌ల్టెన్సీ సంస్థ‌ల స‌ర్వేల్లో వెల్ల‌డైంది. ఈ విధానాల‌కు స్వ‌స్తిప‌ల‌కాల‌ని, కొత్త ఉద్యోగుల‌తో కొత్త త‌ర‌హా ప‌నివిధానాన్ని ప్రోత్స‌హించాల‌ని యువ ఉద్యోగులు కోరుతున్న‌ట్లు ఈ స‌ర్వేల్లో స్ప‌ష్ట‌మైంది.

కొత్త ఉద్యోగుల‌పై ప‌ట్టుకోసం సీనియ‌ర్ ఉద్యోగులు, టీమ్‌లీడ‌ర్లు!
చాలా దేశాల్లో ఇంటి నుంచి కార్యాల‌యాల‌కు వెళ్లడానికి కనీసం ఒకటి నుంచి రెండు గంటల స‌మ‌యం ప‌డుతుంది. తిరిగి ఇంటికి రావాలంటే అదే పరిస్థితి. దీంతో ఇంటి నుంచి పని చేసుకుంటే ఆ సమయం మిగులుతుంద‌ని నేటి యువ‌త ఆలోచ‌న‌గా ఉంది. రవాణా ఖర్చులు, మధ్యలో అయ్యే ఖర్చులు కూడా మిగులుతాయనే భావన ఉంది. మొత్తంగా విదేశాల్లో నెల‌కు ఐదువేల డాలర్ల వరకు మిగుల్చుకోవచ్చనే అంచ‌నాలున్నాయి. యూఎస్‌లో ఇప్పటికే 28 శాతం మంది ఉద్యోగులు కార్యాల‌యాల‌కు వ‌స్తున్నారు. కొత్త పని విధానానికి అలవాటుపడకపోవడం, ఇంటి నుంచి పనిచేసేవారిపై తమ పట్టు ఉండటంలేదని సీనియ‌ర్లు, టీమ్ లీడ‌ర్లు భావిస్తున్నారంటూ యువ‌త‌రం ఉద్యోగులు అంటున్న‌ట్లు స‌ర్వేలో తేలింది. దీనివ‌ల్లే వారు కార్యాల‌యాల‌కు రావాలంటూ ఒత్తిడి చేస్తున్నార‌ని చెప్పారు.

కార్యాల‌యానికి ర‌మ్మంటే ఉద్యోగం మానేస్తామంటున్నారు!
ఇటీవల అమెరికాలో జరిగిన ఓ సర్వేలో కార్యాల‌యాల‌కు ర‌మ్మంటే 39 శాతం మంది ఉద్యోగం మానేయడానికి సిద్ధంగా ఉన్నారు. అదే యువ ఉద్యోగులైతే ఆ శాతం 49గా ఉంది. ఫ్లెక్స్‌జాబ్స్‌ అనే సంస్థ నిర్వ‌హించిన స‌ర్వేలో ఎక్కువమంది వర్క్‌ఫ్రమ్ హోం చేస్తే డబ్బులు మిగులుతాయని, రవాణా, కొవిడ్‌ జాగ్రత్తలు, ఖర్చులు, కుటుంబానికి దూరంగాఉండటం, పిల్లల సంరక్షణ... ఇవ‌న్నీ క‌లుపుకుంటే నెల‌కు ఐదువేల డాల‌ర్లు ఆదాఅవుతాయ‌ని చెప్పిన‌ట్లు స‌ర్వేలో తేలింది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

తప్పుడు పని చేస్తూ పట్టుబడ్డ కుంకుమ హీరోయిన్..

వామ్మో.. ఈ కరెంటు బిల్లుల దోపిడీ నిజమేనా..?

ప్ర‌పంచ ప‌ర్యావ‌ర‌ణ దినోత్స‌వం : కరోనాతో కొత్త టెన్షన్!

ఇలా చేసి శ్రీమహాలక్ష్మికి ఆగ్రహం తెప్పిస్తున్నారా ?

సీమ‌ను తాకిన నైరుతి...అక్క‌డ అత్య‌ధిక వ‌ర్ష‌పాతం.. !

ఠాగూర్ సినిమాలో హైలెట్ గా నిలిచిన సాంగ్స్..!

తెలుగు సినిమా ఒక దారిలో హీరోయిన్స్ 'ఆ' దారిలో ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>