PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/tdp3ffdd1fa-55d0-4a8b-ab0e-e2d95e4663d5-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/tdp3ffdd1fa-55d0-4a8b-ab0e-e2d95e4663d5-415x250-IndiaHerald.jpgఅధికారం కోసం రాజకీయ నేతల జంపింగ్‌లు సహజమే. అయితే ఆ జంపింగ్‌లే శాశ్వతంగా రాజకీయ జీవితానికి అడ్డంకులుగా మారే అవకాశాలు లేకపోలేదు. రాజకీయ భవిష్యత్ కూడా ఉండదు. అలా రాజకీయ భవిష్యత్‌ని తమకు తామే దెబ్బ తీసుకున్న వారిలో మాజీ ఎమ్మెల్యేలు వంతల రాజేశ్వరి, గిడ్డి ఈశ్వరిలు ముందు ఉంటారు. ప్రస్తుతం రాజకీయాల్లో అడ్రెస్ లేకుండా ఉన్న ఈ ఇద్దరు మహిళా నేతలు, ఒకవేళ వైసీపీలో ఉండి ఉంటే వారి పరిస్తితి వేరుగా ఉండేది.TDP{#}YCP;Giddi Eswari;District;East;Rampachodavaram;CBN;politics;Hanu Raghavapudi;TDPఆ లేడీ నేతలకు టీడీపీలో ఛాన్స్ లేనట్లేనా?ఆ లేడీ నేతలకు టీడీపీలో ఛాన్స్ లేనట్లేనా?TDP{#}YCP;Giddi Eswari;District;East;Rampachodavaram;CBN;politics;Hanu Raghavapudi;TDPSat, 05 Jun 2021 17:00:00 GMTఅధికారం కోసం రాజకీయ నేతల జంపింగ్‌లు సహజమే. అయితే ఆ జంపింగ్‌లే శాశ్వతంగా రాజకీయ జీవితానికి అడ్డంకులుగా మారే అవకాశాలు లేకపోలేదు. రాజకీయ భవిష్యత్ కూడా ఉండదు. అలా రాజకీయ భవిష్యత్‌ని తమకు తామే దెబ్బ తీసుకున్న వారిలో మాజీ ఎమ్మెల్యేలు వంతల రాజేశ్వరి, గిడ్డి ఈశ్వరిలు ముందు ఉంటారు. ప్రస్తుతం రాజకీయాల్లో అడ్రెస్ లేకుండా ఉన్న ఈ ఇద్దరు మహిళా నేతలు, ఒకవేళ వైసీపీలో ఉండి ఉంటే వారి పరిస్తితి వేరుగా ఉండేది.


అసలు ఈ ఇద్దరు 2014లో వైసీపీ తరుపున ఎమ్మెల్యేలుగా గెలిచారు. గిడ్డి ఈశ్వరి విశాఖ జిల్లా పాడేరు నియోజకవర్గం నుంచి గెలిస్తే, రాజేశ్వరి తూర్పు గోదావరి రంపచోడవరం నుంచి గెలిచారు. అయితే అప్పుడు వైసీపీ ప్రతిపక్షంలో ఉంది. కానీ ఉన్నన్ని రోజులు జగన్‌కు అండగా నిలబడిన ఈ నేతలు, చంద్రబాబు ఆపరేషన్ ఆకర్ష్‌లో భాగంగా టీడీపీలో చేరిపోయారు. అసలు ఒకానొక దశలో గిడ్డి ఈశ్వరి, చంద్రబాబుపై తీవ్ర విమర్శలు సైతం చేశారు. అయితే రాజకీయాలు ఎప్పుడు ఒకేలా ఉండవుగా, అందుకే తర్వాత ఈశ్వరి టీడీపీలోకి రాగలగలిగారు.


టీడీపీలోకి వచ్చాక అధికారం దక్కింది. దీంతో అధికారం ఉన్నన్ని రోజులు ఈ ఇద్దరు మహిళా నేతలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పోయింది. కానీ 2019 ఎన్నికల్లో మాత్రం సీన్ రివర్స్ అయింది. ఈ ఇద్దరు టీడీపీ నుంచి పోటీ చేసి ఘోరంగా ఓడిపోయారు.


ఇక ఓడిపోయాక ఈ ఇద్దరు టీడీపీలో పెద్దగా కనిపించడం లేదు. దీంతో రెండు నియోజకవర్గాల్లో టీడీపీ పరిస్తితి మరీ ఘోరంగా ఉంది. ఒకవేళ ఈ ఇద్దరు మళ్ళీ టీడీపీ తరుపున నిలబడిన కూడా గెలుపు కష్టమే అని అర్ధమవుతుంది. ఎందుకంటే ఏజెన్సీ ప్రాంతాలుగా ఉన్న పాడేరు, రంపచోడవరం నియోజకవర్గాల్లో ప్రజలు వైసీపీకి ఎక్కువ మద్ధతు ఇస్తున్నారు. అందుకే ఈ రెండుచోట్ల టీడీపీకి భవిష్యత్ కనిపించడం లేదు. 




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

తమన్నా తో రొమాన్స్.. ఆ హీరో హ్యాండిల్ చేయగలడా!

అలా చేద్దామని ప్రతిజ్ఞ చేద్దాం: మహేష్ బాబు

ఈ వెరై "టీ " ట్రై చేశారా...?

హనుమ జన్మ నిర్ధారణలో ఒకడుగు వెనక్కు తగ్గిన టీటీడీ..!

ఆ అశ్లీల వీడియో లో ప్రముఖ నటి.. పోస్ట్ పెట్టి మరీ

వివాహ వ్యవస్థ పై పూరీ జగన్నాథ్ వివాదాస్పద కామెంట్స్ !

వామ్మో.. ఈ కరెంటు బిల్లుల దోపిడీ నిజమేనా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>