EducationSuma Kallamadieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/education/virgo_virgo/cbse-fb9cb014-8975-4202-ac6e-30227f2efced-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/education/virgo_virgo/cbse-fb9cb014-8975-4202-ac6e-30227f2efced-415x250-IndiaHerald.jpgతాజాగా సీబీఎస్‌ఈ (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్) డేటా సైన్స్, కోడింగ్ వంటి రెండు కొత్త పాఠ్యాంశాలను 6-8వ తరగతి విద్యార్థులకు అదనంగా చేర్చింది. సీబీఎస్‌ఈ 2021-2022 విద్యాసంవత్సరంలో మైక్రోసాఫ్ట్ సంస్థ సహకారంతో 6-8వ తరగతి విద్యార్థులకు కోడింగ్.. 8-12వ తరగతి విద్యార్థులకు డేటా సైన్స్ పాఠ్యాంశాలను కొత్తగా ప్రవేశపెట్టనుంది. కొత్తగా ప్రవేశపెట్టిన పాఠ్యాంశాల కారణంగా విద్యార్థులలో ఆలోచనా విధానం, గణన, సమస్య పరిష్కార నైపుణ్యాలు, సృజనాత్మకత పెరుగుతుందని సీబీఎస్‌ఈ చెబుతోంది. ఈ పాఠ్యాంశాల ద్వారా విదcbse{#}Microsoft;students;Samsung;Apple;Huawei;Nokia;Sony;LG;HTC;Motorola;Redmi;Dell;HP;Acer;Asus;Successకొత్త సబ్జెక్ట్స్ ప్రవేశపెట్టిన సీబీఎస్‌ఈ..?కొత్త సబ్జెక్ట్స్ ప్రవేశపెట్టిన సీబీఎస్‌ఈ..?cbse{#}Microsoft;students;Samsung;Apple;Huawei;Nokia;Sony;LG;HTC;Motorola;Redmi;Dell;HP;Acer;Asus;SuccessSat, 05 Jun 2021 10:00:00 GMTతాజాగా సీబీఎస్‌ఈ (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్) డేటా సైన్స్, కోడింగ్ వంటి రెండు కొత్త పాఠ్యాంశాలను 6-8వ తరగతి విద్యార్థులకు అదనంగా చేర్చింది. సీబీఎస్‌ఈ 2021-2022 విద్యాసంవత్సరంలో మైక్రోసాఫ్ట్ సంస్థ సహకారంతో 6-8వ తరగతి విద్యార్థులకు కోడింగ్.. 8-12వ తరగతి విద్యార్థులకు డేటా సైన్స్ పాఠ్యాంశాలను కొత్తగా ప్రవేశపెట్టనుంది.

కొత్తగా ప్రవేశపెట్టిన పాఠ్యాంశాల కారణంగా విద్యార్థులలో ఆలోచనా విధానం, గణన, సమస్య పరిష్కార నైపుణ్యాలు, సృజనాత్మకత పెరుగుతుందని సీబీఎస్‌ఈ చెబుతోంది. ఈ పాఠ్యాంశాల ద్వారా విద్యార్థులు కొత్త టెక్నాలజీ తెలుసుకునే అవకాశం కూడా ఉందని సీబీఎస్‌ఈ వెల్లడించింది. నూతన విద్యా విధానాన్ని దృష్టిలో పెట్టుకొని.. తరువాతి తరాల నైపుణ్యాలు విద్యార్థులలో పెంచేందుకే కొత్త పాఠ్యాంశాలను అదనంగా చేర్చాలని నిర్ణయించుకున్నట్టు సీబీఎస్‌ఈ వెల్లడించింది.

"ప్రస్తుత ప్రపంచం టెక్నాలజీపై బాగా ఆధారపడుతోంది. అందుకే మన విద్యార్థులు, విద్యావేత్తలకు టెక్నాలజీకి సంబంధించి అవసరమైన జ్ఞానం, నైపుణ్యాలు పెరిగేలా చర్యలు తీసుకోవడం అత్యంత ముఖ్యం. డిజిటల్ ప్రపంచంలో సక్సెస్ కావాలంటే ఖచ్చితంగా టెక్నాలజీ నైపుణ్యాలు పెంచుకోవాలి. కోడింగ్, డేటా సైన్స్ అనే రెండు పాఠ్యాంశాలు మైక్రోసాఫ్ట్ సంస్థ సహకారంతో మేము అభివృద్ధి చేసాము..."

"భవిష్యత్తులో ప్రపంచం వినియోగించే టెక్నాలజీని అర్థం చేసుకునేందుకు ఇప్పుడే మన భారతీయ విద్యార్థులు టెక్నాలజీకి సంబంధించిన అన్ని విషయాలు తెలుసుకోవాలి. కొత్తగా ప్రవేశపెట్టిన పాఠ్యాంశాలతో విద్యార్థులలో అభ్యాస నైపుణ్యాలు పెంచి వారి సొంత కాళ్లపై వారు నిలబడేలా చేయాలి. ఆలోచనా విధానం, గణన, సమస్య పరిష్కార నైపుణ్యాలు, సృజనాత్మకత, రూప కల్పన ఆలోచన విజయానికి కీలకం. ” అని సీబీఎస్‌ఈ ఛైర్మన్‌ మనోజ్‌ ఆహుజా చెప్పుకొచ్చారు.

కోడింగ్, డేటా సైన్స్‌లోని అనుబంధ హ్యాండ్‌బుక్‌లు ఎన్సీఈఆర్టీ నమూనాలు, నిర్మాణాల ప్రకారం అభివృద్ధి చేశారు. ఈ రెండు పాఠ్యాంశాలలో నిజ జీవితంలో ఉపయోగపడే ఉదాహరణలు ఇవ్వబడ్డాయి. వీటిని నేర్చుకోవడం వల్ల విద్యార్థులు నిజ జీవితం లో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించగలరు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

సోమవారం నుంచి ఆనందయ్య మందు పంపిణీ.. కానీ?

ప్ర‌పంచ ప‌ర్యావ‌ర‌ణ దినోత్స‌వం : కరోనాతో కొత్త టెన్షన్!

ఇలా చేసి శ్రీమహాలక్ష్మికి ఆగ్రహం తెప్పిస్తున్నారా ?

సీమ‌ను తాకిన నైరుతి...అక్క‌డ అత్య‌ధిక వ‌ర్ష‌పాతం.. !

ఠాగూర్ సినిమాలో హైలెట్ గా నిలిచిన సాంగ్స్..!

తెలుగు సినిమా ఒక దారిలో హీరోయిన్స్ 'ఆ' దారిలో ?

శ్యామలాని దారుణంగా ఏకిపారెస్తున్న నెటిజన్స్....



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>