EditorialMaddipati Lakshmi Sailajaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/eetela-harishrao00d8a10f-5bcd-43e4-8e0b-d81e9a7f5dd6-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/eetela-harishrao00d8a10f-5bcd-43e4-8e0b-d81e9a7f5dd6-415x250-IndiaHerald.jpgటీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసి బ‌య‌ట‌కు వ‌చ్చిన మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ ఆ పార్టీ నాయ‌క‌త్వంపై విమ‌ర్శ‌ల‌తో విరుచుకుప‌డుతున్న‌విష‌యం తెలిసిందే. టీఆర్ఎస్ పార్టీ కార్యాల‌యం ప్ర‌గ‌తి భ‌వ‌న్ ను బానిన భ‌వ‌న్‌గా ఆయ‌న అభివ‌ర్ణించారు. కేసీఆర్ కుటుంబానికి ఊడిగం చేసేవాళ్లు మాత్ర‌మే ఆ పార్టీలో ఉండ‌గ‌ల‌ర‌ని ఆత్మాభిమానం ఉన్న‌వాళ్లు ఎవ‌రూ ఉండ‌లేర‌ని ఘాటు విమ‌ర్శ‌లు చేశారు.eetela harishrao{#}రాజీనామా;Telangana Rashtra Samithi TRS;MLA;Minister;Party;KCR;Thanneeru Harish Rao;Father;CM;CPIఈటెలా పోతే పోయావు..నా ఊసెందుకు..? హరీష్ఈటెలా పోతే పోయావు..నా ఊసెందుకు..? హరీష్eetela harishrao{#}రాజీనామా;Telangana Rashtra Samithi TRS;MLA;Minister;Party;KCR;Thanneeru Harish Rao;Father;CM;CPISat, 05 Jun 2021 19:25:22 GMTటీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసి బ‌య‌ట‌కు వ‌చ్చిన మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ ఆ పార్టీ నాయ‌క‌త్వంపై విమ‌ర్శ‌ల‌తో విరుచుకుప‌డుతున్న‌విష‌యం తెలిసిందే. టీఆర్ఎస్ పార్టీ కార్యాల‌యం ప్ర‌గ‌తి భ‌వ‌న్ ను బానిన భ‌వ‌న్‌గా ఆయ‌న అభివ‌ర్ణించారు. కేసీఆర్ కుటుంబానికి ఊడిగం చేసేవాళ్లు మాత్ర‌మే ఆ పార్టీలో ఉండ‌గ‌ల‌ర‌ని ఆత్మాభిమానం ఉన్న‌వాళ్లు ఎవ‌రూ ఉండ‌లేర‌ని ఘాటు విమ‌ర్శ‌లు చేశారు. అంతేకాదు పార్టీలోనూ ప్ర‌భుత్వం లోనూ కీల‌క‌నేత‌గా ఉన్న టి. హరీశ్‌రావుకుకూడా ఎన్నో అవ‌మానాలు జ‌రుగుతున్నాయ‌ని, ఆయ‌న కూడా అసంతృప్తితోనే ఉన్నార‌ని ఈట‌ల రాజేంద‌ర్ వ్యాఖ్యానించారు. ఆయ‌న ఆవేశంలోనో, లేక వ్యూహాత్మ‌క‌మో ఏ ఉద్దేశ్యంతో హ‌రీశ్‌రావు విష‌యాన్ని ప్ర‌స్తావించారో తెలియ‌దుగానీ.. త‌న‌ను తాను డిఫెండ్ చేసుకోక త‌ప్ప‌ని ప‌రిస్థితిలోకి హ‌రీశ్‌రావును నెట్టేశారు.

దీంతో మాజీ స‌హ‌చ‌రుడు ఈట‌ల వ్యాఖ్యలపై ఆర్థికమంత్రి హరీశ్ రావు శ‌నివారం ఘాటుగా స్పందించారు. తనపై మాజీ మంత్రి ఈటల చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. ఆయ‌న‌ పార్టీని వీడటానికి ప‌లు కారణాలు ఉండొచ్చని, అది ఆయన ఇష్టమన్నారు. కానీ తన భుజం మీద తుపాకీ పెట్టి కాల్చాలనుకోవడం స‌రికాద‌ని, ఇలాంటి కుట్ర‌లు విఫలమ‌వుతాయ‌న్నారు. ఈటల పార్టీకి చేసిన సేవకన్నా పార్టీ ఆయ‌న‌కు ఇచ్చిన విలువే ఎక్కువని ఆయ‌న బ‌య‌టకు వెళ్లినా వ‌చ్చిన న‌ష్ట‌మేమీ లేద‌ని పేర్కొన్నారు. కేసీఆర్‌ తనకు మార్గదర్శి అని, తండ్రి కంటే ఎక్కువేన‌ని చెప్పారు. కంఠంలో ఊపిరి ఉన్నంత వరకు టీఆర్‌ఎస్‌లోనే ఉంటాన‌ని హ‌రీశ్‌రావు స్ప‌ష్టం చేశారు. త‌న‌యుడు కేటీఆర్‌కు రాజ‌కీయంగా కీల‌క ప‌ద‌విని క‌ట్ట‌బెట్టేందుకు వీలుగా కొంత‌కాలంగా ముఖ్య‌మంత్రి కేసీఆర్.. హ‌రీశ్‌కు పార్టీలోనూ ప్ర‌భుత్వంలోనూ ప్రాధాన్యం త‌గ్గిస్తూ వ‌స్తున్నార‌ని గ‌తంలో వార్త‌లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. అయితే పార్టీలో అసంతృప్తిని ప‌సిగ‌ట్టిన కేసీఆర్ ఈటెల ఉదంతానికి ముందునుంచీ మ‌ళ్లీ హ‌రీశ్‌ను మ‌చ్చిక చేసుకునే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

ఇక క‌మ్యూనిస్టు పార్టీలు సీఎం కేసీఆర్ క‌నుస‌న్న‌ల్లో ప‌ని చేస్తున్నాయ‌ని ఈటెల రాజేంద‌ర్ చేసిన విమ‌ర్శ‌ల‌పై సీపీఐ రాష్ట్ర కార్య‌ద‌ర్శి చాడ వెంక‌ట‌రెడ్డి కూడా స్పందించారు. రాజేంద‌ర్ ఆరోప‌ణ‌లు అవాస్త‌వ‌మ‌ని,ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై నిరంత‌రం పోరాడే త‌మ‌పై అస‌త్య ప్ర‌చారాలు త‌గ‌వ‌ని మండిప‌డ్డారు. అసైన్డ్‌, దేవాల‌య భూములు ఎవ‌రు కొన్నా త‌ప్పేన‌ని  వెంట‌నే ప్ర‌భుత్వానికి అప్ప‌గించాల‌న్నారు. ఇత‌ర నాయ‌కుల‌నూ వివాదంలోకి లాగే ఈటెల ప్ర‌య‌త్నాలు ప్ర‌స్తుతానికి వ్య‌తిరేక ఫ‌లితాన్నే ఇచ్చిన‌ట్టు జ‌రుగుతున్న ప‌రిణామాలు సూచిస్తున్నాయి.  



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బుల్లితెర నటీమణులకు కాస్ట్యూమ్స్ ఎవరు ఇస్తారో తెలుసా?

ఒక్క ప్రోమోతో రూమర్లకు చెక్ పెట్టిన 'ఎన్టీఆర్'..!!

కమర్షియల్ యాడ్స్ తో కోట్లు సంపాదిస్తున్న తెలుగు హీరోలు

ఎన్టీఆర్, బాలయ్య ఇద్దరూ తొలిసారి ఇక్కడే కలుసుకున్నారట.. ఎక్కడో తెలుసా..?

త్వరలో సినీ ప్రముఖులతో కేసీఆర్ భేటీ..?

అలా చేద్దామని ప్రతిజ్ఞ చేద్దాం: మహేష్ బాబు

ఈ వెరై "టీ " ట్రై చేశారా...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Maddipati Lakshmi Sailaja]]>