MoviesShanmukhaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/pawan-kalyan723d3913-c5c3-4db3-b94e-e32f4377d46d-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/pawan-kalyan723d3913-c5c3-4db3-b94e-e32f4377d46d-415x250-IndiaHerald.jpgపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. తనదైన నటన, పవర్ ఫుల్ డైలాగ్స్‌తో ఎందరో అభిమానులను సంపాదించుకున్నాడు. అతడి వ్యక్తిత్వంతో ఎందరో అతడికి భక్తులయ్యారు. దానికి తోడు బిగ్ స్క్రీన్‌పై పవర్ స్టార్ చేసే రచ్చ గురించి చెప్పాలంటే మాటలు సరిపోవేమో అనిపిస్తాయి. అతడి నటన, టైమింగ్, కథల ఎంపిక ఇలా ప్రతి విషయంలోనూ చాలా..pawan kalyan{#}Pawan Kalyan;kalyan;Raccha;Cinema;Newsవీరమల్లు భారీగా సిద్దమవుతున్నాడట..వీరమల్లు భారీగా సిద్దమవుతున్నాడట..pawan kalyan{#}Pawan Kalyan;kalyan;Raccha;Cinema;NewsSat, 05 Jun 2021 15:30:14 GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. తనదైన నటన, పవర్ ఫుల్ డైలాగ్స్‌తో ఎందరో అభిమానులను సంపాదించుకున్నాడు. అతడి వ్యక్తిత్వంతో ఎందరో అతడికి భక్తులయ్యారు. దానికి తోడు బిగ్ స్క్రీన్‌పై పవర్ స్టార్ చేసే రచ్చ గురించి చెప్పాలంటే మాటలు సరిపోవేమో అనిపిస్తాయి. అతడి నటన, టైమింగ్, కథల ఎంపిక ఇలా ప్రతి విషయంలోనూ చాలా ప్రత్యేకంగా నిలుస్తాడు. అయితే రాజకీయాల తర్వాత మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన పవన్ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. అంతేకాకుండా వాటి అప్‌డేట్స్‌తో అభిమానులను అలరిస్తున్నాడు.
 ప్రస్తుతం పవర్ కళ్యాణ్ ‘అయ్యనుమ్ కోషియం’ రీమేక్‌తో పాటు క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమాను చేస్తున్నాడు. వీటిలో హరిహర వీరమల్లు సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా పవన్ కెరీర్‌లో చేస్తున్న మొట్టమొదటి పీరియాడికల్ డ్రామానే అంతేకాకుండా ఈ సినిమాలో పవన్ ఓ బందిపోటు పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, గ్లింప్స్ సోషల్ మీడియాను షేక్ చేసేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా గురించి ఇప్పటికే అనేక వార్తలు హల్‌చల్ చేశాయి. తాజాగా మరో వార్త నెట్టింట వైరల్ అవుతోంది.
 ఈ సినిమాలో పవన్ నెవ్వర్ బిఫోర్ అనేలా భారీ యాక్షన్ సన్నివేశాలు చేయనున్నాడట. అయితే సినిమాలో యాక్షన్ వేరే లెవెల్లో ఉంటుందని ఇదివరకే మేకర్స్ తెలిపారు. కానీ ఈ సారి వచ్చిన వార్త సినిమా గురించి కాదు. సినిమాలో పవన్ చేసే ఫైట్ల గురించి. ఈ సినిమాలో పవన్ భారీ యాక్షన్‌పైట్స్ చేయనున్నాడట. ఈ ఫైట్లను క్రిష్ ఇంటర్నేషనల్ లెవెల్లో డైరెక్ట్ చేస్తున్నాడట. వీటికి తగ్గట్టుగానే సినిమాలో వీ ఎఫెక్స్ కూడా బారీ రేంజ్‌లో ఉంటాయట. ఇప్పటి వరకు ఈ వార్తలపై అధికారిక ప్రకటన రాలేదు. త్వరలో ఏమైనా క్లారిటీ వస్తుందేమో వేచి చూడాలి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బొల్లారంలో భారీ అగ్నిప్ర‌మాదం..!

అలా చేద్దామని ప్రతిజ్ఞ చేద్దాం: మహేష్ బాబు

ఈ వెరై "టీ " ట్రై చేశారా...?

హనుమ జన్మ నిర్ధారణలో ఒకడుగు వెనక్కు తగ్గిన టీటీడీ..!

ఆ అశ్లీల వీడియో లో ప్రముఖ నటి.. పోస్ట్ పెట్టి మరీ

వివాహ వ్యవస్థ పై పూరీ జగన్నాథ్ వివాదాస్పద కామెంట్స్ !

వామ్మో.. ఈ కరెంటు బిల్లుల దోపిడీ నిజమేనా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Shanmukha]]>