PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/etela-rajendar5b372d7f-f8cf-4607-bcce-28b47a3a5bcc-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/etela-rajendar5b372d7f-f8cf-4607-bcce-28b47a3a5bcc-415x250-IndiaHerald.jpgటీఆర్ఎస్‌ పార్టీ పుట్టిన సరిగ్గా 20 ఏళ్లు. కేసీఆర్‌ చేతుల మీదుగా ప్రాణం పోసుకున్న టీఆర్‌ఎస్‌లో కేసీఆరే సుప్రీం. ఆ విషయంలో డౌట్ లేదు. కానీ.. కేసీఆర్ తర్వాత ఆ స్థాయిలో కొందరు పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత కనుమరుగైపోయారు. ఆలె నరేంద్ర, విజయశాంతి.. ఇప్పుడు ఈటల రాజేందర్. ఈటలకు టీఆర్ఎస్‌తో 18 ఏళ్ల సుదీర్ఘ అనుబంధం ఉంది. అంతే కాదు. ఈటల రాజేందర్ టీఆర్ఎస్‌లో పోషించిన పాత్ర తక్కువేమీ కాదు. 2003లో టీఆర్‌ఎస్‌లో చేరిన ఈటల రాజేందర్ ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఒకసారి టీఆర్ఎస్ శాసనసభాపక్ష నేతగా పని చేశారుetela-rajendar{#}రాజీనామా;Party;KCR;Eatala Rajendar;Telangana Rashtra Samithi TRS;District;Ministerచాప్టర్‌ క్లోజ్‌: టీఆర్‌ఎస్‌లో ఈటల రికార్డులు తెలుసా..?చాప్టర్‌ క్లోజ్‌: టీఆర్‌ఎస్‌లో ఈటల రికార్డులు తెలుసా..?etela-rajendar{#}రాజీనామా;Party;KCR;Eatala Rajendar;Telangana Rashtra Samithi TRS;District;MinisterSat, 05 Jun 2021 09:03:18 GMTటీఆర్ఎస్‌ పార్టీ పుట్టిన సరిగ్గా 20 ఏళ్లు. కేసీఆర్‌ చేతుల మీదుగా ప్రాణం పోసుకున్న టీఆర్‌ఎస్‌లో కేసీఆరే సుప్రీం. ఆ విషయంలో డౌట్ లేదు. కానీ.. కేసీఆర్ తర్వాత ఆ స్థాయిలో కొందరు పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత కనుమరుగైపోయారు. ఆలె నరేంద్ర, విజయశాంతి.. ఇప్పుడు ఈటల రాజేందర్. ఈటలకు టీఆర్ఎస్‌తో 18 ఏళ్ల సుదీర్ఘ అనుబంధం ఉంది. అంతే కాదు. ఈటల రాజేందర్ టీఆర్ఎస్‌లో పోషించిన పాత్ర తక్కువేమీ కాదు.  

2003లో టీఆర్‌ఎస్‌లో చేరిన ఈటల రాజేందర్ ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఒకసారి టీఆర్ఎస్  శాసనసభాపక్ష నేతగా పని చేశారు. రెండుసార్లు మంత్రిగా పనిచేశారు. ఇంకా.. టీఆర్ఎస్ కరీంనగర్‌ జిల్లా అధ్యక్షునిగా పని చేశారు. టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రకార్యదర్శిగా, పొలిట్‌బ్యూరో సభ్యుడిగానూ బాధ్యతలు నిర్వహించారు. ఈటల 2003లో టీఆర్ఎస్‌ లో చేరిన ఈటల రాజేందర్ ఆ మరుసటి ఏడాదే  ఏకంగా అప్పటి మంత్రి ముద్దసాని దామోదర్ రెడ్డిని ఓడించి సంచలనం సృష్టించారు.

ఆ తర్వాత 2008ఉప ఎన్నికల్లోనూ పోటీ చేసి మరోసారి దామోదర్‌రెడ్డిపై మళ్లీ గెలిచారు. 2008లో కేసీఆర్ ఎంపీగా ఎంపికైన నేపథ్యంలో ఈటలను కేసీఆర్ శాసనసభాపక్ష నేతగా నియమించారు. ఇది చాలా కీలకమైన పదవిగా చెప్పొచ్చు. ఒక విధంగా పార్టీలో నెంబర్ టూ స్థానం. ఆ తర్వాత  2009 ఎన్నికల్లో ఈటల కాంగ్రెస్‌ అభ్యర్థి వకుళాభరణం కృష్ణమోహన్‌రావుపై గెలిచారు. 2010ఉపఎన్నికల్లో ఈటల మరోసారి దామోదర్‌రెడ్డిపై గెలిచారు.

తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014లో శాసనసభ ఎన్నికల్లో ఈటల కాంగ్రెస్‌ అభ్యర్థి కె.సుదర్శన్‌రెడ్డిపై గెలిచారు. ఏకంగా ఆర్థిక శాఖ అందుకున్నారు. ఈ శాఖ ఎంత పవర్‌ఫుల్లో తెలిసిందే. ఆ తర్వాత 2018 ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి కౌశిక్‌రెడ్డిపై ఈటల విజయం సాధించారు. ఇలా మొత్తం 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఈటల మరి ఓటమిలేని నేతగా రికార్డు కొనసాగిస్తున్నారు. ఆయన రాజీనామా చేయనున్న నేపథ్యంలో మరోసారి విజేతగా నిలుస్తారా.. లేదా అన్నది చూడాలి.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఇలా చేసి శ్రీమహాలక్ష్మికి ఆగ్రహం తెప్పిస్తున్నారా ?

సీమ‌ను తాకిన నైరుతి...అక్క‌డ అత్య‌ధిక వ‌ర్ష‌పాతం.. !

ఠాగూర్ సినిమాలో హైలెట్ గా నిలిచిన సాంగ్స్..!

శ్యామలాని దారుణంగా ఏకిపారెస్తున్న నెటిజన్స్....

అక్కడ ఓకే అంటే టాలీవుడ్ రెడీ... ?

ఏపీకి శుభవార్త.. రాష్ట్రంలో తగ్గుతున్న కేసులు..

‘బ్రహ్మాస్త్ర’ ఫస్ట్ టీజర్ రిలీజ్ అప్పుడే..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>