PoliticsMaddipati Lakshmi Sailajaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/ap-board-exams-fc0857de-2f78-4900-934b-c846218344a9-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/ap-board-exams-fc0857de-2f78-4900-934b-c846218344a9-415x250-IndiaHerald.jpgగ‌తంలో వాయిదా ప‌డిన టెన్త్, ఇంట‌ర్ పరీక్షల నిర్వహణపై ఏపీ ప్రభుత్వం మొండిపట్టుద‌లకు పోతుండటంపై ప్ర‌జ‌ల‌నుంచి విస్మయం వ్యక్తమవుతోంది. కరోనా రెండోవేవ్‌ తీవ్ర ప్రభావం చూపించి కాస్త త‌గ్గుముఖం ప‌డుతున్న స‌మ‌యంలోనే మూడో వేవ్ రానున్న‌దంటూ వ‌స్తున్న వార్త‌లతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో దేశ‌వ్యాప్తంగా ఆందోళన నెలకొంది. ఈ విషయాన్ని గమనించిన కేంద్ర ప్ర‌భుత్వం సైతం సీబీఎస్ఈ పరీక్షలను రద్దు చేసిన విషయం తెలిసిందే. అంతేకాదు..AP Board exams{#}Andhra Pradesh;central government;Minister;Suresh;MPపరీక్షల నిర్వహణపై ఈ మొండి పట్టుద‌ల‌ ఎందుకో..?పరీక్షల నిర్వహణపై ఈ మొండి పట్టుద‌ల‌ ఎందుకో..?AP Board exams{#}Andhra Pradesh;central government;Minister;Suresh;MPSat, 05 Jun 2021 17:20:06 GMTగ‌తంలో వాయిదా ప‌డిన టెన్త్, ఇంట‌ర్ పరీక్షల నిర్వహణపై ఏపీ ప్రభుత్వం మొండిపట్టుద‌లకు పోతుండటంపై ప్ర‌జ‌ల‌నుంచి విస్మయం వ్యక్తమవుతోంది. కరోనా రెండోవేవ్‌ తీవ్ర ప్రభావం చూపించి కాస్త త‌గ్గుముఖం ప‌డుతున్న స‌మ‌యంలోనే మూడో వేవ్ రానున్న‌దంటూ వ‌స్తున్న వార్త‌లతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో దేశ‌వ్యాప్తంగా ఆందోళన నెలకొంది. ఈ విషయాన్ని గమనించిన కేంద్ర ప్ర‌భుత్వం సైతం సీబీఎస్ఈ పరీక్షలను రద్దు చేసిన విషయం తెలిసిందే. అంతేకాదు.. స్వ‌యంగా ప్ర‌ధాని నరేంద్ర‌మోదీ విద్యార్థుల‌తో ఈ అంశంపై ప్ర‌సంగించ‌డం ద్వారా వారి ఆందోళ‌న‌ను ప్ర‌భుత్వం గుర్తించింద‌ని తెలిపి వారికి భ‌రోసానిచ్చే ప్ర‌య‌త్నం చేశారు. కేంద్రం నిర్ణ‌యంపై విద్యార్థుల్లో హ‌ర్షం వ్య‌క్త‌మైంది. అంతేకాదు ప‌లు రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఇదే నిర్ణ‌యాన్ని ముందుగానే ప్ర‌క‌టించి విద్యార్థుల‌ను త‌రువాత త‌ర‌గ‌తుల్లోకి ప్ర‌మోట్ చేశాయి. కానీ ఏపీ ప్ర‌భుత్వం తీరు మాత్రం ఇందుకు విరుద్దంగా ఉంద‌న్న విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. తాజాగా ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూల‌పు సురేష్ ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌పై చేసిన వ్యాఖ్య‌ల‌తో ప్ర‌భుత్వం ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌కే మొగ్గు చూపుతున్న‌ట్టు తెలుస్తోంది.

శ‌నివారం రాజ‌మ‌హేంద్ర‌వ‌రంలో ఎంపీ భ‌ర‌త్‌తో క‌లిసి ప‌ర్యావ‌ర‌ణ దినోత్స‌వం సంద‌ర్భంగా శ‌నివారం విద్యాశాఖ మంత్రి ఆదిమూల‌పు సురేష్ మొక్క‌లు నాటే కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌ మీడియాతో మాట్లాడుతూ క‌రోనా తీవ్ర‌త త‌గ్గిన వెంట‌నే రాష్ట్రంలో ప‌ది, ఇంట‌ర్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించేందుకు ప్ర‌భుత్వం సిద్ధంగా ఉంద‌ని తెలిపారు. ప్ర‌తిప‌క్షాలు రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం విమ‌ర్శ‌లు చేస్తున్నాయ‌ని, ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చేయాల‌ని విద్యార్థుల త‌ల్లిదండ్రులు కోర‌డం లేద‌న్నారు. దీంతో విద్యార్థులు, త‌ల్లిదండ్రుల్లో ప్ర‌భుత్వ ఉద్దేశంపై నిర‌స‌న‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. అంతేకాదు ఉపాధ్యాయ వ‌ర్గాల నుంచి కూడా ఈ నిర్ణ‌యంపై వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మవుతోంది. ఇప్ప‌టికే రాష్ట్ర‌వ్యాప్తంగా 700 మంది ఉపాధ్యాయులు, అధ్యాప‌కులు క‌రోనా సెకెండ్ వేవ్ ఉధృతికి ప్రాణాలు కోల్పోయార‌ని,  ప్ర‌భుత్వం ఈ విష‌యాన్నిగుర్తుంచుకోవాల‌ని ఉపాధ్యాయ సంఘాలు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నాయి. విద్యార్థులు, టీచ‌ర్ల ఆరోగ్యంపై ప్ర‌భుత్వం దృష్టి పెట్టాల‌ని, విప‌క్షంపై పంతాల‌కు పోయి ప్ర‌జావ్యతిరేక నిర్ణ‌యాలు తీసుకోవ‌డం మంచిదికాద‌న్న అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బాలయ్య ఓకే అన్నా జూనియర్ నో అంటున్నాడా...?

ఎన్టీఆర్, బాలయ్య ఇద్దరూ తొలిసారి ఇక్కడే కలుసుకున్నారట.. ఎక్కడో తెలుసా..?

త్వరలో సినీ ప్రముఖులతో కేసీఆర్ భేటీ..?

అలా చేద్దామని ప్రతిజ్ఞ చేద్దాం: మహేష్ బాబు

ఈ వెరై "టీ " ట్రై చేశారా...?

హనుమ జన్మ నిర్ధారణలో ఒకడుగు వెనక్కు తగ్గిన టీటీడీ..!

ఆ అశ్లీల వీడియో లో ప్రముఖ నటి.. పోస్ట్ పెట్టి మరీ



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Maddipati Lakshmi Sailaja]]>