PoliticsSuma Kallamadieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/amartya-sen461b2494-72c7-4a66-89a9-b3a8fe65b0f5-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/amartya-sen461b2494-72c7-4a66-89a9-b3a8fe65b0f5-415x250-IndiaHerald.jpgమోడీ సర్కార్ పై ప్రస్తుతం అనేక విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. కరోనా కేసులు గణనీయంగా పెరిగిపోతున్న సమయంలో బీజేపీ పెద్దలు ఎవరు బయటికి వచ్చి మాట్లాడిన సందర్భాలు లేవు కానీ కేసులు తగ్గగానే తమ వల్లే ఇది సాధ్యమైందని అమిత్ షా చెప్పడం విడ్డూరంగా ఉందని ప్రస్తుతం విమర్శలు వస్తున్నాయి. మోడీ తీవ్ర ఉద్వేగానికి గురై కంటతడి పెట్టుకొనగా.. దానిపై కూడా చాలామంది దారుణమైన విమర్శలు చేస్తున్నారు. చేసిందంతా చేసి మొసలి కన్నీళ్లు కార్చడం ఎందుకంటూ అంతర్జాతీయ మీడియాతో పాటు జాతీయ సోషల్ మీడియాలో నెటిజన్లు సెటైర్amartya sen{#}Bharatiya Janata Party;Yevaru;Amith Shah;INTERNATIONAL;Prize;central government;Government;Evening;Event;Shakti;Indiaకేంద్ర ప్రభుత్వ మనోవైకల్యంతోనే కరోనా సంక్షోభం: అమర్త్యసేన్‌కేంద్ర ప్రభుత్వ మనోవైకల్యంతోనే కరోనా సంక్షోభం: అమర్త్యసేన్‌amartya sen{#}Bharatiya Janata Party;Yevaru;Amith Shah;INTERNATIONAL;Prize;central government;Government;Evening;Event;Shakti;IndiaSat, 05 Jun 2021 19:01:00 GMTబీజేపీ పెద్దలు ఎవరు బయటికి వచ్చి మాట్లాడిన సందర్భాలు లేవు కానీ కేసులు తగ్గగానే తమ వల్లే ఇది సాధ్యమైందని అమిత్ షా చెప్పడం విడ్డూరంగా ఉందని ప్రస్తుతం విమర్శలు వస్తున్నాయి. మోడీ తీవ్ర ఉద్వేగానికి గురై కంటతడి పెట్టుకొనగా.. దానిపై కూడా చాలామంది దారుణమైన విమర్శలు చేస్తున్నారు. చేసిందంతా చేసి మొసలి కన్నీళ్లు కార్చడం ఎందుకంటూ అంతర్జాతీయ మీడియాతో పాటు జాతీయ సోషల్ మీడియాలో నెటిజన్లు సెటైర్లు పేలుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ ప్రైజ్ గ్రహీత అమర్త్యసేన్‌ కూడా కేంద్ర ప్రభుత్వ విధానాలపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. భారత ప్రభుత్వం తాము చేసిన పనులకు క్రెడిట్ దక్కించుకునేందుకు వెంపర్లాడింది తప్ప కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు కృషి చేయలేదని ఆయన అన్నారు.

శుక్రవారం నాడు సాయంత్రం రాష్ట్ర సేవాదళ్ ఆర్గనైజ్ చేసిన ఒక ఈవెంట్ లో అమర్త్యసేన్‌ భారత ప్రభుత్వ వైఫల్యాలను వేలెత్తి చూపారు. "కరోనా మహమ్మారిని అంతమొందించడానికి భారత దేశమే ఉత్తమమైన ప్రదేశం ఎందుకంటే.. భారతదేశానికి ఔషధాలు తయారు చేయగల గొప్ప సామర్థ్యం ఉంది.. భారతీయులలో అధిక రోగనిరోధక శక్తి కూడా ఉంది" ఆయన ఆయన అన్నారు. కరోనాను అప్పుడే జయించామని భావించడం వల్లే ప్రస్తుతం కరోనా సంక్షోభం ఏర్పడిందని ఇదే ఈవెంట్ లో పాల్గొన్న మరికొందరు చెప్పుకొచ్చారు.

ప్రభుత్వ విధానాల్లో అయోమయం నెలకొనడం వల్లే సంక్షోభంపై సరిగ్గా స్పందించలేదని.. భారతదేశం తన బలాలను సరిగా వినియోగించలేదని అమర్త్యసేన్‌ అన్నారు. "మహమ్మారి వ్యాప్తి చెందకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవడానికి బదులుగా తాము చేసిన చర్యలకు మెప్పు పొందడానికే భారత ప్రభుత్వం ఎక్కువగా ఆసక్తి చూపింది. కేంద్ర ప్రభుత్వ మనోవైకల్యమే(స్కిజోఫ్రెనియానే) ఇంతటి ఫలితానికి దారి తీసింది. మంచి చేస్తే మెప్పు అదంతట అదే వస్తుంది. క్రెడిట్ అనేది ఒకరి మంచి పనులకు ప్రతీకగా నిలుస్తుంది. కానీ క్రెడిట్ కోసమే.. అదీ మంచి పనులు చేయకుండా.. వెంపర్లాడితే అది బుద్ధిహీనతను చూపుతుంది..."

"మంచి పనులు చేయకుండా క్రెడిట్ కోసం వెంపర్లాడక కూడదు. కానీ కేంద్ర ప్రభుత్వం అదే చేసింది. భారత్ ప్రపంచం మొత్తాన్ని రక్షిస్తుందని మెప్పు పొందేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించింది. కానీ అదే సమయంలో కేంద్రం సమస్య మరింత పెద్దది అయ్యేందుకు అనుమతించి.. దేశవ్యాప్తంగా ప్రజలందరిపై ఆ సమస్య పట్టు బిగించేందుకు కారణం అయ్యింది. మరోపక్క ఆర్థిక వృద్ధి రేటు మందగించింది, నిరుద్యోగుల సంఖ్య తీవ్రంగా పెరిగిపోయింది" అని వ్యాఖ్యానిస్తూ అమర్త్యసేన్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ అసహనం వ్యక్తం చేశారు.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బుల్లితెర నటీమణులకు కాస్ట్యూమ్స్ ఎవరు ఇస్తారో తెలుసా?

ఒక్క ప్రోమోతో రూమర్లకు చెక్ పెట్టిన 'ఎన్టీఆర్'..!!

కమర్షియల్ యాడ్స్ తో కోట్లు సంపాదిస్తున్న తెలుగు హీరోలు

ఎన్టీఆర్, బాలయ్య ఇద్దరూ తొలిసారి ఇక్కడే కలుసుకున్నారట.. ఎక్కడో తెలుసా..?

త్వరలో సినీ ప్రముఖులతో కేసీఆర్ భేటీ..?

అలా చేద్దామని ప్రతిజ్ఞ చేద్దాం: మహేష్ బాబు

ఈ వెరై "టీ " ట్రై చేశారా...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>