MoviesN.ANJIeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/-rain-songs-movies-be2c637e-7f09-4c36-80e1-1e038c798400-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/-rain-songs-movies-be2c637e-7f09-4c36-80e1-1e038c798400-415x250-IndiaHerald.jpgచిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయన సినిమాలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. మెగాస్టార్ చిరంజీవి ఇమేజ్ ని రెండు కాదు మూడింతలు చేసిన సినిమా ఠాగూర్. త‌మిళంలో ఘ‌న విజ‌యం సాధించిన `ర‌మ‌ణ‌`కి ఇది రీమేక్‌. మురుగ‌దాస్ ద‌ర్శ‌కుడు.Rain-songs-movies{#}Chiranjeevi;Cinema;Hero;Uri;Varsham;Teluguఠాగూర్ సినిమాలో హైలెట్ గా నిలిచిన సాంగ్స్..!ఠాగూర్ సినిమాలో హైలెట్ గా నిలిచిన సాంగ్స్..!Rain-songs-movies{#}Chiranjeevi;Cinema;Hero;Uri;Varsham;TeluguSat, 05 Jun 2021 08:00:00 GMTచిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయన సినిమాలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. మెగాస్టార్ చిరంజీవి ఇమేజ్ ని రెండు కాదు మూడింతలు చేసిన సినిమా ఠాగూర్. త‌మిళంలో ఘ‌న విజ‌యం సాధించిన `ర‌మ‌ణ‌`కి ఇది రీమేక్‌. మురుగ‌దాస్ ద‌ర్శ‌కుడు. ఈ సినిమాని తెలుగులో డ‌బ్ చేద్దామ‌నుకున్నారు.

అయితే నిజానికి చిరు ఇమేజ్ కీ `ర‌మ‌ణ‌` క‌థ‌కీ అస్స‌లు సంబంధం ఉండ‌దు. ఆ క‌థ‌లో నిజాయ‌తీ చావ‌కుండా చిరు ఇమేజ్ ని దాటి బ‌య‌ట‌కు రాకుండా ప‌ర్‌ఫెక్ట్ గా మ‌ల‌చుకున్నారు వినాయ‌క్, ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్‌. ఓ మంచి క‌థ దొరికితే దాన్ని హీరో ఇమేజ్ కి త‌గ్గ‌ట్టుగా ఎలా మార్చుకోవాలో చెప్పిన సినిమా ఠాగూర్‌. ర‌మ‌ణ‌తో పోలిస్తే ఠాగూర్ లో చాలా మార్పులు జ‌రిగాయి. అతి పెద్ద మార్పు. .. ఈ సినిమాలో హీరో చ‌నిపోవాలి. అత‌న్ని ఉరి తీస్తారు.

కానీ చిరంజీవి చ‌నిపోతే.. ఫ్యాన్స్ ఒప్పుకోరు. పైగా యాంటీ క్లైమాక్స్ సినిమాలు తెలుగులో ఆడ‌వు. అందుకే ఆ పాత్ర‌ని చంపే సాహ‌సం చేయ‌లేదు. చిరు – శ్రియ‌ల మ‌ధ్య ల‌వ్ ట్రాక్‌, కొడితే కొట్టాలిరా సిక్సు కొట్టాలి లాంటి పాట‌లు, ఫ్లాష్ బ్యాక్‌లో చిరు పెళ్లి చూపుల సీన్ ఇవ‌న్నీ తెలుగులో మాత్ర‌మే క‌నిపించే క‌మ‌ర్షియ‌ల్ అంశాలు. `నేనుసైతం ప్ర‌పంచాగ్నికి స‌మిధ నొక్క‌టి ఆహుతిచ్చాను` లాంటి భావోద్వేగ‌భ‌రిత‌మైన పాట‌లు, స‌న్నివేశాలు ర‌మ‌ణ కంటే ఠాగూర్ ని మిన్న‌గా మార్చాయి. ఇక ఆసుప‌త్రి సీన్ అయితే చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఈ సినిమాని మ‌రో స్థానంలో నిల‌బెట్టాయి.

ఈ సినిమాలోని పాట‌ల‌న్నీ సూప‌ర్ హిట్టే. కొడితే కొట్టాలిరా – చిరు ఇమేజ్‌కి త‌గిన పాట‌. ఈ పాట‌లో `ర‌క్తం పంచిన త‌మ్ముళ్లే మీరు.. ` అనే మాట‌.. ఫ్యాన్స్‌కి పూన‌కం తెప్పించింది. మ‌న్మ‌థా మ‌న్మ‌థా మామ పుత్రుడాలో.. చిరు వీణ స్టెప్పుని కొన‌సాగించాడు. ఇక ఈ సినిమాలో వర్షం సన్నివేశంలో వానొచ్చానంటే వరదొస్తది అనే పాట ప్రేక్షకులను అలరించింది. ఈ సినిమాలో ఓ చిన్న పాత్ర‌లో వినాయ‌క్ క‌నిపిస్తారు. చిరు గ‌త రికార్డుల‌నే కాదు, అప్ప‌టి వ‌ర‌కూ తెలుగు నాట వ‌చ్చిన రికార్డుల‌న్నీ చెరిపేసి కొత్త చ‌రిత్ర సృష్టించింది ఠాగూర్‌.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బైడెన్ చైనా మనిషి అనుకుంటే.. డ్రాగన్ కే షాక్ ఇచ్చాడేంటి?

సీమ‌ను తాకిన నైరుతి...అక్క‌డ అత్య‌ధిక వ‌ర్ష‌పాతం.. !

శ్యామలాని దారుణంగా ఏకిపారెస్తున్న నెటిజన్స్....

అక్కడ ఓకే అంటే టాలీవుడ్ రెడీ... ?

ఏపీకి శుభవార్త.. రాష్ట్రంలో తగ్గుతున్న కేసులు..

‘బ్రహ్మాస్త్ర’ ఫస్ట్ టీజర్ రిలీజ్ అప్పుడే..?

విడాకుల కోసం రచ్చ చేసిన రంభ.. ఎందుకు సైలెంట్ అయ్యింది



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>