PoliticsChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/kcr-7e2d0337-c180-4f3f-ba4d-b6ea12fc2cb2-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/kcr-7e2d0337-c180-4f3f-ba4d-b6ea12fc2cb2-415x250-IndiaHerald.jpgఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనే కాక దేశ వ్యాప్తంగా కరోన టెన్షన్ పెడుతోంది. అయితే హాస్పిటల్లో బెడ్స్ దొరకడం సంగతి పక్కన పెడితే ఇప్పుడు టెస్టులు చేయించాలి అన్నా భయపడి పోతున్నారు. ఏ టెస్ట్ చేయించాలి అన్నా వేలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. ఈ అంశంలో కేసీఆర్ తెలంగాణ ప్రజలకు శుభవార్త అందించారు. ఇవాళ వైద్యారోగ్యశాఖ అధికారులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి, రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పడుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. వైద్య సేవల గురించి, పలు అంశాల మీద అధికారులతో సీఎం చర్చించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఎంపిkcr{#}Telugu;KCR;CM;MP;District;June;Chief Minister;K. Chandrashekar Rao;Heartకేసీఆర్ శుభవార్త: తెలంగాణలో ఇక ఫ్రీ మెడికల్ టెస్ట్ లుకేసీఆర్ శుభవార్త: తెలంగాణలో ఇక ఫ్రీ మెడికల్ టెస్ట్ లుkcr{#}Telugu;KCR;CM;MP;District;June;Chief Minister;K. Chandrashekar Rao;HeartSat, 05 Jun 2021 16:00:00 GMTఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనే కాక దేశ వ్యాప్తంగా కరోన టెన్షన్ పెడుతోంది. అయితే హాస్పిటల్లో బెడ్స్ దొరకడం సంగతి పక్కన పెడితే ఇప్పుడు టెస్టులు చేయించాలి అన్నా భయపడి పోతున్నారు. ఏ టెస్ట్ చేయించాలి అన్నా వేలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. ఈ అంశంలో కేసీఆర్ తెలంగాణ ప్రజలకు శుభవార్త అందించారు. ఇవాళ వైద్యారోగ్యశాఖ అధికారులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి, రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పడుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. వైద్య సేవల గురించి, పలు అంశాల మీద అధికారులతో సీఎం చర్చించారు. 


ఈ సందర్భంగా రాష్ట్రంలో ఎంపిక చేసిన 19 జిల్లా కేంద్రాలలోని, ప్రధాన ప్రభుత్వ దవాఖానాల్లో 19 వైద్య పరీక్ష కేంద్రాలను (డయాగ్నోసిస్ సెంటర్లను) జూన్ 7న ప్రారంభించాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈ డయాగ్నోసిస్ కేంద్రాల్లో మొత్తం 57 రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తారని అందులో కరోనా పరీక్షలతో పాటు రక్త పరీక్ష, మూత్ర పరీక్ష సహా బీపీ, షుగర్, గుండె జబ్బులు, లివర్, కిడ్నీ, థైరాయిడ్ వంటి వాటికి సంబంధించిన ఎక్స్ రే, బయోకెమిస్ట్రీ, పాథాలజీ కి సంబంధించిన పరీక్షలు ఉంటాయన్నారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందిచేందుకు, అన్నిరకాల వైద్యసేవలను మరింతగా అందుబాటులోకి తేవడమే ప్రభుత్వ లక్ష్యం, వైద్యంలో అత్యంత కీలకమైన రోగ నిర్ధారణ పరీక్షా కేంద్రాలు జిల్లా ప్రధాన కేంద్రాల్లో ఏర్పాటు చేస్తున్నానని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. 


ప్రజలకు వైద్యం అత్యంత ఖరీదైన వ్యవహారంగా మారిందన్న ఆయన  పేదలకు జబ్బు చేస్తే నయం చేసుకోవ‌డానికి ఆస్తులను అమ్ముకోవాల్సిన దుస్థితి నెల‌కొందని అన్నారు. రోగం కంటే టెస్టుల‌ ఖరీదే మరీ ఎక్కువైందని కేసీఆర్ పేర్కొన్నారు. ఇక 19 జిల్లాల్లో డయాగ్నోసిస్ కేంద్రాలు ఎల్లుండి ప్రారంభిస్తామని పేర్కొన్న ఆయన ఇంకా అవసరమైన చోట్ల దశల వారీగా డయాగ్నోసిస్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని అన్నారు. ఈ కేంద్రాల్లో 57 రకాల వైద్య పరీక్షలు, అన్ని టెస్టులు పూర్తిగా ఉచితం అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

సికింద్రాబాద్ లో విషాదం..బాలున్ని మింగేసిన నాలా..!

అలా చేద్దామని ప్రతిజ్ఞ చేద్దాం: మహేష్ బాబు

ఈ వెరై "టీ " ట్రై చేశారా...?

హనుమ జన్మ నిర్ధారణలో ఒకడుగు వెనక్కు తగ్గిన టీటీడీ..!

ఆ అశ్లీల వీడియో లో ప్రముఖ నటి.. పోస్ట్ పెట్టి మరీ

వివాహ వ్యవస్థ పై పూరీ జగన్నాథ్ వివాదాస్పద కామెంట్స్ !

వామ్మో.. ఈ కరెంటు బిల్లుల దోపిడీ నిజమేనా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>