MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-babu516c0188-b491-40cc-ab95-ee62f3835262-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-babu516c0188-b491-40cc-ab95-ee62f3835262-415x250-IndiaHerald.jpgఈరోజు అనగా జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం కాగా.. ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని సంరక్షించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను గుర్తు చేసుకుంటున్నారు. ప్రముఖులు మన భూగ్రహాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నారు. ముఖ్యంగా సినీ సెలబ్రిటీలు పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు తమ వంతు కృషి చేస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ సెల‌బ్రిటీస్ త‌మ ట్విట్ట‌ర్ ఖాతాలలో పర్యావరణ వ్యవస్థలను పర్యవేక్షించడం ఎంత ముఖ్యమో వివరిస్తున్నారు. జంతువులను, మొక్కలను కాపాడాలి,mahesh babu{#}mahesh babu;June;Tollywood;CBN;Sarileru Neekevvaruఅలా చేద్దామని ప్రతిజ్ఞ చేద్దాం: మహేష్ బాబుఅలా చేద్దామని ప్రతిజ్ఞ చేద్దాం: మహేష్ బాబుmahesh babu{#}mahesh babu;June;Tollywood;CBN;Sarileru NeekevvaruSat, 05 Jun 2021 12:30:00 GMTజూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం కాగా.. ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని సంరక్షించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను గుర్తు చేసుకుంటున్నారు. ప్రముఖులు మన భూగ్రహాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నారు. ముఖ్యంగా సినీ సెలబ్రిటీలు పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు తమ వంతు కృషి చేస్తున్నారు.


ప్రస్తుతం టాలీవుడ్ సెల‌బ్రిటీస్ త‌మ ట్విట్ట‌ర్ ఖాతాలలో పర్యావరణ వ్యవస్థలను పర్యవేక్షించడం ఎంత ముఖ్యమో వివరిస్తున్నారు. జంతువులను, మొక్కలను కాపాడాలి, ప్రతి ఒక్కరూ చెట్లను పెంచాలి, అడవులను నాశనం చేయకుండా వాటిని ఇంకా అభివృద్ధి చేయాలి అని చెబుతూ సెలబ్రెటీలు ప్రజల్లో అవగాహన పెంచుతున్నారు. ఈ నేపథ్యంలోనే సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా పర్యావరణ వ్యవస్థలను కాపాడాలని ప్రతిజ్ఞ చేద్దాం అంటూ ట్విట్టర్ లో ఒక పోస్ట్ పెట్టారు. 

" style="height: 332px;">


"ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవం రోజున.. మరింత స్థానభ్రష్టత పరిస్థితులలో ఉన్న పర్యావరణ వ్యవస్థలను పునఃసృష్టించి, పునరుద్ధరించాలని ప్రతిజ్ఞ చేద్దాం. మన భూ గ్రహాన్ని పచ్చగా మార్చడానికి ప్రయత్నిద్దాం!" అని ప్రిన్స్ మహేష్ బాబు ట్విట్టర్ వేదికగా పిలుపునిచ్చారు. కాగా ప్రస్తుతం మహేష్ బాబు ట్వీట్ నెట్టింట్లో వైరల్ అవుతుంది. ఇకపోతే సినిమాల చిత్రీకరణలు ఆగిపోవడంతో ఇంటికే పరిమితమైన మహేష్ బాబు తనకు, తన కుటుంబానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా తరచూ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు.



ఇక మహేశ్‌ బాబు సినిమాల విషయానికి వస్తే.. ఆయన పరుశురామ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ‘సర్కారు వారి పాట’ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. మహేష్ బాబు ఈ సినిమా పూర్తి కాగానే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కలిసి మరో సినిమా చేయనున్నారు. గత ఏడాది సరిలేరు నీకెవ్వరు చిత్రంతో భారీ హిట్ అందుకున్న మహేష్ తన తదుపరి సినిమాలతో కూడా అదిరిపోయే విజయాలు సాధించాలని ప్లాన్ చేస్తున్నారు. అందుకే ఆయన ఫామ్ లో ఉన్న దర్శకులు లతోనే సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

యంగ్ డైరెక్టర్‌తో యంగ్ టైగర్ సినిమా పక్కా కాలేదట..!

ఈ వెరై "టీ " ట్రై చేశారా...?

హనుమ జన్మ నిర్ధారణలో ఒకడుగు వెనక్కు తగ్గిన టీటీడీ..!

ఆ అశ్లీల వీడియో లో ప్రముఖ నటి.. పోస్ట్ పెట్టి మరీ

వివాహ వ్యవస్థ పై పూరీ జగన్నాథ్ వివాదాస్పద కామెంట్స్ !

వామ్మో.. ఈ కరెంటు బిల్లుల దోపిడీ నిజమేనా..?

ప్ర‌పంచ ప‌ర్యావ‌ర‌ణ దినోత్స‌వం : కరోనాతో కొత్త టెన్షన్!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>