MoviesChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/do-you-know-which-city-these-anchors-areb745d3c2-9f66-48c2-b68a-0abd7f9d9921-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/do-you-know-which-city-these-anchors-areb745d3c2-9f66-48c2-b68a-0abd7f9d9921-415x250-IndiaHerald.jpgతెలుగు యాంకర్ల కట్టుబొట్టు మొదలు ప్రవర్తన కూడా పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు టాప్ యాంకర్స్ గా చలామణి అయిన సుమ, ఝాన్సీ, శిల్పా చక్రవర్తి, ఉదయభాను లాంటి వాళ్ళు ఎక్కడా అందాల ప్రదర్శన జోలికి పోయే వారు కాదు. ఎప్పుడైతే జబర్దస్త్ షో ద్వారా అనసూయ, రష్మి గౌతమ్ ఎంట్రీ ఇచ్చారో, పూర్తిగా తెలుగు యాంకర్స్ కట్టుబొట్టు మారిపోయింది. యాంకరింగ్ అంటే చీరకట్టు తోనో లేక చుడిదార్ లో కనిపించవలసిన అవసరం లేదని చెబుతూ మోడ్రన్ డ్రస్సులు వేసుకుని కుర్రకారు మతి పోగొట్టే విధంగా చేస్తున్నారు. వాస్తవానికి జబర్దస్త్ షో లో అంతగాtollywood{#}Telugu;shilpa;udaya bhanu;Jabardasth;rashmi gautham;trivikram srinivas;vishnu priya;Reddy;television;Sreemukhi;anasuya bharadwaj;Anasuya;mediaతెలుగు యాంకర్స్ కి ఏమైంది.. ఇంతగా చూపించాలా ?తెలుగు యాంకర్స్ కి ఏమైంది.. ఇంతగా చూపించాలా ?tollywood{#}Telugu;shilpa;udaya bhanu;Jabardasth;rashmi gautham;trivikram srinivas;vishnu priya;Reddy;television;Sreemukhi;anasuya bharadwaj;Anasuya;mediaSat, 05 Jun 2021 07:13:00 GMTతెలుగు యాంకర్ల కట్టుబొట్టు మొదలు ప్రవర్తన కూడా పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు టాప్ యాంకర్స్ గా చలామణి అయిన సుమ, ఝాన్సీ, శిల్పా చక్రవర్తి, ఉదయభాను లాంటి వాళ్ళు ఎక్కడా అందాల ప్రదర్శన జోలికి పోయే వారు కాదు. ఎప్పుడైతే జబర్దస్త్ షో ద్వారా అనసూయ, రష్మి గౌతమ్ ఎంట్రీ ఇచ్చారో, పూర్తిగా తెలుగు యాంకర్స్ కట్టుబొట్టు మారిపోయింది. యాంకరింగ్ అంటే చీరకట్టు తోనో లేక చుడిదార్ లో కనిపించవలసిన అవసరం లేదని చెబుతూ మోడ్రన్ డ్రస్సులు వేసుకుని కుర్రకారు మతి పోగొట్టే విధంగా చేస్తున్నారు. వాస్తవానికి జబర్దస్త్ షో లో అంతగా అందాలు ప్రదర్శించాల్సిన అవసరం లేదు, అదేదో సందర్భంలో త్రివిక్రమ్ అన్నట్టుగా అక్కడ స్పేస్ లేకపోయినా క్రియేట్ చేసుకున్నట్లు వీరు కూడా అవసరం లేకపోయినా అందాల ఆరబోతకు ప్రాధాన్యం ఇస్తూ వచ్చారు. 


మరి వీళ్ళను ఆదర్శంగా తీసుకున్నారో ఏమో తెలియదు కానీ వీరి దారిలో తరువాత యాంకర్స్ గా ఫేమస్ అవుతున్న శ్రీముఖి, మంజుల, విష్ణు ప్రియ ఇప్పుడు కొత్తగా అషు రెడ్డి లాంటి వారంతా అందాల ప్రదర్శనకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. టీవీ తెర మీద కాస్తోకూస్తో పద్ధతిగానే కనిపిస్తున్నా సరే సోషల్ మీడియాలో మాత్రం హద్దులేవీ లేకుండా రెచ్చిపోతున్నారు. శ్రీముఖి విష్ణుప్రియ లాంటివాళ్ళు ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫోటో షూట్లతోనే కాక విచిత్రమైన డ్యాన్సులతో రెచ్చిపోతున్నారు. వాస్తవానికి వీళ్ళు చేసే కార్యక్రమాలకు అందాల ప్రదర్శనతో ఏమాత్రం సంబంధం లేదు. 


పోనీ సినిమాల కోసం అనుకుందామా అంటే సినిమాలలో అనసూయ లాంటి వాళ్ళు తప్ప మిగతా ఎవ్వరూ అవకాశాలు అందుకున్న దాఖలాలు కానీ, ఒకవేళ అవకాశాలు అందుకుంటే వాటిని సద్వినియోగం చేసుకున్న దాఖలాలు లేవు. అయినా సరే అందాల ఆరబోతకు ప్రాధాన్యం ఇస్తూ అశ్లీలతను పెంచి పోషిస్తున్నారని ఒక వర్గం విమర్శిస్తోంది. మొన్నటికి మొన్న విష్ణు ప్రియ ఒక హాట్ ఫోటో షూట్ చేసి తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తే ఒక అభిమాని అక్క ఇది ఏంటి ? మీ విష్ణు ప్రియ ఇలా చూపెడుతోంది అంటూ మిగతా వాళ్లు అంటున్నారు మొఖం చూపెట్టు కోలేక పోతున్నాను అంటే, తన ఫీల్డ్ అలాంటిది అని ఏమీ చేయలేనని విష్ణుప్రియ చెప్పుకు రావడం గమనార్హం. విష్ణుప్రియ అనే కాదు దాదాపు మిగతా యాంకర్లు అందరూ అవసరం లేకపోయినా ఈ అందాల ప్రదర్శనతో చర్చనీయాంశంగా మారుతున్నారు. మరి ఈ ట్రెండ్ ఎప్పటికి మారుతుందో వేచి చూడాలి మరి. 

 

 




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బైడెన్ చైనా మనిషి అనుకుంటే.. డ్రాగన్ కే షాక్ ఇచ్చాడేంటి?

సీమ‌ను తాకిన నైరుతి...అక్క‌డ అత్య‌ధిక వ‌ర్ష‌పాతం.. !

ఠాగూర్ సినిమాలో హైలెట్ గా నిలిచిన సాంగ్స్..!

శ్యామలాని దారుణంగా ఏకిపారెస్తున్న నెటిజన్స్....

అక్కడ ఓకే అంటే టాలీవుడ్ రెడీ... ?

ఏపీకి శుభవార్త.. రాష్ట్రంలో తగ్గుతున్న కేసులు..

‘బ్రహ్మాస్త్ర’ ఫస్ట్ టీజర్ రిలీజ్ అప్పుడే..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>