PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/stockdale-paradox-0e37ae53-d04a-4830-a8a4-1cf1e0652505-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/stockdale-paradox-0e37ae53-d04a-4830-a8a4-1cf1e0652505-415x250-IndiaHerald.jpgజేమ్స్ స్టాక్‌డేల్ అనే అమెరికన్ సైనికుడు వియత్నాం యుద్ధం లో యుద్ధఖైదీగా మరి కొందరు తోటి అమెరికన్ సైనికులతో సహా దొరికిపోయాడు.. వీరిని జైలులో పెట్టారు. ఇతనితోపాటు ఆ జైలులో ఉన్న సైనికులు, తాము క్రిస్టమస్ కు బయటకొచ్చేస్తామని ఆశించారు. కాని కుదరలేదు. మళ్ళీ న్యూఇయర్ కు వదిలేస్తారను కున్నారు. వదల్లేదు. ఈస్టర్ కు వదులుతారనుకుంటే, అప్పుడూవదల్లేదు. ఇలా ప్రతీ సంవత్సరం వదిలేస్తారనుకుంటే వదలడం లేదు. ఇలా ప్రతీ సంవత్సరం పెట్టుకున్న ఆశ నెరవేరకపోవడంతో రెండు మూడేళ్ళల్లో ఒక్కొక్కరు చచ్చిపోవడం జరిగింది. ఇలా తోటStockdale Paradox{#}James Cameron;Vietnam;Easter;Thota Chandrasekhar;Manam;Kanna Lakshminarayanaఇలా ఆలోచిస్తే.. మీరు కరోనాను గెలిచినట్టే..?ఇలా ఆలోచిస్తే.. మీరు కరోనాను గెలిచినట్టే..?Stockdale Paradox{#}James Cameron;Vietnam;Easter;Thota Chandrasekhar;Manam;Kanna LakshminarayanaSat, 05 Jun 2021 08:00:00 GMTజేమ్స్ స్టాక్‌డేల్ అనే అమెరికన్ సైనికుడు  వియత్నాం యుద్ధం లో యుద్ధఖైదీగా మరి కొందరు తోటి అమెరికన్  సైనికులతో సహా దొరికిపోయాడు.. వీరిని జైలులో పెట్టారు. ఇతనితోపాటు ఆ జైలులో ఉన్న సైనికులు, తాము  క్రిస్టమస్ కు బయటకొచ్చేస్తామని ఆశించారు. కాని కుదరలేదు. మళ్ళీ న్యూఇయర్ కు వదిలేస్తారను కున్నారు. వదల్లేదు. ఈస్టర్ కు వదులుతారనుకుంటే, అప్పుడూవదల్లేదు. ఇలా ప్రతీ సంవత్సరం వదిలేస్తారనుకుంటే వదలడం లేదు. ఇలా ప్రతీ సంవత్సరం పెట్టుకున్న ఆశ  నెరవేరకపోవడంతో రెండు మూడేళ్ళల్లో ఒక్కొక్కరు చచ్చిపోవడం జరిగింది. ఇలా తోటివారందరూ చనిపోతున్నా , జేమ్స్ స్టాక్‌డేల్ మాత్రం బ్రతికే వున్నాడు....!


కారణం.? ఎక్కువగా ఆశ పెట్టుకోవడం ప్రమాదకరం.  మనం అనుకున్నది జరగకపోతే నిరాశకు గురి అవుతాం.  అలాకాకుండా జేమ్స్ స్టాక్‌డేల్  లాగా చివరకు శుభమే ఉంటుందని నమ్మడం కొన్నిసార్లు మంచే చేస్తుంది. జేమ్స్ స్టాక్‌డేల్  మాత్రం ప్రతీ సంవత్సరం, ప్రతీసారి తాను బయటకు వచ్చేస్తానని మాత్రం ఆశించలేదు. ఎప్పటికైనా తాను విడుదల అవుతానని మాత్రం అనుకున్నాడు. ఖచ్చితంగా తాను బయటకువెళ్ళి  తనవాళ్ళను తప్పకుండా కలవగలననే నమ్మకం పెట్టుకున్నాడు.


అంతేగాని... మిగిలినవాళ్ళలాగా పాయింట్ ఆఫ్‌ టైమ్ గురించి గానీ,  పీరియడ్ ఆఫ్ టైమ్ గురించి గాని ఆలోచించలేదు. మిగిలిన వారిలాగా ఎక్కువగా ఆశ పెట్టుకోలేదు.  కాని తనకథ సుఖాంతం అవుతుందని మాత్రం నమ్మకం పెట్టుకున్నాడు. ఆఖరికి ఏడున్నర సంవత్సరాల తరువాత అతను జైలునుండి రిలీజయ్యాడు. కాని తన తోటివారు మాత్రం అప్పటికే చనిపోయారు. ఇలా ఇతను బ్రతకడానికి తోడ్పడిన ఈ ఆలోచనా విధానాన్నే స్టాక్‌డేల్ పారడాక్స్ అంటారు.


ఈ కరోనా సమయంలో ఈ స్టాక్‌డేల్ ఆలోచనా విధానం అందరికీ అవసరం. కరోనా విషయంలో అవసరం. ఇప్పుడు తగ్గుతుంది, అప్పుడు తగ్గుతుందనే ఆశలు పెట్టుకునే కన్నా ఖచ్చితంగా మనం ఈ పాండమిక్ ను దాటుకుని గతంలో లాగానే చక్కగా, సంతోషంగా తిరగగలుగుతామనే నమ్మకాన్ని ఉంచుకుని  ప్రస్తుత పరిస్థితిని అర్థం చేసుకుని, ఓపికగా ఎదురు చూడండి. కరోనాకే బోర్ కొట్టి - అది మనల్ని వదలి వెళ్ళే రోజు  ఎంతో దూరం ఉండబోదు.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బైడెన్ చైనా మనిషి అనుకుంటే.. డ్రాగన్ కే షాక్ ఇచ్చాడేంటి?

సీమ‌ను తాకిన నైరుతి...అక్క‌డ అత్య‌ధిక వ‌ర్ష‌పాతం.. !

ఠాగూర్ సినిమాలో హైలెట్ గా నిలిచిన సాంగ్స్..!

శ్యామలాని దారుణంగా ఏకిపారెస్తున్న నెటిజన్స్....

అక్కడ ఓకే అంటే టాలీవుడ్ రెడీ... ?

ఏపీకి శుభవార్త.. రాష్ట్రంలో తగ్గుతున్న కేసులు..

‘బ్రహ్మాస్త్ర’ ఫస్ట్ టీజర్ రిలీజ్ అప్పుడే..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>