HealthGarikapati Rajesheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/corona0661f84f-dda2-49e3-8a84-104c6c5353ca-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/corona0661f84f-dda2-49e3-8a84-104c6c5353ca-415x250-IndiaHerald.jpgరెండోద‌శ‌లో విజృంభిస్తోన్న కొవిడ్ వ‌ల్ల దేశ‌వ్యాప్తంగా మెడిక‌ల్ ఆక్సిజ‌న్ కొర‌త ఏర్ప‌డుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు రాష్ట్రాల మ‌ధ్య నీటి యుద్ధాలే చూశాం.. క‌రోనా పుణ్య‌మా అని ఆక్సిజ‌న్ యుద్ధాలు కూడా చూశాం. ఒక ఆక్సిజ‌న్ ట్యాంక‌ర్ వెళుతోంది అంటే దానివెన‌క ఎస్కార్ట్‌గా ఆ రాష్ట్రానికి చెందిన పోలీసులు ఉంటున్నారు. అంత‌టి కొర‌త ఉన్న ఆక్సిజ‌న్ కోసం ఎదురుచూడ‌కుండా మ‌నం తీసుకునే ఆరోగ్యంద్వారా కూడా స‌హ‌జంగా ఆక్సిజ‌న్ స్థాయులు పెంచుకోవ‌చ్చు. కొన్నిర‌కాల‌ ఆహార పదార్థాలను తరచుగా తీసుకుంటుంటే శ్వాస‌ సామర్థ్యాన్ని పెంచుcorona{#}Aqua;police;saltఆహారంతో ఆక్సిజ‌న్ కొర‌త‌ను త‌రిమికొడ‌దాం!ఆహారంతో ఆక్సిజ‌న్ కొర‌త‌ను త‌రిమికొడ‌దాం!corona{#}Aqua;police;saltSat, 05 Jun 2021 10:09:05 GMT
రెండోద‌శ‌లో విజృంభిస్తోన్న కొవిడ్ వ‌ల్ల దేశ‌వ్యాప్తంగా మెడిక‌ల్ ఆక్సిజ‌న్ కొర‌త ఏర్ప‌డుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు రాష్ట్రాల మ‌ధ్య నీటి యుద్ధాలే చూశాం.. క‌రోనా పుణ్య‌మా అని ఆక్సిజ‌న్ యుద్ధాలు కూడా చూశాం. ఒక ఆక్సిజ‌న్ ట్యాంక‌ర్ వెళుతోంది అంటే దానివెన‌క ఎస్కార్ట్‌గా ఆ రాష్ట్రానికి చెందిన పోలీసులు ఉంటున్నారు. అంత‌టి కొర‌త ఉన్న ఆక్సిజ‌న్ కోసం ఎదురుచూడ‌కుండా మ‌నం తీసుకునే ఆరోగ్యంద్వారా కూడా స‌హ‌జంగా ఆక్సిజ‌న్ స్థాయులు పెంచుకోవ‌చ్చు. కొన్నిర‌కాల‌ ఆహార పదార్థాలను తరచుగా తీసుకుంటుంటే శ్వాస‌ సామర్థ్యాన్ని పెంచుకుని, కరోనా ముప్పు నుంచి బయటపడవచ్చు.

ర‌క్త‌హీన‌త‌ను త‌గ్గించే పుచ్చ‌కాయ‌
ఇడ్లీ, అట్టుతోపాటు సున్నుండ‌ల కోసం మినుములు వాడుతుంటారు. వీటిని తీసుకోవ‌డంవ‌ల్ల ఐరన్‌ పుష్కలంగా ఉండి ఆక్సిజన్‌ స్థాయులు నియంత్రణలో ఉంటాయి. విటమిన్‌-సిని అందించే నారింజ పండు కూడా చాలా మేలు చేస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచ‌డంతోపాటు ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, న్యూట్రియంట్లు శరీరంలో ఆక్సిజన్‌ స్థాయులను పెంచుతాయి. పుచ్చకాయలో నీటి శాతం ఎక్కువ ఇది శరీరాన్ని హైడ్రేట్‌ చేస్తుంది. అలాగే, పుచ్చకాయలోని విటమిన్‌-ఎ రక్తహీనతను తగ్గించి, శ్వాస స్థాయుల‌ను పెంచుతుంది.

వేయించిన జీల‌క‌ర్ర దివ్యౌష‌ధం!
స్ట్రాబెర్రీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్‌, పాలీఫెనాల్‌ కాంపౌండ్స్‌ ఆరోగ్యాన్ని కాపాడుతాయి. ఇందులోని విటమిన్‌-సి శరీరంలోని పోషకాహార లోపాన్ని తగ్గిస్తుంది. యాపిల్‌  పండులో యాంటీ ఆక్సిడెంట్స్‌ పుష్కలంగా ఉంటాయి. వీటిలోని కొన్నిరకాల ఎలిమెంట్స్‌ శరీరంలో కొత్త కణాలు ఏర్పడటానికి తోడ్పడతాయి. యాపిల్‌ తరచూ తీసుకుంటుండాలి. కివీ పండ్లలో యాక్టినైడిన్‌ అనే ఎంజైమ్‌ ఉంటుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. మామిడిపండులోని విటమిన్‌-ఎ, విటమిన్‌-సి రకరకాల వ్యాధులను నివారిస్తాయి. జీలకర్రను వేయించి పొడి చేసుకోవాలి. గోరువెచ్చని నీళ్లలో కలిపి తీసుకోవాలి. ఇది అనీమియాను నివారిస్తుంది. ఉప్పు కలపకుండా జీలకర్రను వేయిస్తేనే, అది ఆక్సిజన్‌ స్థాయిలను పెంచుతుంది. శరీరంలో శ్వాస‌ స్థాయులు స్థిరంగా ఉండాలంటే, విటమిన్‌-డి చాలా అవసరం. ఇది కరోనా నుంచి త్వరగా కోలుకునేలా చేస్తుంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వానపాటల్లో క్లాసిక్ : ఆకుచాటు పిందె తడిసె

ప్ర‌పంచ ప‌ర్యావ‌ర‌ణ దినోత్స‌వం : కరోనాతో కొత్త టెన్షన్!

ఇలా చేసి శ్రీమహాలక్ష్మికి ఆగ్రహం తెప్పిస్తున్నారా ?

సీమ‌ను తాకిన నైరుతి...అక్క‌డ అత్య‌ధిక వ‌ర్ష‌పాతం.. !

ఠాగూర్ సినిమాలో హైలెట్ గా నిలిచిన సాంగ్స్..!

తెలుగు సినిమా ఒక దారిలో హీరోయిన్స్ 'ఆ' దారిలో ?

శ్యామలాని దారుణంగా ఏకిపారెస్తున్న నెటిజన్స్....



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>