PoliticsSatyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-eb2cce84-7c8a-4a8a-8d4d-318e6baa3afd-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-eb2cce84-7c8a-4a8a-8d4d-318e6baa3afd-415x250-IndiaHerald.jpgముఖ్యమంత్రి జగన్ తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ నుంచి చాలా కాలంగా అడుగు బయట పెట్టని సంగతి తెలిసిందే. ఆయన అక్కడే ఉంటూ నిరంతరం సమీక్షలు చేస్తూ పాలన కూడా అక్కడ నుంచే సాగిస్తున్నారు. ఇక జగన్ అనూహ్యంగా ఇంకా చెప్పాలంటే అర్జంటుగా ఢిల్లీ టూర్ వేస్తున్నారు. jagan{#}Chief Minister;Tadepalli;Jagan;Delhi;MP;king;Andhra Pradesh;Amith Shah;Prime Minister;raghu;mediaతాడేపల్లి టూ ఢిల్లీ.... ఇంటెరెస్టింగ్ టూర్... ?తాడేపల్లి టూ ఢిల్లీ.... ఇంటెరెస్టింగ్ టూర్... ?jagan{#}Chief Minister;Tadepalli;Jagan;Delhi;MP;king;Andhra Pradesh;Amith Shah;Prime Minister;raghu;mediaSat, 05 Jun 2021 21:00:00 GMTముఖ్యమంత్రి జగన్ తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ నుంచి చాలా కాలంగా అడుగు బయట పెట్టని సంగతి తెలిసిందే. ఆయన అక్కడే ఉంటూ నిరంతరం సమీక్షలు చేస్తూ పాలన కూడా అక్కడ నుంచే సాగిస్తున్నారు. ఇక జగన్ అనూహ్యంగా ఇంకా చెప్పాలంటే అర్జంటుగా ఢిల్లీ టూర్ వేస్తున్నారు.

ఇక ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలవడానికి ఢిల్లీ వెళ్ళడంతో  ఏ రకమైన విశేషం లేదు. పైగా అది రొటీన్ కూడా. కానీ జగన్ వెళ్తున్న సమయం, సందర్భం చూస్తే కనుక దానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయనే చెప్పాలి. ఒక వైపు రెబెల్ ఎంపీ రఘురామ క్రిష్ణం రాజు ఢిల్లీలో ఉంటూనే కధ నడిపిస్తున్నాడు. ఏపీ సర్కార్ మీద ఆయన అలుపెరగని యుద్ధమే చేస్తున్నారు.

ఆయన తాజాగా ఎంపీలకు రాసిన లేఖతో వారంత ఏపీలో సర్కార్ మీద విమర్శలు చేస్తున్నారు. దీంతో ఈ విషయం మీద ఆయన ఢిల్లీ వెళ్ళి రాజకీయంగా కొన్ని లెక్కలు సరి చేస్తారని అంటున్నారు. అలాగే ఏపీలో వ్యాక్సిన కొరత ఉంది. కేంద్రం సరిగ్గా ఇవ్వడంలేదని జగన్ లేఖ రాశారు. దాంతో పాటు బీజేపీయేత సీఎంలతో ఆయన గొంతు కలిపారు. ఈ సమయంలో ఆయన ఢిల్లీ టూర్ చూసినా అసక్తికరమే. ఆయన అమిత్ షా తో ఈ విషయం కూడా ప్రస్తావిస్తారు అంటున్నారు.

ఇక జగన్ డిల్లీ టూర్ లో వీలైతే ప్రధాని మోడీని కూడా కలుస్తారు అంటున్నారు. అలాగే ఆయన రఘు రామ క్రిష్ణం రాజు మీద అనర్హత వేటు వేయాలని కూడా స్పీకర్ కి వినతిపత్రం ఇచ్చి ఉన్నారు. ఇపుడు దాని మీద కూడా దృష్టి సారిస్తారు అంటున్నారు. మరో వైపు పోలవరానికి నిధులు కావాలి. అలాగే ఏపీకి నిధులు కావాలి. ఇంకా రాష్ట్ర సమస్యలు చాలానే ఉన్నాయి. దీంతో జగన్ ఢిల్లీ టూర్ ఇపుడు ఆసక్తిగానే ఉంది. రాజకీయంగా చూసుకున్నా అది హైలెట్ గా ఉండే అవకాశం ఉంది. మొత్తానికి జగన్ ఢిల్లీ వస్తున్నారు అంటేనే జాతీయ మీడియా కూడా ఆసక్తిగానే ఎదురుచూస్తోందని టాక్.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బుల్లితెర నటీమణులకు కాస్ట్యూమ్స్ ఎవరు ఇస్తారో తెలుసా?

ఒక్క ప్రోమోతో రూమర్లకు చెక్ పెట్టిన 'ఎన్టీఆర్'..!!

కమర్షియల్ యాడ్స్ తో కోట్లు సంపాదిస్తున్న తెలుగు హీరోలు

ఎన్టీఆర్, బాలయ్య ఇద్దరూ తొలిసారి ఇక్కడే కలుసుకున్నారట.. ఎక్కడో తెలుసా..?

త్వరలో సినీ ప్రముఖులతో కేసీఆర్ భేటీ..?

అలా చేద్దామని ప్రతిజ్ఞ చేద్దాం: మహేష్ బాబు

ఈ వెరై "టీ " ట్రై చేశారా...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>