MoviesVAMSIeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/business_videos/dangerous-diseasesbe11a16d-c0df-4975-89dd-f69e7883207a-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/business_videos/dangerous-diseasesbe11a16d-c0df-4975-89dd-f69e7883207a-415x250-IndiaHerald.jpgమానవుడన్నాక రకరకాల వ్యాధులు వస్తూ ఉంటాయి. ఈ వ్యాధికి తగిన చికిత్సను తీసుకున్న తరువాత నయమవుతూ ఉంటాయి. ఇలా జరగడం అనేది సర్వసాధారణం. కానీ ఈ ప్రపంచంలో ఉన్న కొంతమంది సినీ సెలెబ్రెటీలు కొన్ని రకాల భయంకరమైన వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారు.DANGEROUS-DISEASES{#}Cinema;Shakti;charlie;HIV;Hollywood;Cancer;Lung cancer;Pamela Andersonఈ సినిమా సెలబ్రిటీలకున్న జబ్బులు ఎప్పటికీ నయం కావట ?ఈ సినిమా సెలబ్రిటీలకున్న జబ్బులు ఎప్పటికీ నయం కావట ?DANGEROUS-DISEASES{#}Cinema;Shakti;charlie;HIV;Hollywood;Cancer;Lung cancer;Pamela AndersonSat, 05 Jun 2021 18:28:02 GMTమానవుడన్నాక రకరకాల వ్యాధులు వస్తూ ఉంటాయి. ఈ వ్యాధికి తగిన చికిత్సను తీసుకున్న తరువాత నయమవుతూ ఉంటాయి. ఇలా జరగడం అనేది సర్వసాధారణం. కానీ ఈ ప్రపంచంలో ఉన్న కొంతమంది సినీ సెలెబ్రెటీలు కొన్ని రకాల భయంకరమైన వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారు. అయితే ఏమి ఆ వ్యాధులకు చికిత్స తీసుకుంటే సరి కదా ? అనుకుంటున్నారా ? ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. వీరికి సంక్రమించిన వ్యాధులకు చికిత్స అనేది లేదంట. ఏ చికిత్స చేసినా కూడా ఆ వ్యాధి వీరిని వదిలి వెళ్లదట. అలాంటి ఒక 5 గురు సినిమా సెలెబ్రిటీల గురించి ఇప్పుడు తెలుసుకుందాము.

* సెలెనా గోమెజ్
ఈమె అమెరికాకు చెందిన ప్రపంచ ప్రఖ్యాతి పొందిన ఒక మహిళా సింగర్.  సెలెనా, పైన మనము చెప్పుకున్న విధంగా చాలా కాలంగా "లూపస్" అనే వ్యాధితో ఇబ్బంది పడుతోంది. ఈ వ్యాధి గురించి ఎవ్వరికీ తెలిసే అవకాశం లేదు. కానీ దీనికి చికిత్స లేకపోవడం విచారకరం. ఈ వ్యాధి ఆమెలోని ఆరోగ్యవంతమైన సెల్స్ ని క్షీణింపచేస్తుంది. తద్వారా ఆమెకు చేసిన చికిత్స విఫలం అవ్వడంతో అది సహాయపడుతుంది. మాములుగా మనలో ఉన్న రోగనిరోధక శక్తి మనకు రక్షణగా పనిచేస్తుంది. కానీ సెలెనాకు ఇదే శత్రువుగా వ్యతిరేకంగా తనపై ప్రభావం చూపిస్తుంది.  ఈ వ్యాధి కారణంగా గుండె, ఊపిరితిత్తులు, రక్తానికి సంబంధిచిన సమస్యలు పునరావృతం అవుతూ ఉంటాయి.
 
* చార్లీ షీన్
అమెరికాకు చెందిన చార్లీ ప్రముఖ నటుడిగా గుర్తింపు పొంది ఉన్నారు. ఈయనకు గత కొంతకాలంగా హెచ్ఐవీ తో బాధపడుతున్నాడు. ఈ వ్యాధి గురించి అందరికీ తెలిసిందే. ఈ వ్యాధి వలన అతని శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. ఎప్పుడైతే రోగనిరోధక శక్తి  తగ్గుతుందో అప్పుడే ఎక్కువ వ్యాధులు పదే పదే ఎటాక్ చేస్తూ ఉంటాయి. ఇది అంటువ్యాధి కాదు.  


*హగ్ జాక్ మాన్
జాక్ మాన్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ప్రముఖ హాలీవుడ్ సినిమాలలో నటించి మంచి పేరును తెచ్చుకున్నాడు. "ఎక్స్ మాన్" సిరీస్ లో నటిచింది ఇతనే. జాక్ ‘బాసల్ సెల్ కార్సినోమా’ అనే కొత్త రకమైన కాన్సర్ తో కాలాన్ని గడుపుతున్నాడు. ఈ కాన్సర్ కు ఎటువంటి చికిత్స లేకపోవడం బాధాకరం. కాన్సర్ వచ్చినప్పటి నుండి అంటే 8 సంవత్సరాల నుండి ఇప్పటి వరకు 4 సార్లు దీనికి చికిత్సను తీసుకున్నట్లు తెలుస్తోంది.


 * మైఖేల్ జే ఫాక్స్
ఇతను ప్రముఖ హాలీవుడ్ నటుడు. ఈయన ప్రాణాంతకమైన పార్కిన్సన్ అనే జబ్బుతో బాధపడుతున్నాడు. మైఖేల్ 25 సంవత్సరాలుగా ఈ భయానక వ్యాధితో ఇబ్బంది పడుతున్నాడు. ఇతను ఈ వ్యాధికి భయపడకుండా ఒక సవాల్ గా తీసుకుని ముందుకు వెళుతున్నాడు.

* పమేలా అండర్సన్
అమెరికాకు చెందిన నటి పమేలా అండర్సన్ "హెపటైటిస్ సి" అనే వ్యాధితో తరచూ ఇబ్బంది పడుతూ ఉంది. ఈ వ్యాధి కారణంగా భరించలేని కడుపు నొప్పి వస్తుంది. దీనికి ఇప్పటి వరకు పర్మినెంట్ మెడిసిన్ ఏదీ లేదు. ఈ వ్యాధి తీవ్రత ఎక్కువయితే కనుక లివర్ డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉందంటున్నారు వైద్యులు.

ఇలా వీరంతా ఎటువంటి చికిత్స లేని వ్యాధులతో జీవనాన్ని కొనసాగిస్తున్నారు.  
 





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

సోషల్ మీడియా టీంని ప్లాన్ చేస్తున్న మహేష్...!

ఎన్టీఆర్, బాలయ్య ఇద్దరూ తొలిసారి ఇక్కడే కలుసుకున్నారట.. ఎక్కడో తెలుసా..?

త్వరలో సినీ ప్రముఖులతో కేసీఆర్ భేటీ..?

అలా చేద్దామని ప్రతిజ్ఞ చేద్దాం: మహేష్ బాబు

ఈ వెరై "టీ " ట్రై చేశారా...?

హనుమ జన్మ నిర్ధారణలో ఒకడుగు వెనక్కు తగ్గిన టీటీడీ..!

ఆ అశ్లీల వీడియో లో ప్రముఖ నటి.. పోస్ట్ పెట్టి మరీ



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>